రశ్మిమంతం-సముద్యంతం
************************
అగస్త్యమహామునిచే శ్రీరాముని యుద్ధోన్ముఖునిగా మలచుటకు మనకు అనుగ్రహించిన "ఆదిత్యహృదయ స్తోత్రము" లోని కొన్ని పదముల వివరణను తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
అంతర్యామిగా నున్న పరమాత్మ సూర్యనారాయణునిగా ప్రత్యక్షమగువేళ 'రశ్మిమంతం-సముద్యంతం" అన్న శబ్దములు ప్రయోగింపబడినవి.
మయమగుటయే మంతం-రశ్ములమయమైనాడు పరమాత్మ.ఉదయించుటకు సిద్ధమగుచున్నాడు తన కిరణములను కరములతో.అందుకే భాస్కరునిగాను.దివాకరునిగాను,అహస్కరునిగాను-దినకరునిగాను కిరణములనే కరములతో ప్రకాశించుతకు సంపూర్తిగా సిద్ధపడుచున్నాడట.సమ్యక్ ఉదయతీతి-సంపూర్ణముగా తేజస్సును ప్రసరించుటకు సిద్ధపడుచున్నాడు కర్తగా పరమాత్మ.
కర్త-కార్యము-కారణము మూడును తానే యైన పరమాత్మ స్థూల-సూక్ష్మ-కారణ దేహములతో ప్రస్తుతింపబడుతున్నాడు.
రశ్ములు అన్న శబ్దమునకు మనము కాంతులు-కిరణములు-వేదములు-ఇంద్రియములు-భూతములు అని అన్వయించుకుంటే వాటిని జాగృతపరచదలచిన అనుగ్రహము పరమాత్మది
.కాదనలేనిది.
కనుకనే శ్రీలలితా రహస్య సహస్ర నామ స్తోత్రములో
ఆదిపరాశక్తిని "ఉద్యత్భాను సహస్రాభా-చతుర్బాహు సమన్వితా" అని ప్రస్తుతిస్తుంది.
అసలు స్థూల-సూక్ష్మ-కారణ రూపములలో నున్న తేడాఏమిటి?
సనాతన ధర్మప్రకారము
1. ఉత్తమాధికారులచే ఉపాసింపబడునది సూక్ష్మ రూపము.దీనినే మంత్ర స్వరూపముగా ధ్యానిస్తారు.స్మరిస్తారు.అర్చిస్తారు.
2. ఉత్తమోత్తమాధికారులచే ఉపాసింపబడునది కారణరూపము.దీనినే యంత్ర రూపముగా భావిస్తారు.ధ్యానిస్తారు.
ఈ విధమైన అర్చనావిధానము సులభసాధ్యముకాదు.అందుకే అఖిలభువనములపై అవ్యాజకరుణతో అంతర్యామి తన తేజస్సును అనేకానేకములుగా విస్తరింపచేస్తూ-తాను వ్యాపిస్తూ సకలములను జాగృతం చేస్తాడు.
చర్మ చక్షువులకు తన తేజస్సుతో దర్శింపచేస్తాడు.
లేకుంటే జీవకోటి తన సహజలక్షణమిన నిద్రావస్థనుండి /రాత్రి యను
రాతి స్థితి నుండి జాగృతము కాలేదు.
రశ్మిమంతం-సముద్యంతమే -మంగళముగాను-సూర్యనారాయణమూర్తిని "సుమంగళునిగాను"కీర్తిస్తారు.అది చింతాశోక ప్రశమనం అని పెద్దలు చెబుతారు.
చింత-అనుపదము గురించి పరిశీలిస్తే,
చిత్తవృత్తులను కార్యోన్ముఖముచేయునది కనుక చింత అనబడుతోంది.అంతరంగ శత్రువులను ప్రోత్సహించు స్వభావముకల్ది.
శోకమునకు కార్య-కారన సంబంధము తెలుపబడుతుంది.కారణము తొలగగానే కార్యము సమసిపోతుంది.శోకము వీడుతుంది.చింత అనిశములో చిత్తములో దాగి గుర్తుచేస్తూనే ఉంటుంది.
చింత-చింతనము-విచారము-ఆలోచనము అను నాలుగు మనో వికారములను దాటింపచేయుటయే,పంచేంద్రియములను పరమార్త్మ వైపునకు పయనింపచేయుటయే
"రశ్మిమంతం-సముద్యంతం." చిత్తవృత్తి ఫలితములు ఆనందదాయకములు కావచ్చును-కాకపోవచ్చును కాని చిత్ప్రకాశుని దర్శనము/స్పర్శనము తేజోమయమై
విశ్వామిత్రునిచే చెప్పబడినట్లు
కర్తవ్యమును-దైవమాహ్నికమనే నిత్య దేవతార్చనమును హెచ్చరిస్తుంది.
"లోకాన్ క్రియా సు ప్రవర్తం-సముద్యంతం గా నిర్వచిస్తారు పెద్దలు.
పరమాత్మ వైభవమును విష్ణుసహస్రనామ స్తోత్రము సైతము,
" ఓజః తేజః ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః
ఋద్ధః స్పష్టాక్షరః మంత్రః చంద్రాంశుః భాస్కరః ద్యుతిః' స్వామి నీవే పునర్నిర్మాణమునకు కావలిసిన ఓజస్సువు-నడింపించుటకు కావలిసిన ప్రకాశ-ప్రతాపరూపమైన తేజస్సువు-కాంతిని ధరించినవాడవు-కాంతికి అనుకూలముగా నీ కిరణములలోని అమృతత్త్వమును చంద్రునికి ప్రసాదించినవాడివి,స్పష్టముగా క్షరములేని రూపునిగా దర్శనమిచ్చు పరమాత్మవు-మననముచేసినంతనే రక్షించు మంత్రమును నీవే అని ప్రస్తుతించినది.
అమృతాంశువులను బీజముచేసి
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః
పరమం యో మహత్ బ్రహమం పరమం యః పరాయణ్ అం' అని సర్వముతానైన పరమాత్మను ప్రస్తుతిస్తున్నది.
పారము చేయగలిగినది పరము.అదే తీరము/ఒడ్డు.
యన్మండలం సమస్తదివ్యతేజోమయ రూపముగా కీర్తిస్తున్నది.మూర్తిని తనలో అంతర్భాగముచేసుకొనిన మూర్తిమండలము మనలను రక్షించును గాక.