" ఆద్యాయాం లలితాదేవీ-అన్యాత్ పంచదశాంగనా"
లలితా నిత్యరూపేణా అన్నది ఆర్యోక్తి.
పరదేవతా ప్రకాసమే ప్రతిబింబములుగా "బిందు సమన్విట"త్రికోణము చుట్టు ఎనిమిదవ ఆవరణముగా శ్రీచక్రములో అలరారుచున్నది నిత్యామండల సంకేత నామముతో.
ఉత్పత్తి నాశనము లేనిదినిత్యామండలము.
ఆత్మచైతన్యము వైపు సాధకుని దృష్టిని శాశ్వతముగానిలుపునదినిత్య మండలము.
15 మంది నిత్యాశక్తులు అమ్మవారి రూపలావణ్యములతో నున్నప్పటికినివృద్ధి-క్షయ విషయములో వ్యత్యాసము కలదు.
అమ్మవారు షోడశి నిత్యకళ.
ఏకం-అనేకం,అనేకం-ఏకము నకు ఉదాహఋఅనముగా ఈపదిహేను శక్తులు శూన్యము నుండి-సంపూర్ణం వరకు,సంపూర్నమ్నుండి శూన్య వరకు పున్నమి-అమావాస్య నామములో కాలశక్తులుగా/జ్ఞానశక్తులుగా ,
కుండలినీ శక్తిని,నిద్రాణమైనకుండలినీ శక్తిని జాగృతపరచి,సాధకుడు తనౌనికిని కనుగొనుటకు సహాయపడుతుంటాయి.
ఆదిశంకరవిరచితసౌందర్యలహరిస్తోత్రము ఈపదహారు కళలను "షోడశాక్షరీ" మంత్రముగా భావించి కీర్తిస్తుంది.
నిత్యాశక్తులు తమకళలను సూర్యునినుండి చంద్రుని వద్దకు చేరుస్తూ ప్రకాశిస్తుంటాయి.
వైదికులు సూర్యుని ఆత్మస్వరూపముగాను,చంద్రుని సాధకుని మనో భావములుగాను భావిస్తారు.అంటే నిత్యా శక్తులు జీవాత్మకు పరమాత్మను పరిచయము చేయుటలో సహాయపడుతుంటాయి.
నిత్యాశక్తులలో "త్వరితే " నిత్యకు ప్రత్యేకత ఉంది.లలితా రహస్య సహస్ర నామ స్తోత్రము,
"అష్టమీ చంద్ర విభ్రాజత్ అళికస్థల శోభితా" అని పరదేవతను స్తుతిస్తుంది.