దేవిఖడ్గమాల-యోగినులు
****************
"అణిమాదిభిరావృతామ్మయూఖైః అహమిత్యేవ విభావయేత్ భవాని"
"యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా' అనికీర్త్స్తున్నది లలితా రహస్య సహస్ర నామ స్తోత్రము ఆ జగజ్జననిని.
హ్రీంకారాసనల గర్భితానల శిఖ నుండి అనేకానేకములుగా ప్రకాశవంతముగా ప్రసరింపబడే కిరణములే యోగినులు.వీరిని "పరివార దేవతలు/శక్తులు"అనికూడా అంటారు.
నిరాకార-నిరంజన-నిర్గుణ మూలశక్తిని అర్థము చేసికొనుటకు సహాయపడు శక్తులు ఇవి.
ఒక విధముగా చేతనులకు యోగమునుకలిగించు శక్తులు.సాధకుడు ద్వంద్వమును వీడి తనలోని చైతన్యమునుగుర్తించుటకు ఆలంబనముగా ఈ సక్తుల సహాయమును తీసుకుంటాడు.
"దేహములో?ఉపాధిలో సూక్ష్మముగా దాగి దానినిచైతన్యవంతము చేయుచున్న మహాద్భుత శక్తిని తెలిసికొనుటయే "యోగము"
శ్రీదేవి ఖడ్గమాల అమ్మవారి యంత్ర స్వరూపమునకు సాకారమును దర్శింపచేయు స్తోత్రము.
ఈ యోగినులు ఒక్కొక్క ఆవరనములో నిర్దేశింపబడిన విధులను నిర్వర్తిస్తూ సాధకుని తరువాతి చక్రమును చేరుటకు సహాయపడుతుంటాయి.
నిర్దిష్ట పద్ధతిలో విస్తరించిన పరివార దేవతలు కొన్ని గుప్తముగాను,ఇంకొన్ని బాహాటముగాను,కొన్ని దయచూపుతుంటే,మరికొన్ని దండిస్తూ,కొన్ని శరీర వ్యవస్థలను నియంత్రిస్తుంటే,మరికొన్నిమానసిక స్థిరత్వమును కలిగిస్తూ,అణిమాసిద్ధి నుండి బిందువు వరకు సాధకునకు తోడుగా ఉంటాయి.నాలో నున్న నన్ను మధ్యలో దాగిన ప్రపంచమనే మాయ తెరను ఒకే వేదిక మీద చూపిస్తుంటాయి.
వీరివి గౌణ నామములు.
1.ప్రకట యోగినులు
2.గుప్త యోగినులు
3.గుప్తతర యోగినులు
4.సంప్రదాయ యోగినులు
5.కులోత్తెర్ణ యోగినులు
6.నిగర్భయోగినులు
7.రహస్య యోగినులు
8.అతి రహస్య యోగినులు
9.పరాపర రహస్య యోగిని గా,
కీర్తింపబడుచున్నారు.
శ్రీ మాత్రే నమః.