నః ప్రయచ్చంతి సౌఖ్యం-30
**********************
భగవంతునిది హిమగిరి-భగవదంశది మహిమగిరి.
" బ్రహ్మాండ వ్యాప్తదేహ భసితహిమరుచా భాసమానా భుజంగైః
కంఠేకాలాః కప్ర్దా కలిత శశికలాశ్చండ కోదంద హస్తాః
త్రక్య్షా రుద్రాక్షమాలా స లలిత వపుషః శాంభవా "మూర్తిభేదాః
రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా " నః ప్రయచ్చంతి సౌఖ్యం."
" ఓం కైలాసవాసినే నమః."
" కేళీనాం సమూహం కైలం-కైలస్య ఆవాసం కైలాసం."
సర్వాంతర్యామి యైన స్వామి నివాసము చర్మచక్షువులకు హిమగిరి పర్వతశ్రేణులలోని కైలాసగిరి.ఇది స్వామి విభూతిమహిమ.కొంచము నిశితంగా పరిశీలిస్తే కైలాసము అను స్వామి నివాసమును ఇసుమంతయును దుఃఖ స్పర్శలేని పరమానందధామము.సృష్టి-స్థితి-సమ్హార-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యములను పరమప్రీతితో పరమేశుడు ఎక్కడుండి తాను చేయునో అదియే కైలాసము.పార్వతీ-పరమేశ్వరుల పవిత్ర దర్శన ప్రసారమే అదే ప్రసాదమే కైలాసము.
" నమో గిరిశాయచ-శిపివిష్టాయచ."
భక్తరక్షణకై కైలాస పర్వతమున ఉమామహేశ్వరునిగా స్థిరముగానున్నరుద్రునకు నమస్కారము.గిరులనగా వాక్కులు అను మరొక అర్థమునకు అన్వయించుకొనినచే వాక్స్వరూపుడు వేదమయుడుగా రుద్రుని కీర్తించవచ్చును.
" నమః శ్లోక్యాయచ-అవసాన్యాయచ".
వైదికమంత్రములు-వేదాంతము రెండును తానైన రుద్రునకు నమస్కారములు.
" నమో హ్రదయ్యాయచ-నివేష్యాయచ."
నివేషయముమంచునీరు.రుద్రా నీ లీలా విభూతిని నేనేమని వర్ణించగలను? సముద్ర మట్టానికి 21,778అడుగుల ఎత్తున టిబెట్ భూభాగములో నున్న హిమాలయ పర్వతశ్రేణులలో కైలసగిరి కన్నులపండుగ చేయుచున్నది.కైలాస పర్వతము నలువైపులా నాలుగు రూపాలతో,నాలుగు రంగులలో ఉంటుందట.ఒక వైపు సింహము,మరొల వైపు హయగ్రీవము,ఇంకొక వైపు ఏనుగు,మరొకవైపు నెమలి ఈశ్వర స్వరూపమునకు ప్రతీకలుగా ప్రసిధ్ధిపొందాయి.భౌగోళికులు కైలాసమును మధ్యస్థానముగాను, యోగశాస్త్రములో కైలాసగిరిని సహస్రార చక్రముగా పేర్కొంటారు. విష్ణు పురాన ప్రకారము కైలాస పర్వత నాలుగు ముఖములు స్పటిక,హిరణ్య,కెంపు,నీలి వర్ణాలతో శివతత్త్వమును ప్రతిపాదిస్తు-ప్రకాశిస్తుంటుంది.కైలాస పర్వత మూలమున నున్నబ్రహ్మపుత్ర,స
ట్లెజ్,సింధు మొదలగు నదులు నాలుగు వైపులా ప్రవహిస్తూ సస్యశ్యామలంగా సందర్శనమిస్తాయి.
" ఓం నాద్యాయచ-వైశంపాయచ" నదులయందును,చిన్న సరస్సుల యందును ప్రకాశించుచున్న రుద్రునకు నమస్కారములు.
ప్రపంచములో ఎవరు అధిరోహించని పర్వతము కైలాసగిరి.సాలగ్రామ మయమైన సదాశివుని నివాసమును అధిస్ఠించుట అపచారముగా హిందుమత విశ్వాసకులు భావిస్తారు.కొందరు ప్రయత్నించినప్పటికిని కృతకృత్యులు కాలేదు.
" నమః కాట్యాచ-గహ్వరేష్ఠాయచ."
ప్రవేశింపరాని పర్వతగుహలందున్న రుద్రునకు నమస్కారములు.
జగమంతానిబిడీకృతమై యున్నది శివచైతన్యము.కైలాసగిరిని తండ్రిగాను,మానస సరోవరమును తల్లిగాను భావిస్తారు.కైలాస పర్వత పాదపీఠములోని మానస సరోవరము మహాద్భుతము.బ్రహ్మముహూర్తములో పరమేశ్వరుడు జ్యోతిరూపుడై దర్శనమిస్తాడని నమ్ముతారు.బ్రహ్మ మానసమునుండి దీనిని సృజించినాడని నమ్ముతారు.ఎందరో ఋషులు,యోగులు ఇక్కడ స్నానముచేసి పునీతులవుతుంటారు.ఇక్కడిది దేవస్నానము.మనోబుధ్ధులను మలినరహితముచేయు మహేశ్వర కృపాకటాక్షములను మందాకిని స్నానము.
" నమః కాట్యాయచ-నీప్యాయచ"
కొద్దిపాటి నీరు ప్రవహించు చిన్నచిన్న కాలువలయందును,కొండల శిఖరములపై (కైలాసగిరుల) నుండి జారు మానస సరోవరమందున్న రుద్రునకు నమస్కారాము.హరహర మహాదేవ శంభోశంకర.
ఇక భగదంశ-భగవంతుడున్న కొండ తమిళనాడు రాష్ట్రములోని తిరువన్నామలై నగర సమీపములో 2500 అడుగుల ఎత్తులో అరుణవర్ణముతో ప్రకాశిస్తూ అరుణగిరిగా,శోణగిరిగా
ప్రసిధ్ధిచెందిన అరుణాచలము.బ్రహ్మ విష్ణువులకు తనతత్త్వమునుతెలియచేసిన అరుణాచలేశ్వరుడు అపిత కుచాంబ సహితుడై అలరారుచున్న ఆనందధామము.
" దర్శనాత్ అబ్రసదసి
జననాత్ కమలాలయే
స్మరణాత్ అరుణాచలే
కాశ్యాంత్ మరణాన్ ముక్తి"
అని స్వయముగా పరమేశ్వరునిచే పలుకబడిన స్వయం ప్రకాశక లక్షణముకలది.
"గిరిశ ప్రణిత కామ వర్షిన్" అని ఆర్యోక్తి.
ఆద్యంత రహిత తేజోపుంజాలను సామాన్య చక్షువులు స్వీకరించలేవని పరమదయాళువైన పరమేశ్వరుడు కరుణాంతరంగుడై తేజోమయలింగమై విరాజిల్లుతున్నాడు.
శివుడు మొట్టమొదట వ్యక్తముచేసిన రూపము జ్యోతిర్స్తంభము.ఈ సంఘటనలో బ్రహ్మవిష్ణులు సృష్టి-స్థితులకు పరిమితమయ్యారు.లయమగునది అనంత తత్త్వము.దానిని తెలియచేయునదే అరుణాచలము.అరుణము అనగా వెలుగు అమ్మతత్త్వము.అచలము స్థాణువగు స్వమి తత్త్వము.అగ్నిస్తంభము స్వామి క్లుప్తమై అరుణగిరిగా దర్శనమిస్తుంది.ఇప్పటికిని అనుగ్రహపాత్రులకు గిరిమధ్యస్థానములో గోచరిస్తుందట.అరుణాచలము కృతయుగమున జ్యోతి రూపమునను,త్రేతాయుగమున పసిడి రూపముగను,ద్వాపర యుగమున రాగి రూపముగను,కలి యుగమున శిలారూపమునను వ్యక్తీకరింపబడుతోంది.
అరుణాచలము రాశీభూతమైన జ్ఞానాగ్ని.ఇచ్చట అగ్నిలింగముగా ఆరాధింపబడుచున్న స్వామి,సామాన్యభక్తులను అనుగ్రహించుటకై,తన అగ్నికీలలను శిలలలో నిక్షిప్తముచేసి,స్థూల రూపముతో విరాజిల్లుచున్నాడు.
" నమః అనిర్హతేభ్యః."
సర్వపాపములను సంపూర్ణముగా పరిహరింపచేయువాడు సదాశివుడు.
అరుణాచలము మూడు యోజనములవరకు గిరితేజస్సును అనుగ్రహిస్తుంటుంది.కనుక ఇక్కడ ఏ దీక్షానియమములు వర్తించవు.గౌతమముని పూజా విధానములను శివుని ఆనగా నిర్దేశించినాడని పెద్దలు చెబుతారు.కాలభైరవుడు క్షేత్రపాలకుడు.
ఇప్పచెట్టు స్థలవృక్షము.
" వృక్షేభ్యో హరికేశేభ్యో నమో నమః".
అరుణాచల గుహలో పరమశివుడు దక్షిణామూర్తి తత్త్వముతో తపోముద్రలో నున్నాడని భక్తుల విశ్వాసము.
.కాని అక్కడికి ప్రవేశము నిషేధము.ఎంతో మంది ప్రయత్నించి విఫలురైనారట.
" ఆసీనేభ్యో-శయానేభ్యశ్చవ నమో నమః."
అరుణాచల ప్రవేశము పొందినవారెంత అనుగ్రహపాత్రులో.గిరిప్రదక్షిణము ఎంతో మంగళప్రదము.
" నమ ఆశవేయచ-అజరాయచ."
సర్వ ప్రపంచమును శీఘ్రముగా వ్యాపించినవాడును,గమనమున సమర్థుడగు రుద్రునకు నమస్కారము.
శివమహిమ్నా స్తోత్రములో పుష్పదంతులవారు సెలవిచ్చినట్లు సరస్వతీదేవి సముద్రమును సిరాచేసికొని,పర్వతమును కలముచేసుకొని,భూమిని పత్రముగా మార్చుకొని శివమహిమలను సంపూర్ణముగా వర్ణించగలుగుట అసాధ్యము.శివస్వరూపులు నా అజ్ఞానమును మన్నించెదరు గాక.

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచశివ అరుణశివ."
కొండకు ప్రదక్షిణము శివునికి ప్రదక్షిణము.ప్రతి దిక్కు-ప్రతి మూల పరమేశ్వరానుగ్రహ పాత్రములు.రమణులవారు నన్ను మన్నించి ఆశీర్వదించెదరు గాక.మనో-వాక్కాయ-కర్మలు వారి స్మరణతో నిండియున్న వారి అనుగ్రహము
నన్ను క్షమించును గాక.
.ఇక్కడ భక్తులకు స్వామి ఎందరెందరినో ఎన్నోవిధములుగా సాక్షాత్కరించి సహాయపడిరి.కావ్యకంఠ గణపతి ముని భక్తిని లోకవిదితము చేయుటకై స్వామి తన రథమును ఆపి,గణపతిముని కరస్పర్శచే కదిలించెను. తన భక్తుల మనోరథములను నెరవేర్చు,
" రథేభ్యో రథపతిభ్యశ్చవో నమో నమః."
అరుణాచలేశుని దయతో చచ్చుబడ్ద భక్తుని కాళ్ళు చేవను సంపాదించుకొన్నవి.
భక్తురాలు దివ్య సంగీతము వినగలిగినది.
జట్కావాడి క్రూరత్వము నుండి వనిత రక్షింపబడినది.
కొండల మధ్యలో బూట్లు చిరిగిన భక్తుని అశక్తతను తొలగించగ బూట్లు ఒకతనిచే కుట్టబడినవి.
ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో నక్షత్రములను లెక్కబెట్టగలమా? అరుణాచలేశుని మహిమలను గుర్తించగలమా?
ఇచ్చటి భక్తులకు సాక్షాతు లక్ష్మీదేవియే వైద్యము చేస్తుందట. ఆహా ఎంతటి అదృష్టము
అద్భుత అనుగ్రహములకు ఆలవాలమైన అరుణాచలేశుడు మనలను అనుగ్రహించు గాక.
ఏక బిల్వం శివార్పణం.
సర్వం పరమేశ్వరార్పణం. ఓం తత్ సత్.