తిరువెంబావాయ్-06
***************
మానే ని నెన్నలై నాళివన్ దుంగళై
నాణే ఎళుప్పువన్ ఎన్రళుం నాణామే
పోనది శై పగరార్ ఇన్నం పులరిండ్రో
వాణే నిలానే పిరవే అరివరియాన్
దానే వందెమ్మై తలయెడిత్తాల్ కొండొరుళుం
వాణ్వార్ కళల్ పాడి వందోర్కుం వాయ్ తిరవాయ్
ఊనే ఉరుగాయ్ ఉనక్కే ఉరుం ఎమక్కుం
ఏనోర్కుం తంగోనై పాడేలో రెంబావాయ్
వాణే నిలనే పిరవే సర్వాంతర్యామి పోట్రి
**************************************
ఐదవ పాశురములో తిరు మాణిక్యవాచగరు స్వామి సర్వ వ్యాపలత్వమును నేల-నింగి-మధ్య ప్రదేశమును పేర్కొనినారు. న్యాలమే-విణ్ణే అంటు
ఈ పాశురములో ,
వాణే-నిలనే అంటు సామి తిల్లై వనమునకు మనమీద అనుగ్రహముతో వేంచేసినారని అవతార అనుగ్రహమును
కీర్తించినారు.
ఈ పాశురములో మేల్కొలుప బడుచున్న బాలిక భీత హరిణేక్షణ.లేత వయసుగల బాలిక అని ఆమె మాటల ద్వారా ప్రకటింప బడుతున్నది.కనుకనే,
నిన్నెలైనాళ్-నిన్నటిరోజున ఆమె తన చెలులతో,
నాణే వందు-నేనే మీ దగ్గరకు వచ్చి,
నాణే ఎళుప్పువన్-మిమ్ములను మేల్కొలుపుతాను అని చెప్పినది ( వారు అడుగకుండాబ్నే)
కాని ఆ మాట ఎక్కడికి పోయినదిఎ,
నాణమే పోనదిశై-ఆ చెప్పిన మాట ఏమైనది/ఎటు పోయినది/దానిని మరిచి నిదురించుచున్నావు అని అంటు చెలిని మేల్కొలుపుతున్నారు.
వారు స్వామి అవ్యాజ అనురాగ ఆశీర్వచనమునకు గుర్తుగా,వాణే-ఆకాసమునుండి,
నిలవే-భూమి మీదకు (సాకారముగా)
తలన్ అడిత్తల్-తన దివ్యపాద సంసేవనా భాగ్యమును మనకు ప్రసాదించుటకు,
తానే వందు-తనకు తానుగా తరలి వచ్చినాడు.
నీవు తలుపుతీసేలోపల కనీసము నేను వస్తున్నానంటు,
వాయ్ తిరవాయ్-నోరు తెరిచి,వందోర్కు-వస్తున్నానని పలుకవమ్మా.
నీవు వచ్చిన తరువాత మనమందరము కలిసి,
వణ్వార్-అతి పవిత్రమైన/విశేషమైన/విబూతిని అందించకల,
కళల్-మహిమలు గల/తేవారములు/పాశురములు/స్తోత్రములు
పాడి-పాడుదాము/సంకీర్తనలు చేద్దాము.
అందువలన,
ఉనక్కు-నీకు,
ఉరు-స్వామి అనుగ్రహము
ఏనోర్కుం-మనందరికి కలుగుతుంది.
ఈ వ్రతభాగముగా భక్తితో స్వామిని/స్వామి అనురాగమును/అనుగ్రహమును కీర్తించి
తంగొనై- సమానధికములేని పరమాత్మను,
తనివితీర కీర్తించి తరించుదాము.
తిరు అన్నామలయై అరుళ ఇది
అంబే శివే తిరువడిగళే పోట్రి.
నండ్రి.వణక్కం.