శ్లోకము
"మనసః కామం ఆకూతిం వాచః సత్యం అసీమహి
పశూనాం రూపం అన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః"
క్షుప్తిపాసాం మలా జ్యేష్ఠాం అలక్ష్మీ నాశయ అని ప్రార్థించిన సాధకుడు ప్రస్తుత శ్లోకములో పాడి-పంటలను అనుగ్రహించే "ధాన్యలక్ష్మి"ని తన దగ్గర స్థిరముగా ఉండునట్లు అహ్వానించమని జాతవేదుని ప్రార్థించుచున్నాడు.
ఓ జాతవేద-శ్రియం అసీమహి.
శ్రేయోదాయకమైన మహాలక్ష్మిని నా దగ్గరకు చేర్చుం.ఆ తల్లి అనుగ్రహముతో,
నా త్రికరణములు సత్యమార్గమునూనుసరించగలుగుతాయి.
అదియే నా -ఆకూతి-సంకల్పము.
నామనసః-మనస్సు-వాచః-పలుకులు-తద్వారా నేను కోరుకునే కోరికలు/కామం సత్యసంపూర్ణములై సన్మార్గమును అవలంబిస్తాయి.
తద్వారా ,
అకూతిం-సంకల్పము సిద్ధించి నేను సంతృప్తిని పొందుతాను.దృఢసంకల్పము నన్ను అమ్మ అనుగ్రహముతో సిద్ధిని పొందేటళుగా చేస్తుంది.
తత్ఫలితముగా ,
పాశూనాం-రూపం-అన్నస్య మయి అసీమహి.
పశువుల ద్వారా పాడి,పంటలద్వారా అన్నము లభిస్తాయి.ఇదిఒక భావన.
ఇంతకుముందరి శ్లోకములో "కరీషిణీం" గోమయమును ప్రసాదించే తల్లి అనికీర్తించారు.
ప్రస్తుత శ్లోకములో వాచః-వాకులను సత్యసంపూర్ణము చేసి వేదవాజ్మయమును ఆకళింపు చేసుకొని,ఆచరించే అనుగ్రహమును
ఆకూతిం సంకల్పమును-సిద్ధిని అనుగ్రహించునట్లు చేయుము.
ఆ మహాలక్ష్మి ధాన్యలక్ష్మియే కాదు విద్యాలక్ష్మి కూడ.
పశూనాం రూపం శ్రేయతాం మమ.
అన్నస్య రూపం శ్రేయతాం మమ
సత్యస్య రూపం శ్రేయతాం మమ
కామస్య రూపం శ్రేయతాం మమ
మనసః నాం శ్రేయతాం మమ.
ఓ జాతవేద నీకు పరబ్రహ్మమునకు భేదములేదు.నీవు మా ఇద్దరికి అనుసంధానకుడవు.
బిల్వమంగళుడు కీర్తించినట్లు,
"జిహ్వే రసజ్ఞే మథుర ప్రియత్వం
సత్యం హితం త్వాం పరమం వదామి"
నేను సత్యవాక్పరిపాలకునిగా మారాలంటే.
నా మనసులో జనించే కోరికలు ధర్మబద్ధమైనవిగా ఉండాలి.
ఎందుకంటే
"మనసేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షకం."
కనుక నా వాక్కును నా మనసు సన్మార్గమున నడింపచగలిగినదై ఉండాలి.
పశూనాం అనగా ఇంద్రియములు అన్న అర్థమును స్వీకరిస్తే అవి సత్యము తన రూపుగా /ప్రకటనముగా కలిగియుండాలి.
మా మయ-నాయందు-యశ స్రీ-కీర్తి అనే సంపద .లక్ష్మీప్రద స్వభావము శాశ్వతముగా నుండి
మయ ఆకూతిం-నన్ను సంతోషముతో నుండునట్లు దీవించును గాక.
హిరణ్యమయీం లక్ష్మీం సదా భజామి.