telugubhaasha nerajaaNalaina telugupadamulu okkasaari tamaloeni aksharamulaloeni achchulanu anagaa guNimtapugurtulanu oka jaTTugaa chaesukoni marikonni achchulanu vaerokajaTTugaa choopistoo tama taLukubeLukulanu choopimchuTayaekaakumDaa kaliviDigaa unnaamanukumTunnaaraa ayitaenaemi maemaemu viDiviDigaa kooDaa unnaamu kanukkoemdi choodaam amtoo mananu savaalu chaestumTaayi.
asalu kaliviDi anu padamuloenae viDi anae aksharamulu gammattu chaestunnaayi kadaa.
okkasaari padamulanu gamaniddhaamu.vaaTi amtaryaanni Asvaadiddaamu.
1.kaakaasuruDu
2.baabaaguruvu
3.beebee churuku
4.chaachaa nuduru
veetiloeni remDu jaTtulanu vaeruchaeyaalamtae aksharamulaloe daagina achchunu/hallunu viDiviDigaa chooDavalasinadae.
kaakaasuruDu annadi padamu.
k-k-s-r-D-annavi amduloe daagina halluroopamulu.
vaaTini charina achchula gurimchi gamanistae
k+aa++,k+aa++ s+u,r+u,D+u,
modaTi renDu aksharamulaloeni achchu/guNimtapugurtu A/deerghamu.
chivari mooDu aksharamulaloeni hallulu s-r-D,vaaTiki sahakarimchina guNimtapugurtu/achchu u-kommu.
amTae padamuloe deerghamu/kommu remDu vargamulugaa hallunu kalupukoni samarthavamtamaina kaakaasuruDu anu padamutoe tama aikyatanu chaaTuchunnavi.
marikonni padamulanu vaerae guNimtamugala jaTTu padamulugaa chaerchamDi.
తెలుగుభాష నెరజాణలైన తెలుగుపదములు ఒక్కసారి తమలోని అక్షరములలోని అచ్చులను అనగా గుణింతపుగుర్తులను ఒక జట్టుగా చేసుకొని మరికొన్ని అచ్చులను వేరొకజట్టుగా చూపిస్తూ తమ తళుకుబెళుకులను చూపించుటయేకాకుండా కలివిడిగా ఉన్నామనుకుంటున్నారా అయితేనేమి మేమేము విడివిడిగా కూడా ఉన్నాము కనుక్కోంది చూదాం అంతూ మనను సవాలు చేస్తుంటాయి.
అసలు కలివిడి అను పదములోనే విడి అనే అక్షరములు గమ్మత్తు చేస్తున్నాయి కదా.
ఒక్కసారి పదములను గమనిద్ధాము.వాటి అంతర్యాన్ని ఆస్వాదిద్దాము.
1.కాకాసురుడు
2.బాబాగురువు
3.బీబీ చురుకు
4.చాచా నుదురు
వీతిలోని రెండు జట్తులను వేరుచేయాలంతే అక్షరములలో దాగిన అచ్చును/హల్లును విడివిడిగా చూడవలసినదే.
కాకాసురుడు అన్నది పదము.
క్-క్-స్-ర్-డ్-అన్నవి అందులో దాగిన హల్లురూపములు.
వాటిని చరిన అచ్చుల గురించి గమనిస్తే
క్+ఆ++,క్+ఆ++ స్+ఉ,ర్+ఉ,డ్+ఉ,
మొదటి రెండు అక్షరములలోని అచ్చు/గుణింతపుగుర్తు ఆ/దీర్ఘము.
చివరి మూడు అక్షరములలోని హల్లులు స్-ర్-డ్,వాటికి సహకరించిన గుణింతపుగుర్తు/అచ్చు ఉ-కొమ్ము.
అంటే పదములో దీర్ఘము/కొమ్ము రెండు వర్గములుగా హల్లును కలుపుకొని సమర్థవంతమైన కాకాసురుడు అను పదముతో తమ ఐక్యతను చాటుచున్నవి.
మరికొన్ని పదములను వేరే గుణింతముగల జట్టు పదములుగా చేర్చండి.