Sunday, December 3, 2023

KADAA TVAAM PASYAEYAM-21




కదా త్వాంపశ్యేయం-21 ****************** "పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనౌ జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైరహం ప్రార్థితో మామా జ్ఞాపయ తన్నిరూపాయ ముహుర్మామేవ మామేవచః." ఓ! మృత్యుంజయా ! ఓ మహేశా! ఎంతటిచమత్కారి నీఅనుగ్రహము.ఆనవాలు లేనట్టు మా పాపములు తొలగించివేసినది.ఎంతటి చతుర నీ కరుణ.వాటిని తిరిగి మా దరిచేరనీయనని,మా మనస్సును నిన్ను ధ్యానింపుమని,శిరమును నీకు నమస్కరించమని,చెవులకు నీ దివ్యకథలను ఆలకింపమని,పాదములను నీకు ప్రదక్షిణములను చేయమని,కన్నులకు నీ దివ్య విగ్రహమును దర్శించమని,అని కొత్త ఆటలను పరిచయము చేస్తూ,వాటి నన్నింటిని సమన్వయపరుస్తున్నది సహృదయతతో. స్వామి నీకు నీ కరుణకు లేశమంతయును భేదములేదు కదా ఖేదహరణములో. అట్టి నీ అవ్యాజకరుణను మామీద అనవరతము వర్షించనిమ్మని ఆ ఆదిదేవుని ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము. గురువుగారు శంకరయ్యను చూస్తూ,ప్రారంభించు అన్నట్లుగా సైగచేసారు. ముచ్చెమటలు పోస్తున్నాయి శంకరయ్యకు.తనకు ఏమి తెలుసనిచెబుతానన్నాను నిన్న.అని మహేశా ఎందులకీ పరీక్ష .అంతలోనే, "కింబ్రూమస్తవ సాహసం పశుపతే.... పశ్యన్ నిర్భయ ఏకఏవ" ప్రపంచము భీకరోగ్రజ్వాలలతో జలమయినప్పుడు ఒక్కడవే ధైర్యముగా ఎలాచూస్తూ,ఉండగలిగావు? అని ఆ నిశ్చలశక్తిని నాకు సైతము అనుగ్రహించుము అని వేడుకున్నంతలో ఒకటే తుమ్మెదలఝంకారము ఓం నమశివాయ-ఓం నమశివాయ-ఓం నమశివాయ అంటూ దారి అంతా ప్రదక్షిణము చేస్తున్నాయా అన్నట్లు పరిభ్రమిస్తున్నాయి. నాదం శివమయం-నామం శివమయం- - పదము శివమయం-పథము శివమయం. అంబే శివం-అంబే శివం-అంబే శివం సాంబే శివం-సాంబే శివం-సాంబేశివం. అంతా సాంబమయం. కళ్లుతెరిచి చూశాడు శంకరయ్య.ఎదురుగుండా తుమ్మెదలతో గణేశుడు. నువ్వా! ఇక్కాడా! ఇలా! వచ్చేశావా! ఎందుకు ?అని,అడిగాడు అమాయకంగా. నేను నీ ముందు లేకుండ కథను ఎలా చెబుదామనుకున్నావు? అందుకని మా తుమ్మెదలన్ని పద మనము విందాము శంకరయ్య అక్కడ కథ చెబుతాడట అని తీసుకునివచ్చాయి అని నవ్వాడు. వెంటనే శంకరయ్య వినయముతో, " వచసా చరితం వదామి శంభో" అనుకుంటుండగానే, డమరుకము డమడమ మంటూ తన కథను వినిపించమంది. ఆశ్చర్యము అవి అక్షరములా లేక శివభావ లక్షణములా ఆలంబనా రక్షణములా శివోహం . కన్నుల ఎదురుగా శివయ్య కానీయమంటున్నాడు. 'శంభో స్వస్త్వ కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం" అనగానే, వారిలోనుండి ఒక శిష్యుడు ఈతను మనకు కొత్తవాడు.కనుక ఇతని కథ-కథనము కొత్తగా ఉండాలి.అలా అని శివానందలహరిని స్పృశించాలి అలా చెప్పగలిగితేనే చెప్పమనండి అన్నాడు మీ అందరి కోరికను పరిగణిస్తూ ప్రారంభిస్తున్నాను అన్నాడు శంకరయ్య. మహేశ్వరునికి కుటుంబయ్య అంటే అమితమైన ప్రీతి.చిన్న శిశువుగా ఉన్న కుటుంబయ్య దగ్గరకు తరచు వెళ్ళి ఆడుతూ-పాడుతూ ఉండేవాడు.కుటుంబయ్యకు కూడా శివుడంతే ఇష్టమే ఒకనాడు,... శివునికి బాగా ఆకలివేసినది.నైవేద్యాలు అందలేదు.దేవతలందరు క్షీరసాగర మథనములో చిక్కుకుని ఉన్నారు. కుటుంబయ్య అప్పుడే వాళ్ళ అమ్మ చేతిముద్దలు తింటున్నాడు.శివయ్య ప్రేమగా కుటుంబయ్య నాకు ఆకలిగా ఉందయ్య.ఒక్కముద్ద నీ చేతిలోనిది పెట్టవూ .మీ అమ్మ చూదటం లేదులే అంటు నోరు తెరిచాడు. బుద్ధి కర్మాను సారిణి కదా, తానే గుటుక్కున తినేశాడు కుటుంబయ్య. ఇంతలో శివయ్య దేవతలను రక్షించడానికి వెళ్ళటం ,విషము ఆహారముగా స్వీకరించి,కంథము లో నే నిలుపుకోవటం జరిగింది. ఓం నమః శివాయ ఆ విధముగా శివయ్యకు ఆహారమును ఇచ్చిన ఘనత/అదృష్తమును కుటుంబయ్య పొందలేకపోయాడు. ఎప్పుడు అన్నము పెడతానన్నా శివయ్య-అశనం గరలం అంటూనే ఉన్నాడు. తానెక్కడినుంచి తేగలడు ఆ గరళమును. చేతకాక ఊరుకున్నాడు. ఒక్కటే చప్పట్లు.అందరు ఇంకా చెప్పు తరువాత ఏమైనదో ... .చూశావా నా కంఠాన్ని అంటూ,ఎదురుగా నెమలి నిలబడి నవ్వుతోంది.నివ్వెరబోయాడు శంకరయ్య. కథ..కథ.కథ కావాలి అంటున్నారు దారిలో నడుస్తూ. గొంతు సవరించుకుంటున్నాడు శంకరయ్య.రోజూ వస్తూనే ఉన్నాడు శివుడు కుటుంబయ్య దగ్గరకు.ఒకరోజు కుటుంబయ్య శంకరయ్యతో ఈ రోజు నా పుట్టినరోజు.ఎన్నికొత్త దుస్తులో. శివునికి కుటుంబయ్యను అనుగ్రహించాలనిపించింది.అసలే ఆహారమును సమర్పించే అవకాశమును పోగొట్టుకున్నాడు. పైకి ఏమీ తెలియనట్లు ఈ ఎర్రచొక్కా చాలాబాగుంది నాకు ఇస్తావా వేసుకుంటా అన్నాడు. ఆంతర్యము తెలియని కుటుంబయ్య ఇప్పుడు మాత్రం ఇవన్నీ నాకేసుమా.అన్నీ నేనే వేసుకుంటాను.అన్నాడు ఇంకేముంది శివయ్య కథ మామూలే.గజాసురుడు వచ్చాడు.చర్మమును వస్త్రముగా ధరించమన్నాడు. "వసనం చర్మ చ" అదియును ఎప్పటికిని. ఓం నమః కృత్తివాసాయ. పోనీ గొలుసులుఇస్తావా అడిగాడు శివయ్య.మాట్లాదలేదు కుటుంబయ్య. వేచిచూస్తున్న నాగులు ఊరుకుంటాయా? ఆభరణాలైనాయి.ఆరాధిస్తున్నాయి. ఓం నమః నాగాభరనాయ. ఇవేమి గమనించడములేదు కుటుంబయ్య.శివయ్య వస్తూనే ఉన్నాడు వాటిని ధరించి. ఒకరోజు కుటుంబయ్య శివయ్యతో, ఒక్క నిమిషం ఆలోచించి శివయ్యా మనిద్దరము మంచి స్నేహితులము కదా. ఏదైన నా అంతట నేను నీకుఇస్తే తీసుకో సరేనా... అంటే, నేను నిన్నేమి అడగకూడదన్న మాట,అనగానే, సంతోషముగా నవ్వుతూ అదన్నమాట అన్నాడు కుటుంబయ్య. సరేలే నీ అంతట నీవు సమర్పిస్తాననే దాకా అదగనులే అన్నాడు , కాని నేను నిన్ను చూడకుండా ఉందలేను. వచ్చి-వెళుతుంటాను సరేనా... తలఊపాడు కుటుంబయ్య తప్పదన్నట్లు. " అవకాశాలను ఇస్తూనే ఉన్నాడు శివయ్య. తోసిపుచ్చుతూనే ఉన్నాడు కుటుంబయ్య." కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ. 'తన్మై మనః శివ సంకల్పమస్తు వాచే మమశివపంచాక్షరస్తు మనసే మమ శివభావాత్మ మస్తు". పాహిమాం పరమేశ్వరా. (ఏక బిల్వం శివార్పణం)

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...