"అష్టదలకమలమందు నిష్టతో నీ ప్రతిమనిలిపి
అర్ష్టికర్తవనుచు నీదు చరనములనే నమ్మితిని
పరమేశ్వరి నీకిదిగో వందనం"
స్థూలదేహముతో త్రైలోక్యమోహన చక్రమనే మూడుగీతలు కలిగిన ప్రాకారములోనికిప్రవేశించిన ప్రయాణికుడు అక్కడ సిద్ధిమాతల-సప్తమాతృకల-ఉద్రాశక్తుల సహాయముతో చక్రేశ్వరి ఆశీర్వచనముతో ఒకమెట్టిపైకెక్కి సర్వాశాపరిపూరక చక్రమను పేరుతో నున్న పదహార్రు వికసిత దళములతో వృత్తాకారముగానున్న ఆవరనములోనికి ప్రవేశించి పదహారు అద్భుత శక్తిమాతల,సిద్ధిమాత,ముద్రామాత సహాయముతో స్వప్నావస్థను మనసుతో ల్కలిసిన సూక్ష్మ శరీరముతో అనుభవించి తాత్కాలికమైన ఆనందమునకు లొంగక అణిమలోని మహత్తును,లఘిమలోని పటుత్వమును అర్థముచేసుకుని,చక్రేశ్వరి దీవెనతో మూడవ ఆవరణమైన "సర్వ సంక్షోభణ చక్రమను"పేరుగల మూడవ ఆవరనము లోనికి ప్రవేశిస్తున్నాడు.మహిమా సిద్ధిమాత-సర్వాకర్షన ముద్ర మాత సహాయమునకై తోడుగా ఉన్నారు.ముద్రాసక్తి న్యాసమును తెలియచేయుటతో పాటుగా,సందేహములను సైతము తొలగిస్తున్నది.
స్వప్నములకు ఇక్కడ చోటు లేదు.ఊహలు ఊసులాదవు.
ప్రయాణికుడు విశ్వ-తేజదశలను దాటి ప్రాజ్ఞుడవుతున్నాడు.అంటే జ్ఞానమును పరిచయముచేసుకుంటున్నాడు.అజ్ఞానము ఇంకా పూర్తిగా వీడలేదు.
ఎనిమిది మంది శక్తిమాతలు ప్రయాణికుని మనోభావములకు స్థిరత్వమునుకలిపిస్తున్నారు.దేహభ్రాంతిని తొలగచేస్తున్నారు.గురువులై ఇంద్రియములను-మనసును స్తిమిత పరుస్తున్నారు.వీరిని అనంగ శక్తులని,గుప్తతర యోగినులని పిలుస్తారు.సాధకుని అంతరంగమును అతిగుప్తముగా సమాధాన పరుస్తూ,
ఎట్టి పరిస్థితులలైనను తనకు తాను సమర్థవంతముగాఉందగలిగే ,తన సమస్యలను పరిష్కరించుకునే అర్హతను కల్పిస్తారు.
పరమేశ్వరి మహిమను అర్థము చేసుకోవాలంటే మనోదౌర్బల్యములు దూరమై మహిమ సిద్ధిని పొందగలుగుతాడు.
ఈ ఎనిమిది శక్తులను మన్మథ సంబంధ శక్తులుగా కూడా సమన్వయిస్తూ,అనంగ కుసుమే,మేఖలే,రేఖే ,అంకుశే అంటూ
చిత్తశుద్ధితో ఎటువంటికోరికనుకలిగియుండాలి,దానికి ఎంతవరకని హద్దునునియంత్రించాలి,ఆకోరికను ఎలా అలవాటు చేసుకోవాలి,ఆ అలవాటుని అభ్యాసముగా ఎలా మార్చుకోవాలి,ఉత్తేజ పరచుకోవాలి,ఆడంకులను ఎలా త్రుంచివేయకలగాలి అన్న వాటి సంకేతములే ఈ ఎనిమిది శక్తిమాతలు.
సర్వాకర్షిణి ముద్ర సత్తు వైపునకు ఆకరషణను కలుగచేస్తూ,నడిపిస్తూ ఉంటుంది కనుక దేహభ్రాంతి దూరమవుతుంటుంది.
గాఢ నిద్రలో నున్న దేహమును ఏ స్వప్నములు బాధించవు.ఏఇంద్రియములు తొందరపడవు.మనసు సైతమునిమిత్తమాత్రమై ఉంటుంది.అదినిత్య ప్రళయస్థితి.
స్థూల సూక్ష్మ దేహములు తమౌనికిని గమనించలేని స్థితి.ఉపాధిఉంటుందికాని ఉపాధి ఉనికిఉండదు.దివ్యానందములో జ్ఞాన-జ్ఞాతృ-జ్ఞేయములో ఏకీకృతమవుతాయి.గాఢనిద్రలో శ్వాస నైసర్గిత శక్తులను స్వీకరించి మరింత ప్రశాంతపడుతుంది.
"ఆనందో బ్రహ్మః" అన్న స్థితిలోనున్న సాధకుడు ఆ స్థితిని తాను శాశ్వతముగా పొందేందుకు,
సృష్టిత్రయ" ఆవరనములను దాటి,మరొక మెట్టి పైకెక్కి,సర్వ సౌభాగ్యదాయకచక్ర" ప్రవేశమునకై చక్రేశ్వరి ఆశీర్వచనమునై సంసిద్ధుడగుచున్నాడు.
" యాదేవి సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః"