Friday, May 3, 2019

NAH PRAYACHCHANTI SAUKHYAM-21

  నః ప్రయచ్ఛంతి సౌఖ్యం
  **********************

  భక్తుడు-భగవంతుడు ఆయుధధారులే.

 "యాతే హేతిర్మీడుష్టమ హస్తే బభూవతే ధనుః
  తయాస్మాన్ విడ్వతస్తమ యక్ష్మయా పరిబృజ".

  స్వామి మాకు శత్రువులు ఎవరులేరు.కర్మఫలితములనగా దుర్మార్గులై మాపై వచ్చు శత్రువులను దండించుటకు నీ ఆయుధములను ప్రయోగింపుము.రుద్రా! అనేక నమస్కారములు.


  " నమః శూరాయచ అవబింధతేచ".

  యుధ్ధరంగమున భయములేకుండ ధైర్యముగా నుండువాడు-తన భక్తుల శత్రువులను మర్దించు రుద్రా! నమస్కారములు.

  బలిచక్రవర్తి పెద్దకుమారుడైన బాణాసురుడు బాల్యమునుండి భోలాశంకర భక్తుడు.అనవరతము ఆదిదేవుని తన అర్చనలతో ప్రసన్నుని చేసికొనిన బాణుడెంత అదృష్టవంతుడో!

 " నమః కపర్దినేచ పులస్తయేచ." జటలతో జలమును బందించి,భక్తుల యెదుట ప్రత్యక్షమగు రుద్రా నమస్కారము.

   భక్తికి మెచ్చిన భక్తసులభుడు బాణునికి శత్రుమర్దనులగు అనేకానేక సేనలను బహూకరించెను.వినయముతో బాణుడు స్వామి నీ సైన్యము మాత్రమే కాదు,నాకు ఆపద సంభవించినపుడు నీవుసైతము నా తరపున నిలబడవలెనని కోరెను.ఆర్త్రత్రాణ పరాయణుడు ఆర్ద్రతతో అంగీకరించెను.

 " సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే యశస్చమే భగశ్చమే" స్వామి నా పక్కన నిలబడు పరమేశా.నమస్సులు.

  కారణము-కార్యము-కర్త తానైన స్వామి కలగా కార్యమునకు నాంది పలికెను. బాణుని కుమార్తె ఉష కలలో దివ్యసుందరుని దర్శింపచేసెను.కావలిసిన కార్యమునకు కారణము కన్య కలలో గాంచిన పురుషుని పతిగా కోరుకొనుట.చిత్రాల సానికి చెలికత్తె చిత్ర తోడైనది.కలలో గాంచిన పురుషుని చిత్రపటమును రచించి,వివరములు తెలిపి,తన మంత్ర-మాయా శక్తులతో నిద్రించుచున్న అనిరుద్ధుని ద్వారకనుండి తెచ్చి శోణపురమున ఉంచెను.

  " నమః పూర్వజాయచ-పరజాయచ"

  పూర్వా-పరములు తెలిసిన స్వామి తన భక్తునికి భావిసూచనగా, కోట పతాక చిరిగిన రాజ్యనాశ సంకేతమును గురించి తెలియచేసెను.అనుకున్నంత అయినది.అపశకునము గోచరించినది.అప్రమత్తుడైన బాణుడు అనిరుద్ధుని బందీని చేసినాడు తాను జరుగవలసిన కర్మఫలములకు బందీయై.అంతే ద్వారకలో అల్లకల్లోలము.ఆ మహాత్ములతోనా వైరము?అనివార్యము యుధ్ధమైనది.బలరాముడు శ్రీకృష్ణుడు బాణునిపై దండెత్తి,సేనలను చీల్చిచెండాడు తున్నారు.

   " దుందుభ్యాయచ-హనన్యాయచ" నమః శివాయ.భకవశుదైనాడు భగవంతుడు బానుని తరఫున శ్రీకృఇష్నునిపై యుధ్ధమునకు సిధ్ధమైనాడు.యుధ్ధరంగము శివకేశవుల యుధ్ధమును వీక్షించుటకు సన్నధ్ధమైనది.దానిని వర్ణింపజాలని నా ఆసక్తతను మహాదేవుడు మన్నించును గాక.

  "నమః ఉచ్చైః ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమః."

   పెద్ద పెద్ద శబ్దములతో వచ్చుచున మహాదేవుని మహాసేనను మహాదేవుని పరాక్రమమును స్తుతిస్తూ,శ్రీకృష్ణుడు పరమాత్మను, పరిష్కారమునకై ప్రార్ధించాడు.స్వామీ నేను అశక్తుడను.నీ భక్తవశుడవు.కాని ధర్మమునకు గ్లాని రానీయలేము కనుక తగిన ఉపాయమును సెలవీయమని చంద్రశేఖరుని వేడుకొనెను.అద్వైతము ద్వైతమై మనలను ధన్యులనుచేయుచున్నది.స్వామిసూచన ప్రకారము,హరుడు నిద్ర నటించగా హరి బాణుని ఓడించెను.తప్పుతెలిసికొనిన బాణుడు తనకుమార్తెను అనిరుధ్ధునకిచ్చి కళ్యాణమును గావించెను .లోకాసమస్తాత్ సుఖినో భవంతు.
 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

 " నమః ఉగ్రాయచ-భీమాయచ."

  భక్తుని విషయానికొస్తే,


అంబరావతి నదీతీరమున కల కరువూరులోని పశుపతినాథుని కొలిచేవాడు ఎరిపాత నాయనారు. భక్తుని కథ అంటే భగవంతుని లీలను తెలియచేయునది కదా.ఎగుడు దిగుడు కన్నులవాని భక్తులకు ఎటువంటి హాని ఎదురైనను అడ్డుకొనుటకు గొడ్డలి భుజమున ధరించి తిరుగుటను దొడ్డ సేవగా భావించువాడు. శివకామి ఆండార్ పూలసజ్జనిండా పూలమాలలతో స్వామి సేవకు వెళుచుండగా ఒక మదించిన ఏనుగు పూలను ధ్వంసముచేసి భక్తుని క్రింద పడవేసి గాయ పరచినది.ఆగ్రహించిన ఎరపాత ఏనుగును,మావటివానిని గొడ్డలితో నరికి,భక్త రక్షణము గావించెను.విషయమును తెలుసుకొనిన రాజు శివాపరాధమునకు చింతించి శిరోఖండనము చేసుకోబోగ,ఎరిపాత ఆ కత్తికి తన తలను అడ్దముగాపెట్టెను.ఎరుకలవానిగా మారిన ఆ ఎగుడుదిగుడు కన్నులవాడు ఎరిపాతను రక్షించినట్లు మనందరిని రక్షించును గాక.

   ( ఏక బిల్వం శివార్పణం.) .

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...