శ్రీచక్ర నవమావరణదేవతాః
శ్రీచక్ర నవమావరణదేవతాఃశ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,
Thursday, September 1, 2022
SARVASIDDHIPRADACHAKRAMU-AVARANAM-08
శ్రీచక్ర అష్టమావరణదేవతాః
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,
సర్వసిద్ధిప్రదచక్రము
***********************
ఆత్మార్పణమే అతిరహస్యము.ఆత్మార్పనమును అందించే శక్తులు అతిరహస్య యోగినులు.సాధకుడు ఏడవ ఆబ్వరనములో ప్రసాదించబడిన ఆయుధములను సైతము ఇక్కడ విడిచివేస్తాడు.అవి సాధకుని గమ్యముచేర్చగల నిచ్చెన వంటి సాధనములు మాత్రమే.తత్ఫలితముగా త్రిగుణములు దూరమై దర్పణమువంటి తన మనసులో మూలశక్తి ప్రతిబింబమును స్పష్టముగా దర్శించగలుగుతాడు.కనుక ఈ ఆవరనము సర్వసిద్ధిచక్రముగా కీర్తింపబడుతున్నది.
ఒకేఒకత్రికోణము సంకేతముగా మూడుబిందువుల స్థానములో మహా కామేశ్వరి,మహా వజ్రేశ్వరి,మహా భగమాలిని విరాజితమై త్రిగుణముల సమ్యమనమునకు సిద్ధమవుతోంది.
నిశితముగా పరిశీలిస్తే త్రికోణ బిందువులు సూత్రధారులు.నాలుగు దివ్య ఆయుధములు పాత్రధారులు కనుక వాటి ప్రస్తావన ఎంతో అర్థవంతము.
1.బాణిన్యై నమః.
బాణిని అనగా బాణము దేనికి సంకేతముగా చెప్పబడునది.
మన సంకల్పమునకు.నన్ను నేను తెలుసుకోవాలనే తలపు.నన్ను నేను చేరుకోవాలనే తలంపు.నన్ను నేను కోరుకోవాలనే తలంపు.కాని బానము ఇక్కడ సత్వగుణ సంకేతముగా భావిస్తే దానికి క్రియారూపము దాల్చుటకు రజోగుణ క్రియాశక్తి సహకారము అనివార్యము.అదియే,
2.చాపిన్యై నమః
సంకల్పమనే బాణమును కదిలించుటకు క్రియాశక్తియే చాపిని.విల్లు.సాద్గకునకు అందిస్తుంది.
3.పాశిన్యై నమః
సంకల్పమనే బాణమును సంకల్పమునకు ఆలంబనముగా చాపము సాధకునకు లభించినవి.
బాణము గురిగా కదలాలంటే నారి,వింటిని,బాణమును క్రియాశీలకముగా మలచు పాశము,వింటినారి సంకేతమే పాసము/
4.అంకుశిని
సాధకుడు వింటికి నారిని బిగించి బాణమును గురితప్పకుండునట్లు వేగమును,శక్తిని నిర్థారిస్తూ,అనుకూల ప్రమాణముతో నారిని లోనికిలాగి వదిలినాడు.
ఎక్కడ బాణము ఆగవలెనో నియంత్రించే శక్తియే అంకుశిని.
సాధకుడు తనను తాను తెలుసుకొనే గమనములో తనలోని మూడుగుణములను నడిపించుచున్న మూడుశక్తులకు తననుతాను సమర్పించుకున్నాడు.అక్కడే ఆ నాలుగు ఆయుధములను వదిలివేశాడు.
నిర్గుణత్వమునకు అతిసమీపములోనున్నాడు.నిరాకారస్థితికి చేరుకుంటున్నాడు.సర్వార్థసిధ్ధితో అతిరహస్యయోగిని అనుగ్రహముతో షడంగదర్శనభాగ్యమును పొందుతున్నాడు.
శ్రీమాత్రేనమః
SARVAROGAHARACHAKRAMU-AVARANAMU-07
శ్రీచక్ర సప్తమావరణదేవతాః
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,
శ్రీచక్ర సప్తమావరణదేవతాఃవశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,
నన్ను నేను తెలుసుకోవటానికి,
నన్ను నేను మార్చుకోవటానికి,
నన్ను నేను చేరుకోవటానికి,
నేను చేస్తున్న ఈ ప్రయాణములోని రెండు ప్రధాన ఘట్టములను,దాటి మూడవ ముముక్షత్వమును చూపించే ఈ ఏడవ ఆవరణము నన్నెంతో ప్రోత్సహిస్తూ,
SARVARAKSHAAKARACHAKRAMU-06
శ్రీచక్ర షష్టావరణదేవతాః
సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,శ్రీచక్ర షష్టావరణదేవతాః
సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,
సర్వరోగహరచక్రము
**********************
" సర్వజ్ఞా సాంద్రకరుణా" తల్లి అనుగ్రహముతో కులోత్తీర్ణ యోగినులు సాధకుని కుండలిని శక్తిని జాగృతమొనర్చీ,చక్రేశ్వరికి కృతజ్ఞతావిష్కారము చేసి,సాధకుడు,శివశక్తి సామీప్యమునకై,తదుపరి ఆవరనమైన "సర్వరక్షాకర చక్రము"లోనికినిగర్భయోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు.
ఈ ఆవరనము పదిత్రికోణముల సంకేతముగా రక్షింపబడుచున్న అంతర్దశారచక్రముగాను కీర్తిస్తారు.
సగుణ-నిర్గుణ సమాహారమే 10 సంఖ్యగా కనుక మనము అన్వయించుకోగలితే అంతా బ్రహ్మానందమే.తమస్సనకు చోటులేదు.అంతా ప్రకాశమయమే.
సర్వసౌభాగ్యప్రదములోని పది శక్తులను పదివాయువులుగాను,సర్వరోగహరచక్రములోని పదిశక్తులను పది అగ్నులుగాను పరిగణించి దేహి జీర్ణక్రియకు అనుకూలశక్తులుగాను నిర్వచిస్తారు.
సాధకునికి వ్యాధి-పాపము అను రెండు అడ్దంకులు ఇంకను వీడలేదు కనుక తాను అపరిమితము లోని కొంతభాగమును మాత్రమే నని అర్థముకాకున్నది. సాధకునకు వ్యాధి-పాపము ఇంకను పూర్తిగా తొలగిపోలేదు.వానిచే బాధింపబడుతున్నాడు.రెండును ఒకదానితో మరియొకటి ముడిపడి భవబంధకములగుచున్నవి.సంసారభ్రమణమనే భవరోగములో పడవేయుచున్నవి.ఆ విషయమును మనకు తెలియచేసే శక్తి సర్వజ్ఞ.
"భావజ్ఞ భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తినీ" అనుగ్రహము మాత్రమే సాధకునికి వాని సంకెలను తొలగించకలదు.
ఈ ఆవరణము ఈప్సితఫలప్రదము.ఉపాధి స్వరూప-స్వభావములు బహుముఖములుగా చర్మచక్షువులకు గోచరించవచ్చును కాని వానిలో అంతర్లీనముగా దాగిన చైతన్యశక్తి మాత్రము లోకాతీత-గుణాతీత-కాలాతీత "చిత్శక్తి".సర్వజ్ఞ-సమస్తము తానుగానున్నది.జీవులను ఉద్ధరించగలిగే సర్వశక్తి స్వరూపిణి.మోహసాగరమును ఈదిరాగల-బంధపర్వతములను తెంచుకోగల ఈశిత్వమును ప్రసాదించగల సర్వైశ్వర్యప్రదాయిని.
వహ్నికలలుగా కీర్తింపబడు ప్రకాశక శక్తులు సాధకుని మోహాంధకారమును పూర్తిగా తొలగించివేసి వెలుగురేఖలను మార్గమును చూపగలుగు ఆనందప్రదాతలు.అంతే కాదు సాధకుని ఆనందమును ఎల్లవేళల చేజారిపోకుండా పరిరక్షించే సర్వరక్షాస్వరూపిణులు.
సమస్త బ్రహ్మాండములకు ఆధారమై (సూత్రాత్మకముగా తానుండి) పరిభ్రమింపచేయుచున్న జగదీశ్వరికి ప్రతిరూపమైన త్రిపురమాలిని దేవికి కృతజ్ఞతావిష్కారముగా నమస్కారము చేస్తూ,ఏడవ ఆవరణములోనికి సాధకుడు సర్వరోగహర చక్రము దిశగా తన అడుగులను కదుపుతున్నాడు.
శ్రీమాత్రే నమః.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-12
తనోతు నః శివః శివం-12 ***************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...