Thursday, October 24, 2019

MAAKU SAUKHYAMU PRASAADIMPUMU SIVAA


దీపావళి శుభాకాంక్షలను కొనసాగిస్తు ప్రియ మిత్రులారా,

 సర్వము శివమయము-సమస్తము శివాధీనము అను విషయము నిర్వివాదాంశము.ధూర్జటి భావన ప్రకారము బాలుడు అరటిపండ్లు కావలెననగానే వాత్సల్యలక్ష్మీవిలాసముతో తెచ్చి ఇచ్చినట్లు  ఆ పరమదయార్ద్రహృదయుని అరటిపండ్లమాధుర్యమును అందించు అద్భుతకథలు కావాలని నాచే అడిగించి," నా ప్రయచ్చంతి సౌఖ్యం" మాకు సౌఖ్యమును ప్రసాదింపుము అను పేరు గల అద్భుత కథలనుపవిత్ర కార్తిక మాస కానుకగా అందించినాడు.
సత్యాన్వేషణలో మునిగిన యాజ్ఞవల్క్యమహాముని శిష్యులు,సవినయముగా తమ గురువుగారికి పాదాభివందనమును చేసి,తమ సందేహమును వెలిబుచ్చినారట.గురుదేవా! దేనిని జపించుట వలన అమృతత్త్వము సిధ్ధించును? అని.వారి సత్యాన్వేషణకు సంతసించిన ఆచార్యుడు ఆనందముతో,నాయనలారా! " శతరుద్రీయ పారాయణము" నిస్సందేహముగా అమృతత్త్వప్రదాయిని అని అనుగ్రహించినారట.అపుడు వారు గురుదేవా శతరుద్రీయమును గురించి వివరించమని వేడుకొనగా,

   రుద్రాధ్యాయము వైదికమగు స్తుతి.రుద్రార్చన వేదమంత్రమయము.కృష్ణయజుర్వేదమైన తైత్తరీయ సంహిత నమక-చమక విశిష్టతను ప్రస్తావించినది.11 అనువాకములు గల నమకము నమః అను శబ్దము పలుమార్లు ఆవృత్తమగుటచే ఆ పేరును పొందినది.అదేవిధముగా 11 అనువాకములు గల చమకము చమే అను పదము పలుమార్లు ఆవృత్తమగుటచే ఆ పేరును పొందినది.నమకము ఏ మతమునకు-ఏ దైవమునకు సంబంధించినది కాదు.విశ్వేశ్వరుని విశ్వవ్యాపకత్వమును విశదపరచునది.స్థూలరూపములో నున్న జీవులలోని సూక్ష్మచైతన్యమై ప్రకాశించుచున్న పరమాత్మను ప్రస్తావించునది.ఆ పరమాత్మ తాను మనకువేటిని అనుగ్రహించాలో కోరునది చమకము.నమకము స్వామి వ్యాపకత్వమును విశదీకరిస్తుంటే,చమకము స్వామి అవ్యాజ కరుణను అర్థిస్తున్నది.

  అసలు రుద్రుడు-రుద్రము ఆధార-ఆధేయములు.పరస్పరము అవిభాజ్యములు.విశ్వమే విశ్వేశ్వరుడు-విశ్వేశ్వరుడే -విశ్వము.

  రుద్రస్య ఇతి రుద్రీయం,
  శతరుద్ర దేవత అస్య ఇతి శతరుద్రీయము,

  అనునవి ఆర్య వాక్యములు.స్వామి తాను స్వయముగా ప్రతిజీవికి సాక్షాత్కరిస్తు వారి పాప-పుణ్యముల ఫలితములను వారికి కష్ట-సుఖముల రూపుముగా అందించునపుడు ఒకసారి ఘోరరూపముతో,మరొకసారి అఘోర రూపముతో,అదేవిధముగా ఒక ప్రాంతమున ఘోర రూపముతో,మరొక ప్రాంతమున అఘోర రూపముతో ఆడుకుంటాడు జీవులతో ఆ  నిరాకార-నిర్గుణ -నిరంజనుడు.

 తేజోరూపముగల మహాదేవుడైన రుద్రుడు,శివ-శర్వ-భవ-శంకర-మృడ-పశుపతి ఇలా ఎన్నో-ఎన్నెన్నో పేర్లతో ప్రస్తుతింపబడుతుంటాడు.సహస్రాక్షుడు-సహస్ర రూపుడు.(ఇక్కడ సహస్ర శబ్దమును మనము అనంతత్త్వమునకు అన్వయించుకోవాలి).

  ఎందరో శివస్వరూపులు స్వామి అనుగ్రహముతో రుద్రమునకు భాష్యమును అనుగ్రహించినారు.వారెంతో ధన్యులు.వారికి నా సాదర ప్రణామములు.విస్తారములోని సారమును గ్రహించుటకు చేయుచున్న ఈ ప్రయత్నములోని దోషములను సహృదయులు సంస్కరించగలరని ఆశిస్తూ,

  " శివానుగ్రహము తెలియరానిది."

 పాలున్-బువ్వయు పెట్టెదన్-కుడువరా అని తల్లితండ్రులు ఎంతో ప్రేమగా తమ సంతానమునకు పాలబువ్వ తినిపించబోగా,దానిని గుర్తించలేని బిడ్డడు,వారితో,అరంటి పండ్లు కొనితే లేకుంటే నేనొల్లనన్నాడట.ఇసుమంతయు నొచ్చుకొనక వారు అటులే కానిమ్మన్నారట అదియును వాత్సల్యలక్ష్మీ లీలావచనములతో.ఎంతటి ధన్యుడో ఆ ధూర్జటి మహాకవి.వందనములు.

   ప్రియ మిత్రులారా,

 సర్వము శివమయము-సమస్తము శివాధీనము అను విషయము నిర్వివాదాంశము.ధూర్జటి భావన ప్రకారము బాలుడు అరటిపండ్లు కావలెననగానే వాత్సల్యలక్ష్మీవిలాసముతో తెచ్చి ఇచ్చినట్లు  ఆ పరమదయార్ద్రహృదయుని అరటిపండ్లమాధుర్యమును అందించు అద్భుతకథలు కావాలని నాచే అడిగించి," నా ప్రయచ్చంతి సౌఖ్యం" మాకు సౌఖ్యమును ప్రసాదింపుము అను పేరు గల అద్భుత కథలనుపవిత్ర కార్తిక మాస కానుకగా అందించినాడు.అసలు తత్త్వమును కనుగొనలేని నా అసహాయత అల్లిన  ,రుద్రునితో  నాకు సౌఖ్యము ప్రసాదించుము అను " నః ప్రయచ్చంతి సౌఖ్యం" అను రుద్రతత్త్వమును తెలియచేయు కథలు కావాలన్నాను.దానికి నవ్వుతు నేను నీచేయి పట్టుకొని నీ చేతనే వ్రాయిస్తాను.వచ్చి కూర్చో అంటూ వీనిని వ్రాసి,నవ్వుతు అవి నేనే వ్రాసాననుకోమన్నాడు.వాత్సల్య లక్ష్మీ లీలా వచనములు కదా.మాయతో కప్పివున్న నేను మాయాతీతుని మాటలలోని మర్మమును గ్రహింపజాలక బిల్వపత్రమాలలో, నా అహము వచ్చి కంటకములను చే ర్చు....................తుంటే వాటిని ఆటంకపరచలేక పోయాను.కష్టపెట్టటం నా వంతు-కనికరించటం నీ వంతు రుద్రా! అన్నాను.కాలకూట మయమయిన కంఠములో నీ కంటక బిల్వమాలను ధరించేందుకు కనికరించాడు.కాని శివస్వరూపులారా చంద్రుడు కృత్తికానక్షత్రనివాసము చేయు ఈ పవిత్ర కార్తిక మాసమునందు పంచభూతములు సమతుల్యతను పాటిస్తు పరమేశ్వరారాధనకు సహాయపడుతుంటాయి.కపర్ది కరుణతో స్నానమో-జపమో-తపమో-దీపమో-దానమో,బిల్వార్చనయో యథాశక్తి చేయుచు ఈశ్వరానుగ్రహ పాత్రులమవుదాము.సర్వము శివమయము-సమస్తము శివాధీనము  " మా రేడు నీవని నీ సేవగా మనము సమర్పించదలచిన ఈ మారేడు పత్రముల మాలలోని దోషములను తొలగించి,దీనిని ప్రదోషమాలగా సమర్పించుటకు సహకరించండి.సదా సవినయ నమస్కారములతో మీ సోదరి,నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

 పాహిమాం హరహర మహాదేవ శంభో శంకర పాహి-పాహి.

  సర్వేజనా సుఖినో భవంతు-సమస్త సమ్మంగళాని భవంతు-స్వస్తి.

  స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.


   ( ఏక బిల్వం శివార్పణం)

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...