కళ్యాణ పాశురము-30
***********
" ప్రతి ఒక మాతృమూర్తి సాక్షాత్తుగా కరుణతో గోదరక్షగా
ప్రతి ఒక్కరి ఆర్తి తీర్చి లక్ష్యము చేర్చు గోవిందుని సాక్షిగా."
ఇంతవరకు మనము తెలుసుకున్న విషయములన్ని కేవలము అమ్మ అనుగ్రహము వల్లనే తక్క స్వయముగా సంపాదించుకొన్నది కాదని "అడియేన్" భావిస్తున్నది.
వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై
తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రు ఇరెంజి
అంగు అప్పరై కొండ అత్తై అణిపుదువై
ప్పైంగమలత్తణ్ తెరియల్ పట్టర్ పిరాందై
శంగత్తమిళ్మాలై ముప్పదుం తప్పామే
ఇంగుం ఇప్పరిశు ఉరైపార్ ఈరిరండుమాల్
శెంగణ్ తిరుముగుత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబరువర్ ఎంబావై.
అంగు-అప్పుడు-ఇంగుం-ఇప్పుడు ఎప్పుడైన స్వామి పాలసముద్రమును చిలుకునపుడు సహాయముచేసినను,గోకులములో పెరుగు సముద్రము చిలుకునపుడు సహాయపడటమునకు కారణము కేవలము మనమీది అవ్యాజవాత్సల్యమే.
అదే విషయమును త్యాగరాజు "ఓడను నడిపే ముచ్చట గనరే" అని తాదాత్మ్యతతో దర్శించి ధన్యులైనారు.
అదే కరుణను గోదా రంగనాథులు మనపై వర్షిస్తున్నారనుటకు,
ఓం నమో నారాయణాయ
**********************-
అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది
నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది.
శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన
అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో
ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన
ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో
పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన
పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో
అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన
అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో
వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము
వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము.
గోదామనన్య చరణం శరణం ప్రపద్యే.
పరమ భాగవతోత్తముడైన శ్రీవిష్ణుచిత్తుని వలన భగవతత్త్వమును అవగతమొనరించుకొను చున్న మన ఆండాళ్ తల్లి,గోపికలు కాత్యాయినీ వ్రతమును ఆచరించి,స్వామి సాయుజ్యము ను పొందినారని తెలుసుకొని,తనవారిని,తన తరువాతి వారిని తరింపచేయుటకై,సులభోపాయముగా ,తానును గోపికగా మారి(మనో వాక్కాయ కర్మలలో) చెలులతో ముప్పదిరోజులు,పామాలతో (పాశురములతో) పూమాలలతో మార్గళి వ్రతమును ఆచరించి మనకు మార్గదర్శకురాలైనది.ఏమీ తెలియని నాచే ముప్పది పారిజాత మాలలను స్వామికి సమర్పింప చేసినది.నా పూర్వ భాగ్యమేమో తెలియదు కాని నన్ను తన కళ్యాణోత్సవమునకు తీసుకుని వెళుచున్నది.ఒక్క నిమిషము.ఎవరో మహాత్ములు వచ్చారు.ఎందుకో? ఏమిటో నన్ను తెలుసుకోనివ్వండి.మీకు చెబుతాను ఆ విశేషాలన్నీ.
గోదా రంగనాథుల కళ్యాణార్థము తమ అదృష్టముగా భావిస్తూ,అఖిలాండకోటి దేవతలు అర్చక స్వాములై అయ్యవారి తరఫున ఆండాల్ తల్లిని వధువుగా అర్థించుటకు కానుకలను-పల్లకిని తీసుకుని వచ్చారు.అబ్బ!మౌక్తికాలంకృతమైన పల్లకి ఎంత బాగుందో.అసలెక్కడివి ఈ ముత్యములు సత్వగుణశోభితములై సత్చిత్ ప్రకాశముతో నున్నవి.తల్లిచెప్పిన ముక్త పురుషులు వీరే కాబోలు.ఎర్రటికెంపులు అమ్మ బుగ్గల ఎర్రదనపు కాంతి సోకిన ముత్యాలేమో.తెలుపు కాదు.ఎరుపు కాదు.నీలముగా తోచుచున్నవి.ఆ నీలమేఘ శ్యాముని కడకంటి చూపులను తోడ్కొని వచ్చినవేమో అందుకే ముత్యములు నీలాలై నాతో మేలమాడుతున్నవి.కాసేపు పచ్చలుగా,మరి కాసేపు గోమేధికములుగా,వజ్ర వైఢూర్యములుగా.ఎంతైన స్వామిదగ్గరకు అమ్మను తీసుకువెళుతున్నామనే భావోద్వేగము బహురూపులు సంతరించుకుంటున్నదేమో.
విష్ణుచిత్తులవారు అతిథులను సత్కరించారు.పాండ్యరాజు ఆడపెళ్లివారి బాధ్యతను అన్నయై ఆనందంగా స్వీకరించారు.ఇదేమి చిత్రమో నా మనసు శ్రీరంగములో అమ్మకై ఎదురుచూచు చున్న రంగనాథుని పక్కకు చేరింది.ఆడపెళ్ళివారు-మగ పెళ్ళివారు రెండూ తానై ఆనంద డోలికలూగుతోంది.
ఆ ఆనందోత్స వాన్ని ,తిరు (పవిత్రమైన) కళ్యాణాన్ని కనులారా దర్శించి,తిరుగులేని వారిరువురి దయను పొందుదాం.నాతో బాటు మీరు రండి.
శ్రీ రంగే గరుడాచలే ఖగ గిరౌ సింహాచలే మందిరే
వైకుంఠే కనకాచలేచ నిషధే నారాయణాఖ్యాచలే
లోకాలోక మహాచలేచ నిషదే పుణ్యాచలేష్టా శ్రియ:
పాయాత్ ఓ భగవాన్ పురాణ పురుష: కుర్యాత్ సదా మంగళం".
భగవత్ బంధువులారా! మీరు నా అజ్ఞానమును
***********************
కుప్పల తప్పులు అనినా ! కుప్పిగంతులే అనినా
చొప్పదంటు పలుకులనినా "నప్పిన్నాయ్" కరుణతో
ఫలశృతి-ఫలసిద్ధి
****************
ముద్దుమోము చూడమంటు అద్దము చూపిస్తాడు
విసనకర్రను ఇస్తాడు ఆ ముసిముసి నవ్వులవాడు
మనతో జలకములాడుతాడు జలజనాభుడు చూడు
పఱ ను అందిస్తాడు ఏ అరమరికలు లేనివాడు
ఆడతాడు-పాడుతాడు వీడలేను అంటాడు
సరసను కూర్చుంటాడు పరమాన్నము తింటాడు
యమునకు రమ్మంటాడు మనసును ఇమ్మంటాడు
పట్టు విడుపు లేనివాడు మనలను పట్టుకునే ఉంటాడు
మాయను తెలిసిన వాడు సాయము చేస్తుంటాడు
చెంతనే ఉంటాడు చింతలు తీర్చేస్తాడు
కొండను ఎత్తిన వాడు మన గుండెలోన ఉంటాడు
నెమలి ఈక నిస్తాడు నెనరులు చూపిస్తాడు
దాసోహమనగానే తను దాసుడిలా మారతాడు.
అమ్మ చేయి విడువకుంటే అన్నీ తానే అవుతాడు.
********************
కాయేన వాచా మనసే ఇంద్రియైర్వా
బుద్ధి ఆత్మమానా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్ యత్ సకలం పరస్మై
నారాయణా! ఇతి సమర్పయామి.
మనో వాక్కాయ కర్మలతో చేసిన సకలము నారాయణుని పాద పద్మములను చేరుగాక.
మనము కూడ ఈ సంసారమనే సముద్ర మథనమును చేయుటకు శరీరమనే నావను సద్వినియోగ పరచుకోవాలని కోరుకుంటు,
నా ఈ చిన్ని ప్రయత్నమును పెద్ద మనసుతో తమ తమ సంఘములందు ప్రచురించి,నిరంతరము నన్ను ప్రోత్సహించుచున్న ప్రియ మిత్రులందరికి సవినయ నమస్కారములతో ,
శ్రీకృష్ణార్పణం.