Thursday, December 24, 2020

ALO REMBAVAY-12


  



  పన్నెండవ పాశురము.
 *******************

 కనైత్తిళం కాట్రెరుమై కన్రు క్కిరంగి
 నినైత్తు ములై వళియే నిన్రుపాల్ శోర

 ననైతిల్లం శేరాక్కుం నర్చెల్వన్ తంగాయ్
 పనిత్తళై వీళనిన్ వాశల్ కడైపట్రి

 శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై శెట్ర
 మనత్తుకు ఇనియానై ప్పాడవుం నీవాయ్ తిరవాయ్

 ఇనిత్తాల్  ఎళుందిరాయ్! ఈ తెన్న పేరురక్కం
 అనితిల్ల తారారుం అరుందేలో రెంబావాయ్.

 

  ఓం నమో భగవతే వాసుదేవాయనమః
 *********************************

  ఇనిత్తాల్-ఇప్పటికైనా?ఇప్పుడైన,

    ఎళుందిరాయ్-మేలుకొను,మేల్కొనివచ్చి మమ్ములను/మా పరిస్థితిని చూడు,

 మేమెలా ఉన్నామంటే,

 పని-మంచు,
 తళై-తలలపై కురుస్తున్నది.అసలే హేమంత కాలమేమో,విపరీతముగా కురుస్తున్నది
.దానిని తాళలేక నీ ఇంటిముందున్న తలుపు చూరు పట్టుకుని ఉన్నాము.

నిన్-నీ,

వాశల-బయటి తలుపు,
కడై-చూరు,
పట్రి-పట్టుకొని యున్నాము
.

ఇనిత్తినాల్-ఇప్పుడైన,

ఎళుందిరాయ్-మేలుకొనవమ్మా.

  మేమెందుకలా చూరుపట్టుకొని ఉండాలి?

        ,కొంచంపుసేపు కూర్చోవచ్చుకదా అని అనుకుంటావేమో,

 నేలంతా పాలతో తడిసి చిత్తడి-చిత్తడిగా మారి మాకు ఆ అవకాశమును కూడ ఈయటములేదు.


  అలా ఎందుక్కయ్యిందో చెప్పమంటావా మమ్ములను,

 మీ గోశాలలోని గోవులు/గేదెలు
 కనైత్తు-పిలుస్తున్నాయి.వేటిని?
 ఎరుమై కనైత్తు-గేదెలు పిలుస్తున్నాయి వాటి దూడలను తలచుకొని -వాటికి పాలుతాగే సమయమైనదని,


 కాట్రు-ఆకలికి అవి దుఃఖపడతాయని

 కన్రుక్కు ఇరంగి-మాతృవాత్సల్యముతో

   ఎరుమై కనైత్తు-గేదెలు పిలుస్తున్నాయి 

    ఆ సమయములో అవి,
    నిన్రు-నిలబడి యున్న చోటనే
    ములైవళియే-నిండిన పొదుగు శిరములనుండి,

  పాల్శోరె-పాలను కురిపిస్తున్నాయి.

 ఆ పాలధారలతో తడిసి మీ వాకిలి అంతా చిత్తడి అయినది.

   ఇందులోని అంతరార్థము ఏమిటి?

  తలపైన కురియుచున్న మంచు ఆచార్యుల ఆశీర్వచనములు.తడిసిన నేల నాలుగుపాదములతో నడుచుచున్న ధర్మము.

   అంతటి మహత్తర స్థలములలోనున్న వారు ధన్యులు.

  అసలా పాలు పితుకకుండానే వాటంతట అవే వర్షిస్తున్నాయి అంటే ఆ రోజు పాలుపితుకవలసిన ఆ గోపిక అన్న పాలుపితుకుటకు విస్మరించాడు.

    ఎందుకిలా జరిగింది? అను సందేహము వస్తే ,మనము ఇక్కడ ఒక్కసారి,

  నిత్యకైంకర్య భక్తి-విశేషభక్తి అను రెండు సద్విషయములను గమనిద్దాము.ప్రతిరోజు తమ సంప్రదాయముగా చేయు నిత్య అనుష్ఠానములు కర్మలు నిత్యకైంకర్యములు
.గోపాలురకు గోవులను మేపుట-పాలను పితుకుట నిత్య కైంకర్యము.దానిని అధిగమించినది విశేష కైంకర్యము.
.అవే మనము పర్వదినములుగా భావించి చేసేప్రత్యేక అనుష్ఠానములు.

 మన గోపిక అన్న, అంతగా విశేషపూజలకన్నా,
 నిత్యకైంకర్యములను చేయువాడు.కాని అతని చిత్తమును ఆక్రమించిన పరమాత్మ, బహిర్ముఖుని కానీయకుండా,పాలుపితుకుట కంటే స్వామిపాదసేవ అధికమనే లా ఆలోచింపచేసి,చిత్తమును మరలించి,చిత్తడి నేలను కల్పించినాడు.
  చిత్తడి-పుత్తడి పరమాత్మ లీలలే.

 అంతటి పుణ్యశాలి చెల్లెలా,

  ఈదెన్న పేరురక్కం? ,ఇదేమి గాఢనిద్ర?



  తెన్నిలంగై-తెన్-దక్షిణ-కంగై-లంక

   దక్షిణ లంకాద్వీపమునకు రాజైన రావణుని సంహరించిన  శ్రీరామచంద్రుని - మేము,

 తెన్నిలంగై కోమాన్నే-దక్షిణ లంకకు రాజైన వానిని,



  శెట్రు-సంహరించిన ప్రభువుని మేము,

  మనత్తుకు-మనస్పూర్తిగా,
  ఇనయైవాస్-పరమానందముతో,
  పాడవుం-కీర్తిస్తున్నాము.


 అహంకారమే జలముతో చుట్టుకప్పివేయబడి పరమాత్మ జ్ఞానమును మరిచిన-హుంకరించిన వానిని సంహరించిన వానిని -పరమాత్మను కీర్తిస్తున్నాము.

నర్-భాగ్యశాలి,
సెల్వన్-పవిత్రుడు అగువాని
తంగాయ్-చెల్లెలా

 ఇనైత్తినాల్-ఇప్పుడైనా,
 ఎళుందిరయ్-మేల్కాంచి,
 నీ వాయ్ తెరవాయ్-తలుపుతో పాటు, నీ నోటిని తెరిచి,
 పాడుతు-స్వామిని సంకీర్తిస్తూ,మాతోబాటుగా నోమునకు రమ్ము అంటూ,


 ఎంబావావై-నోమునోచుకొనుటకు తీసుకుని వెళుతున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము మన అడుగులను కదుపుదాము.

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.




  

   
 

  

   
 

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...