Tuesday, October 12, 2021

AMMA KAMAKSHI UMAYE-07

పొల్లాద పిళ్ళయాయ్ ఇరుందాలుం పెట్రతాయ్ బుధ్ధిగల్ సొల్లవిళయో పేయ్పిళ్ళయాం నాళు తాన్ పెట్ర పిళ్ళయై పిరియమాయ్ వలర్క విలయో కల్లాగిలుం మూచు నిల్లామల్ వాళ్విడుం కదరినాన్ అళుద కురలిల్ కడిగితరి నట్టినురు కూరుమదిలాగిలం కాదినిల్ దుళువదిలలో ఇల్లాదవన్ మంగళ్ ఎన్మీదిల్ ఏనమ్మ ఇని విడువత్తిల్లై చుమ్మా ఇరువురుం మదిపిడితు తెరుతన్నిల్ వీళ్వదు ఇదు దరమం నుల్లరమ్మా ఎల్లోరం ఉన్నయే సొల్లియే యేసువర్ ఇది నీది అల్లావమ్మా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే. ************** శ్రీ మాత్రే నమః ************** అల్లరి పిల్లల బుగ్గ గిల్లియు తల్లి బుధ్ధులను నేర్పించదో పెనుభూతమైనను తన పిల్లలను మిగుల ప్రేమతో పెంచునమ్మా ఆయాసపడుచున్న నా ఆర్తనాదమును పెడచెవిని పెట్టకమ్మా ఆవగింజంతైనను జాలిలేదా నీకు కఠినశిల కరుగునమ్మా ఆనవాలే లేని అన్ని అపరాధములు విడిచిపెట్టక ఉండకమ్మా హెచ్చైన కరుణతో వచ్చి రక్షింపక రచ్చ చేయుట తగనిదమ్మా దయలేని దానివను పదిమంది వేసేటి నింద నీకేల నమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.అంబ కామాక్షి ఉమయే. *************************** " సరోజ దళనేత్రి-హిమగిరి పుత్రీ నీ పదాంబుజములే సదా నమ్మినానమ్మా. ( శ్రీ శ్యామ శాస్త్రి.) శుభమిమ్మా- తల్లీ ! ఈ దీనుని కనికరించుటకు కదిలిరాకున్నావు.వరదాయినివైన నీవు పరాకు చేయుచున్నావు. నేను పాపినని/రక్షించుటకు తగినవాడిని కానని అనుకుంటున్నావా/లేక నేను నిన్ను రక్షిపలేనని నన్ను నమ్మింప దలచినావా? కోరి వచ్చిన వారికెల్లను కోర్కెలొసగే బిరుదు కదా-అయినను, అతిభారమా నన్ను బ్రోవ-నే తాళజాల, తరలి రావమ్మా నన్ను బ్రోవ అని నేను నిన్నే శరణము కోరి వచ్చియున్నాను. " హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః" శ్రీ లలితా రహస్య సహస్ర నామ స్తోత్రము. అమ్మా నీ మాతృవాత్సల్యము నీ కరుణావీక్షణమనే సంజీవినిచే,పరమేశుని ఫాలనేత్రాగ్నిచే దహనము కావింపబడిన మన్మథుని పునర్జీవితుని కావింప బడినప్పుడే ఋజువైనవి కనుక ఆలస్యము చేయకు నన్ను ఆదరించుటకు. " నటరాజ పత్తు" లో, ఇదే విధమైన విన్నపమును పరమేశునికి చేస్తూ,పిల్లలమైన మేము అల్లరి చేయకుండా ఉంటామా? అదే నీ పిల్లలైన వినాయకుడు కుమారస్వామి అల్లరి చేస్తే వారిని సరిదిద్దక ఊరుకుంటావా అని అడుగుతునే, ఇంకొంచము చనువుతో అయినా నేను,నిన్ను ఏమన్నా, " పంపు శూనయమెల్ల వైపల్లి మారణం తంపనం వశియమెల్లా పాతాళ మంజనం పరకాయ ప్రవేశం మధుమల్లా సాదమల్లా అంబు కుళిగం విళిగం మొళిందు మందిరమెల్లా" అయినా నే నిన్ను ఏమైన కనికట్టు చేయమన్నా/నన్ను కదలకుండా చేయమన్నా/పాతాళమునకు వెళ్ళమన్నానా/పరకాయ ప్రవేశము చేయమన్నా/విషమును తేనెగా భావిస్తూ/పోనీ అమృతమనుకుంటూ సేవించమన్నానా? అసలు అనలేదే! నిన్ను చేయమనలేదు.కనీసము నాకొరకు నిన్ను అసాధ్యమైన పాశుపతాస్త్రము వంటి అస్త్రములను యుధ్ధములో విజయమునొందుటకు ఇమ్మనలేదే అసలు నేను నిన్ను ఏమని కోరుకుంటున్నాను నా దోషములను సవరించి సన్మార్గమును చూపమని కాని నీకు " ఇరు సెవియు మందమో-కేలాడ అందమో" రెండు చెవులు సరిగా వినిపించుటలేదో లేక వినపడనట్లుగా నాతో ఆడుకోవాలనిపిస్తున్నదో అయినా నీ పాదములను ఉన్ వడి విడువనెల్లా అంటున్నాడు. అమ్మా అయ్య వలెనే నీవును నాతో వినపడనట్లు ఆడుకో దలిచావా? లేకపోతే " ఎల్లారుం ఉన్నయే" అంతా నావాళ్ళే అంటూ, సొల్లియే ఏసువర్-అభయవాక్యములు పలుకుతూ-వరములనిస్తానంటూ, కదలిరాకున్నప్పటికిని, " ఇల్లాద వన్ మంగళ్ ఎన్మీదిల్ ఏనమ్మ ఇని విడువ నత్తిల్లై చుమ్మా" నన్ను రక్షించి మంగళములను సమకూర్చే భారము నీదే.నను కటాక్షించే వరకు నీ పాదములను విడువను అని పట్టుపట్టిన సాధకుని,కరుణించబోతున్న, కామాక్షి తాయి దివ్య తిరువడిగళే శరణం. నరియ నరియ వణక్కంగళ్. అమ్మ చేయి పట్టుకుని నడుస్తూ,రేపు విరుత్తము లోని ఎనిమిదవ భాగమును గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...