తనోవ నః శివః శివం-06
****************
"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"
మహాద్భుతమైనది ప్రస్తుత చరణము శివశక్త్యాత్మకతను మరింత ప్రస్పుటము చేస్తోంది
" ధరాధరేంద్ర నందిని విలాస బంధుబంధుర
స్పురత్ దిగంతసంతతి ప్రమోద మాన మానసే
కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది
క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని."
సర్వమంగళా దేవి సమక్షములో మహాదేవుడు మహదానందముతో తాందవిస్తున్నాడు.
1.ధరేంద్ర నందనందిని విలాస బంధు బంధుర
లీలగా తనను తాను అలంకరించుకొనినది జగన్మాత.ఆలంకారములకు లక్ష్యము మహాదేవుని ప్రమోద మానసునిచేయుటయే.
అవలీలగా తాండవిస్తున్నాడు త్రయంబకుడు.ఆ తాండవమునకు
లక్ష్యము మహాదేవిని ప్రమోద మానస చేయుటయే.
వారిరువురి పరస్పరావలోకన లక్ష్యము వారి సంతతిని ప్రమోదమానసులను చేయుటయే.
అమ్మది విలాసము-అయ్యది వినోదము.
అమ్మ నందిని-ఆనందప్రదాయిని.
అమ్మ అఖిల జగములకు ఆనందప్రదాయిని.
అయ్య సృష్టిని తన తాండవముతో విస్తరింపచేస్తున్నాడు.అమ్మ ఆ విస్తరణలో వ్యాపిని వివిధాకారయైన చైతన్య శక్తిగా ప్రవేశించి ప్రకాశవంతము చేస్తున్నది.
అమ్మ ధరాధరేంద్ర నందిని.
ధరాధరము అంటే మనము రెండు విధములుగా అన్వయించుకోవచ్చును.
మొదటిది
ధరను మోయుచున్న పర్వతము.
పర్వతము భూమినెట్లా మోస్తుంది? అని అజ్ఞానము సందేహిస్తుంది.
మనము ఒక బొక్కెనలో పదార్థమునుంది మోయునపుడు మనశక్తి బొక్కెన కాడను పట్టుకుంటాము కనుక పైనుండి ప్రకటితమగును కిందనున్న వస్తువును /బొక్కెనను మోస్తుంది.
రెండవ్ది
పర్వతమును ధరించిన భూమి
పండ్లబుట్తను తలపై పెట్టుకుని వెళ్తున్నప్పుడు వస్తువు పైన-దానిని మోసే శక్తి కింద ఉంటాయికదా.
అదేవిధముగా
ప్రపంచముగా పార్వతిని కొత్తగా చూస్తున్న పరమేశ్వర మానసము ఉల్లాసభరితమైనది.
ప్రపంచమై పరమేశ్వర తాండవమును చూస్తున్న పరమేశ్వరి మానసము ఉల్లాసభరితమైనది.
వారిరువురిని వీక్షిస్తున్న దిక్కులు మానసము సైతము ఉల్లాసభరితమైనది.
" ఆ మహోల్లాసమునకు సంతతము సంతసమే కదా".అది,
2. స్పురత్ దిగంతర సంతత ప్రమోదమాన మానసము.
ఆ ప్రమోద మానసము కృపాకటాక్షవీక్షణమైన వేళ,
3.కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది.
దుర్ధర -భరించలేని ఆపది-ఆపదలను నిరుద్ధ-నిర్మూలించివేస్తుంది.
పార్వతీ-పరమేశ్వరుల కృపాకటాక్షవీక్షనము ఘోరవిపత్తులను సైతము తొలగించివేస్తుంది.
"భవానీ త్వం దాసే మయి వితర్ దృష్టిం స కరుణా" అంటోంది
సౌందర్యలహరి స్తోత్రము.
ఇప్పుడు ఆపదలు లేవు.కాని,
స్తోత్రకర్తకు ఒక సందేహము.
ఈశ్వర కరుణ ,
రతి ప్రతిక్షణం మమ తొ గంగనుధరించిన,వాసుకిని కంఠహారముగా ధరించిన,కరమున ధ్వనించుచున్న డమరుకమును ధరించిన స్వామియందు మిక్కిలి మక్కువ కలిగి క్రీడించుటలో తృప్తిని పొందుటలేదు.
అక్కడేదో అంతకు మించిన" క్వచిత్ వస్తువు " (బ్రహ్మపదార్ధము) ఉన్నదని-ఆ వస్తువే మనోవినోదమునకు కారనము అని తెలుస్తోంది.
స్వామి 1
ఆ క్వచిత్ వస్తువుతో మమేకమై మనోవినోదమును పొందాలనిపిస్తున్నది మహాదేవా! నా అభ్యర్థనము మన్నించు.
ఆత్మాన్వేషణము అత్యద్భుతమై,
తాండవదర్శనమును మరింత తత్త్వమునకు చేరుస్తున్నది.
ఇప్పుడు కావలిసినది కేవలము,
స్వామి సాకార దర్శనము మాత్రమేకాదు.స్వామిని-స్వామిజటను-జటలోని గంగమ్మను-స్వామికంఠమును-కంఠమునకు చుట్టుకొనిన పామును,స్వామిచేతిని-చేతిలోని డమరును,సిగపూవును,ఎర్రటి తలపాగాను మిక్కిలి మక్కువతో చూస్తున్నప్పటికి
ఇంకా..ఇంకా..ఏదో ..దేనినో తెలుసుకోవాలనే తపన,
నందినీదేవీ-నందినీదేవి విలాసబంధురము-నందినీదేవి కృపాకటాక్ష వీక్షణము,ఆపదోద్ధరణము ఇలా -ఇని రూపములుగా,ఇన్ని విధములుగ,ఇన్ని తత్త్వములుగా ప్రకటనము చేస్తున్న " ఆ క్వచిత్ వస్తువు/మూలబ్రహ్మము "ఏదో తెలుసుకొని,దానితో మనోవినోదమును పొందగలగాలి అనుకునుటయే,
4.క్వచిత్ దిగంబరే మనోవినోదమేతు వస్తుమే."
కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ.
శివభజమేవ నిరంతరం
ఏక బిల్వం శివార్పణం.