తిరువెంబావాయ్-23
*****************
కూవిన పూంగుయిల్ కూవిన కోళి
కురుగుకు ఇయంబిన ఇయంబిన శంగం
ఓవిన తారకై ఒళిఒళి ఉదయత్తు
ఒరుప్పడు కిన్రాడు విరొప్పొడు నమక్కు
తేవన తెరికళల్ కాలి కాట్టాయ్
తిరుపెరుం తురైరురై శివపెరుమానే
యా వరుం ఆరివరి ఆయమ కడయాయ్
ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె.
అనుగ్రహాభరణ పాదయే పోట్రి
*********************
తిరుమాణిక్యవాచగరు మనకు అందించిన ఈ అద్భుత సుప్రభాత సేవలో ఇంతవరకుపద్మములు-సూర్యుడు స్వామి ముఖారవిందకాంతిని తమతో తెచ్చుకుని ప్రకాశిస్తూ-ప్రశంసిస్తున్నారు.
ఈ పాశురములో కాంతిని నాదము అనుసరించి స్వామిని అర్చించుచున్నది. అవి ఏమనగా,
కూవిన పూంగుయల్-కోకిల సుస్వరములు,
కూవిన కోళి-కుక్కుట/కోడి సుప్రభాతములు,
ఇయంబిన కురుగుకళ్-పక్షుల కిలకిలారావములు,
శంగం ఇయంబిన-శంఖనాదార్చనలు,
శబ్దసేవతో పునీతములగుచున్నవి.
స్వామి నీ కనుసన్నలలో నడచు ప్రకృతి,నియమానుసారముగా ప్రవర్తించుచు నిన్ను సేవించుచున్నది.అవిగో,
తారకె ఓవినై-నక్షత్రములు కనుమరుగగుచున్నవి.
ఒళి-ఒళి-తేజస్సును క్రమముగా ఒక పుంజమును మరొక పుంజము అనుసరించుచు,
ఉదయితు-ఉషోదయ కాంతిరేఖలను విస్తరింపచేయుచున్నది.
తిరుమాణిక్యవాచగరు ఇక్కడ,
ఒళి-ఒళి అను కాంతిసంకేతమును రెండు సార్లు ప్రయోగించి,చమత్కరించినారు.
మొదటి ఒళి అవి స్వామి ముఖబింబము నుండి తెచ్చుకున్నవి/స్వామి వాటికి అనుగ్రహించినది.
ఇక రెండవ ఒళి ఏమిటి అంటే తెలవారుచున్నదన్న సంతోషము,నీ దర్శనమును చేసుకోగలమను ఆనందము మాముఖములయందు ప్రకాశించుచుండగా,సూర్య కిరణములు వాటిని కూడా తమయందు ప్రతిబింబించుకొని తేజోవంతముగా ,
ఒరుప్పడుం కిన్రడువిరుప్పొడుం నమక్కు
వ్యాపిస్తూ,తరిస్తున్నవి.
మూడవ విషయము బహురమణీయమైనది.మమ్ములను భాగ్యవంతులను చేయునది.అది ఏమనగా బ్రహ్మ-విష్ణు-సురలకు లభ్యము కాని,
మంజీరాలంకృత పాదపద్మములు మాకు సేవా సౌభాగ్యమును ప్రసాదించుచున్నవి.
స్వామి అరివరియాయ్ అడియాయ్-స్వామి మంజీరాలంకృత పాదములు,
యా వరుం-తామే మాదగ్గరకు వచ్చి,
అనుగ్రహించుచున్నవి.
ఓ శివ పెరుమానే,
మమ్ములను చైతన్యవంతులను చేయుటకు,ఏలుకొనుటకు,
మేలుకొనవయ్యా.
తిరు పెరుంతురై అరుళ ఇది.
ఆత్మనాథ స్వామి తిరువడిగళే పోట్రి.
నండ్రి.వణక్కం.