శ్రీచక్రధారిణి-03-సర్వసంక్షోభణ చక్రము.
****************************
ప్రార్థన
*********
" తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితే నవై
అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యసి"
ఇప్పటి వరకు
**********
అమ్మ దయతో సాధకుడు తన మూలాధారములో,స్వాధిష్ఠానములో కదలికలనుపొంది జాగ్రత్-స్వప్న అవస్థలను స్థూల-సూక్షదేహములతో అనుభవించి,మూడవ ఆవరణమైన "సర్వసంక్షోభణ చక్ర "ప్రవేశము చేస్తున్నాడు.తేజసుడు-ప్రజ్ఞ గా తన స్వభావ నామమును మార్చుకుంటున్నాడు.సుషుప్తి అవస్థను తన కారణ శరీరముతో అనుభవించబోతున్నాడు.దానికి కారణము ఆ జీవి చేసుకొనిన కర్మల ఫలితములను అందుకొనవలసిన ఆవశ్యకత.
ఇప్పుడు
*****
విచిత్రముగా దేహము
చలాకిగా లేదు.కలలు లేవు.ఇక్కడ త్రిగుణములు-త్రి అవస్థలు-త్రి శరీరములు ఒక్కటిగా మారబోతున్నాయి.దేహము ఉంది కాని దేహాభిమానములేదు.మనసు ఉంది కాని మనోభావములు కావు.ఇప్పటివరకు సాధకునిలో దాగిన చైతన్యము అతనిని సాక్షీభూతముగా చూస్తున్నది నిమిత్తమాత్రముగా.ఏమి జరుగబోతున్నదో?
పరమేశ్వరుడు పార్వతీదేవితో మహేశాని అని సంబోధిస్తూ,
" అష్టపత్రం మహేశాని జపాకుసుమ సన్నిభం
"సర్వ సంక్షోభణం" నామ సర్వకామ ప్రపూరకం"
అని వివరించారు.
చక్రము ఈశ్వరబీజమైన హ కారముతో నిండియున్నది.
అనంగ/ఆకాశ తత్త్వమును కలిగియున్నది.
సర్వాకర్షిణి ముద్రాశక్తి-మహిమాసిద్ధి అనుగ్రహప్రదమైనది.
పరబ్రహ్మ తలపుల మన్మథ ప్రాధాన్యతను కలిగియున్నది.
మన్మథుని అనంగుడు/శరీరములేనివాడు అని అంటారు కదా.ఇక్కడి యోగినులను సైతము అనంగ యోగినులు/గుప్తతర యోగినులు అంటారు.
తనతో తాను సంభాషించుట స్వగతము.ఎవ్వరు గుర్తించలేని తనలో జరిగిన విశషము "గుప్తము" స్వప్నము గుప్తము.వ్యక్తి చెబితేకాని ఇతరులకు తెలియదు.
తన నుండి ఆవిర్భవించుచున్న ఆలోచనలద్వారా తనకు తెలియకుండానే మార్పులను తెచ్చే యోగినులు "గుప్తతర యోగినులు>"
నిన్న కలవచ్చింది/మొన్న వచ్చింది అని చెప్పగలము అది గుప్తమైనప్పటికిని.
నాలో ఈమార్పు వచ్చినది ఈమధ్యన అంటాము కాని సరిగా ఎప్పుడు వచ్చిందో ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో చెప్పలేము జ్కనుక ఆ మార్పు గుప్తతరము.
సాధకునిలో ఈ చక్రము నాభిస్థానములో ఉంటుంది.
త్రిపురములను ఏకముచేసే మాతయే చక్రేశ్వరి "త్రిపురసుందరి" మాత.
స్తోత్రము
******
శ్రీచక్ర తృతీయావరణదేవతాః
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,
అను ఎనిమిది యోగినులను కలిగియుంటుంది.
"సంక్షోభణము" అనగా స్పందనము.సర్వములో స్పందనమును కలిగించే స్పందన/కదలికల శక్తి.
పెద్దలు అనంగ శబ్దమును మన్మథపరముగాను/అఖండమైన ఆకాశ పరముగాను అన్వయిస్తారు.వ్యక్తి పరముగాను/విశ్వ పరముగాను భావిస్తారు.
దేని సంకేతములు ఎనిమిది యోగినులు?
1.జ్ఞానేంద్రియ+కర్మేంద్రియ+ప్రవృత్తి+ఉపేక్ష+నివృత్తికి సంకేతములు అనికొందరి భావన.
2.పంచప్రానములు-ప్రవృత్తి+ఉపేక్ష+నివృత్తికి అని మరికొందరి విశ్వాసము
3.అష్టదిక్కులుగాను భావిస్తారు.
మన్మథపరముగా గమనిస్తే వ్యక్తులలోని,
1.భావవ్యక్తీకరణము
2.భావ సంగ్రహనము
3.భావ కదలికలు
4.భావ నిర్మూలనములు
5.మితిమీరిన ఉత్సాహము
6.కొత్తదానికి దగ్గరగుట
7.ఉన్నదానిని దూరము చేసుకొనుట
8.తటస్థభావముతో నుండుట
అన్నీ ఈశ్వర సంకల్పములే.
మన్మథపరముగా గమనిస్తే విశ్వములోని,
1.భూమికి తిరుగు సంకల్పము
2.జలమునకు ప్రవాహ తత్త్వము
3.అగ్నికి ఊర్థ్వ గమనశక్తి(మంటగా పైకిలేచు శక్తి)
4.వాయువునకు మంద్రముగాను/తీవ్రముగాను వీచు శక్తి
5.ఆకాశమునకు వ్యాపకశక్తి
6.సృఋష్టించుశక్తి
7.దానిని చూస్తు తటస్థముగా నుండు శక్తి
8.విడిచిపెట్టు తిరోధానశక్తి.
ఆకాశమునూండి మిగిలిన నాలుగు భూతములు ప్రకటింపబడి అంగములుగా మారినవి.ఆ నాలుగు భూతములు తిరిగి ఆకాశమును చేరినచో ఆకాశము అనంగమే/అఖండమే.
ఆ మార్పులను ప్రకటనముచేయు శక్తులే "గుఒతతర యోగినులు."
" ఆనందో బ్రహ్మ స్థితి"
"అర్థం చెసుకునే వారికి అర్థము చేసుకున్నంత."
మనముచ్చట.
***********
మనము లావయ్యమని-సన్నపడ్దామని,చర్మమునకుముడుతలు వచ్చాయని,జుట్టు తెల్లబడుందని తెలుసుకుంటాము కాని సరియైన సమయము,సరియైన పరిణామము చెప్పలేము.
అంతేకాదు పూజచేయాలనో-పుణ్యక్షత్రమును చూడాలనో,నోములు నోచుకోవాలనో సంకల్పం పుడుతుంది.ఈ గుప్తతర యోగినులు వాటిని క్రమబద్ధీకరించి,అడ్దంకులను తొలగించి నిన్ను సృష్టిచక్ర త్రయ స్థితి నుండి స్థితిచక్ర ప్రవేశమునకు అర్హునిగా చేస్తారు.
" నమో ఆకాశ తత్త్వే పంచభూతాత్మక పుష్పం సమర్పయామి."
సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.