బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,
సర్వసిద్ధిప్రదచక్రము
***********************
ఆత్మార్పణమే అతిరహస్యము.ఆత్మార్పనమును అందించే శక్తులు అతిరహస్య యోగినులు.సాధకుడు ఏడవ ఆబ్వరనములో ప్రసాదించబడిన ఆయుధములను సైతము ఇక్కడ విడిచివేస్తాడు.అవి సాధకుని గమ్యముచేర్చగల నిచ్చెన వంటి సాధనములు మాత్రమే.తత్ఫలితముగా త్రిగుణములు దూరమై దర్పణమువంటి తన మనసులో మూలశక్తి ప్రతిబింబమును స్పష్టముగా దర్శించగలుగుతాడు.కనుక ఈ ఆవరనము సర్వసిద్ధిచక్రముగా కీర్తింపబడుతున్నది.
ఒకేఒకత్రికోణము సంకేతముగా మూడుబిందువుల స్థానములో మహా కామేశ్వరి,మహా వజ్రేశ్వరి,మహా భగమాలిని విరాజితమై త్రిగుణముల సమ్యమనమునకు సిద్ధమవుతోంది.
నిశితముగా పరిశీలిస్తే త్రికోణ బిందువులు సూత్రధారులు.నాలుగు దివ్య ఆయుధములు పాత్రధారులు కనుక వాటి ప్రస్తావన ఎంతో అర్థవంతము.
1.బాణిన్యై నమః.
బాణిని అనగా బాణము దేనికి సంకేతముగా చెప్పబడునది.
మన సంకల్పమునకు.నన్ను నేను తెలుసుకోవాలనే తలపు.నన్ను నేను చేరుకోవాలనే తలంపు.నన్ను నేను కోరుకోవాలనే తలంపు.కాని బానము ఇక్కడ సత్వగుణ సంకేతముగా భావిస్తే దానికి క్రియారూపము దాల్చుటకు రజోగుణ క్రియాశక్తి సహకారము అనివార్యము.అదియే,
2.చాపిన్యై నమః
సంకల్పమనే బాణమును కదిలించుటకు క్రియాశక్తియే చాపిని.విల్లు.సాద్గకునకు అందిస్తుంది.
3.పాశిన్యై నమః
సంకల్పమనే బాణమును సంకల్పమునకు ఆలంబనముగా చాపము సాధకునకు లభించినవి.
బాణము గురిగా కదలాలంటే నారి,వింటిని,బాణమును క్రియాశీలకముగా మలచు పాశము,వింటినారి సంకేతమే పాసము/
4.అంకుశిని
సాధకుడు వింటికి నారిని బిగించి బాణమును గురితప్పకుండునట్లు వేగమును,శక్తిని నిర్థారిస్తూ,అనుకూల ప్రమాణముతో నారిని లోనికిలాగి వదిలినాడు.
ఎక్కడ బాణము ఆగవలెనో నియంత్రించే శక్తియే అంకుశిని.
సాధకుడు తనను తాను తెలుసుకొనే గమనములో తనలోని మూడుగుణములను నడిపించుచున్న మూడుశక్తులకు తననుతాను సమర్పించుకున్నాడు.అక్కడే ఆ నాలుగు ఆయుధములను వదిలివేశాడు.
నిర్గుణత్వమునకు అతిసమీపములోనున్నాడు.నిరాకారస్థితికి చేరుకుంటున్నాడు.సర్వార్థసిధ్ధితో అతిరహస్యయోగిని అనుగ్రహముతో షడంగదర్శనభాగ్యమును పొందుతున్నాడు.
శ్రీమాత్రేనమః
No comments:
Post a Comment