నః ప్రయచ్చంతి సౌఖ్యం-06
************************
భగవంతుడు-భక్తుడు ఇద్దరు వేటగాళ్ళే.
ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా
తల్లి పార్వతి మారె తాను ఎరుకతగా
ఎరుక కలిగిన-జ్ఞాని.....ఎరుకగా..వేటగానిగా మారుటయే శివలీల.
ఎనలేని వాత్సల్యము ఎరుకరూపమును దాల్చినది.ఎదురుదాడికి దిగినది.
వేట నాది-వేటునాది-వేటాడే చోటు నాది-ఏటి తగవు ? అని మాటలాడినది.కరుణతో కరిగి పశుపతమును ప్రసాదించినది.ఏలినవాని లీలలను ఏమని వర్ణించగలను?మాట కరుకు-మనసు చెరుకు మన శివయ్య.
పరమేశ్వరుని వేట జీవుల పాపకర్మములను చేయించు అరిషడ్వర్గములు.వానిని అరికట్టుటకు వేసిన దెబ్బ యే వేటు.వేటాదే చోటు ఎక్కడ వేటాడ వలెనో ఆ ప్రదేశము.అదే మన మనస్సులు.అతి చంచలమై బుధ్ధినివిస్మరింపచేసి మూఢులను చేస్తుంది.అదే జరీఅది ఈ కిరాతార్జునీయములో .అర్జునుని అహంకారము అను వేట.దానిపై పడిన వేటుయే పినాకము శిరమును ముద్దాడుట.ఎంతటి చమత్కారమో మనవేటూరిగారిది.వేట ఫలితమేఅహంకారము తొలగి స్వామీనుగ్రహమునకుపాత్రతను కలిగించి,పాశుపతాస్త్రమును ప్రసాదించినది.నమోనమః.
|" నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః"
రుద్రా! నీ ధనువైన పినాకమునకు నమస్కారము.నీ బాణములకు నమస్కారము.వాటిని పట్టుకున్న నీ శుభకర హస్తమునకు నమస్కారము.
" యా తే రుద్ర శివా తనూరఘోరా పాపకాశినీ
తయానస్తను వా శంతమయాగిరి శంతాభిచాకశీహి"
స్వామీ రుద్రా నీ రూపము భయంకరము కానిది.ఆయుధములతో హింసించునేమో అను భయమును కలిగించనిది.పరమానంద స్వరూపముతో మమ్ములను పునీతులను చేయుము.
మనపూర్వజన్మ కర్మలు కారుణ్య-కాఠిన్య రూపముగ మనలను వెంబడించుచున్నవి.సుఖదుఃఖములనే బాణములతో ప్రకృతి అనే ధనువు నుండి విడువబడి మనకు సంతోషమును-విచారమును కలిగించుచున్నవి.రుద్రుని ఘోర-అఘోర రూపములు మన పాప-పుణ్యముల ప్రతిరూపములు.పరమేశ్వరుడు నిర్వికారుడు-నిర్గుణుడు.
" ఓం పుంజిష్ఠాయ నమో నమః."
పరమేశ్వరానుగ్రహమును పొందిన భక్తుని విషయమునకు వస్తే వేటగాని ఉపాధియే వేటగాని పరమావధిని పరిచయము చేసినది.జంతువులను వేటాడటము ఆటవిక ధర్మమైనప్పటికిని బోయవాడు వేటాడటము స్వధర్మము అనుటనిర్వివాదాంశము.

లుబ్ధకుడు అను వేటగాడు తన దారిని-గమ్యమును తెలిసికొనలేక తిరుగాడుతు ఒక కీకారణ్యమునందు ప్రవేశించినాడు.ఈశుని ఆన మీరగలమా.వాని నేమి చేయనున్నాడో మన వనానాం పతి.నమోనమః.స్వామితో పాటు తానును తరించటానికా అన్నట్లు ఒకలేడి సంబరపడుతు గంతులేస్తూ,వేటగాని కంటపడింది.వేటగాని పాపములను వేటాడాలనుకున్నాడేమో మన వేటగాడు.లేడిని వదిలి వాడి జీవితమును గాడికి తెద్దామనుకున్నట్లున్నాడు.మృగయుని ఎదుట మృగము.అంతర్యామి లీలల ఆంతర్యమును తెలిసికొనగల వారెవరు?రెట్టించిన ఉత్సాహముతో లేడిని కొట్టాలని విల్లు ఎక్కుపెట్టాడు "అహమును నమ్మిన ఆ లుబ్ధకుడు."హరిణి ప్రాణములను తీయుట హరునికి ఆమోదయోగ్యము కాదేమో అన్నట్లుగా వేటగానిలోని ఈశ్వరచైతన్యమును దర్శించగలిగినది. ఈశ్వర కృపాసాధనమైన లేడి.సర్వస్య శరణాతియైశంకరునితో,
" అథోయ ఇషుధిస్తవారే అస్మిన్ నిదేహితం."
రుద్రా! నన్ను బాధించే శత్రువులు అనేకులు కలరు కాని నాకు వారితో శతృత్వములేదు.వారి మృగయా వినోదమునకై నన్ను దెబ్బతీయ చూచుచున్నారు.ఓ పినాకపాణి నా శత్రువులయందు నీ ఆయుధములనుంచి,నన్ను రక్షించు.
ఈశ్వర కృపాసాధనమైన లేడి.సర్వస్య శరణాతియైశంకరునితో,
." ఓం మహేభ్యో క్షుల్లకేభ్యశ్చ నమో నమః" నీవు సామాన్యుని వలె కానిపించు మహాత్ముడవైన రుద్రుడవు.
నీ ఘోర రూపమును నాయందలి ప్రసన్నతతో ఉపసంహరింపుము.
అవతస్వ ధనుస్తగం-నారిని ఊడదీసి ప్రసన్నపరచు.అంతేకాదు స్వామి!
" విజ్యం ధనుః -పరిభుజః." నీ విల్లమ్ములను శాంతపరచి,నన్ను పరిపాలించు.పాహి-పాహి పరమేశా! అంటు పరిపరి విధముల ప్రార్థింపసాగినది.
"అహముతో పోరాటము బోయవానిది.అర్చనతో ఆరాటము ఆ లేడిది."ఎరను రక్షించుట ఎరుకలవానికి తెలియనిదా.శివోహం.

తన ఉనికిని గురుతుచేయాలనుకున్నాడు గుండెల్లోదాగినవాడు.ఎక్కుపెట్టిన బాణమును సంధించకముందే,
"నమః ఉచ్చైర్నోషా యాక్రందయతే పత్తీనాం పతయే నమః"
పెద్దగా ధ్వని చేయువాడును శత్రువులను వణికించు రుద్రుడు పెద్దపులిగా రక్షకునిగా అవతరించెనా అనునట్లు,భీకరముగా గాంద్రిస్తూ వేటగానిపైకి దూకింది." ఓం వ్యాఘ్రేశ్వరాయ నమోనమః."
బ్రతికుంటే బలుసాకు అన్నట్లు భయపడిన వేటగాడు తన విల్లును క్రిందపడవైచి గజగజలాడెను.మహాదేవుని కరుణకలదన్నట్లుగా మహావృక్షము ఎదురైనది.పట్టి విడువరాదు-పరమాత్మ నీ చేయి పట్టి విడువరాదు అని తలుస్తు గబగబ చెట్టేకేశాడు." ఓం వృక్షేభ్యో-హరికేశేభ్యో నమో నమః
.అయ్యకు సాయం తానంటు పెద్దపులి చెట్టు క్రిందనే కూర్చుంది.ఎటుచూసిన చిమ్మచీకటి లోపల-బయట.దాగిన ప్రకాశమును కనలేని వానికి చీకటికాక ఇంకేమిటి
" నమః సహస్రాక్షాయచ-శతధన్వనేచ"
అనంత బాహువులలో ధనువులను ధరించి,అనంత వీక్షణమునుచేయుచున్న ఈశ్వరునికి నమస్కారము.
కదలక మెదలక కూర్చున్నవాని కలతను తోసివేయాలనుకున్నాడు ఆ కాలాతీతుడు.అదుపుతప్పిన మనసుతో ఆకులను కోసి చేజారిపోతున్న ప్రాణమును దాచిన చేతులనుండి జారవేయసాగాడు.పులి బారిన పడిన నన్ను రక్షించు వారెవరు? ఇన్నాళ్ళు సంసారమనే అరణ్యములో,అహంకారమనే ధనువుతో,అరిషడ్వర్గములనే బాణములతో,వ్యామోహమనే లేడిని పట్తుకోవాలని విర్రవీగాను.నా అసమర్థ నాకు తెలిసివచ్చినది.ఎంతటి అజ్ఞానిని అనుకుంటు అవస్థపడుతు ,అరిషడ్వర్గములనే ఆకులను తుంచి,క్రిందకు పడవేస్తున్నాడు ఆ బోయవాడు.
" నమ స్సోమాయచ-రుద్రాయచ "
అష్టమూర్తులలోని సీతగుండములోని చంద్రలింగేశ్వరుడు చాలించినాడు తన శోధనను.
ఆకులు కిందకు వేస్తున్న బోయవానిపాపములను చీకట్లను నెట్టివేస్తు,ఉషోదయ రేఖలతో విశ్వమును ఉద్ధరించుటకు ఉదయిస్తున్నాడు బాలభానుడు తూరుపు దిక్కులో." యద్యత్ కర్మ కరోతి సర్వమఖిలం శంభో తవారాధనం." గా తాను కూర్చున్నది త్రిగుణాతీత త్రిదళ బిల్వృక్షముగా గుర్తించాడు.తానుచేసినది బిల్వార్చన.మనసెరిగినవాడు మహదేవుడు.పులి వెళ్ళిందా లేదా అన్న సంశయముతో క్రిందకు చూశాడు లుబ్ధకుడు.మహాద్భుతం.వ్యాఘ్రము కూర్చున్న ప్రదేశమున వ్యాఘ్రేశ్వరుడు సాక్షాత్కరించి,సాయుజ్యమునిచ్చాడు.సర్వం శివమయం జగం.- సమస్తము శివాధీనము.

రేపు బిల్వార్చనకు కలుద్దాము.
( ఏక బిల్వం శివార్పణం.)