మీడుష్టమ శివతమ-06
*********************
' ఒకపరి జగముల వెలుపల "ఒకసారి ప్రత్యక్షము అవుతాడు.అంతలోనే అంతర్ధానమవుతాదు.చిత్రవిచిత్రములతో నన్ను చిత్తుగా మోసము చేసాడు.కనపడనీకడిగేస్తా ననుకొన్నాడు సాధకుడు.స్వామికి కావలిసినది కూడా అదేగా అదేనండి అభిషేకములు.క్షణములో ఎదురుపడ్డాడు.
ఊరకపోనీయడు కదా సాధకుని వాని సాధనను.ఊసుబోక అడుగుతున్నా అంతా సుభిక్షమే కదా అన్నాడు .ఊహించినదే జరిగింది.
ఉడుకుమోత్తనముతో చాల్లే సంబడం.అక్షుతుశ్చమ్మే అని అడిగాని.న క్షుత్తు చ మే నాకు ఆకలి లేకుండా ఉండాలి అని అడిగాను.అనుగ్రహించానన్నావు.ఆనందించాను.కాని,
కాని ఎక్కడిపోయింది ఆకలి.నా పక్కనే పొంచిఉండి,అదును చూసుకొని నాపై దాడిచేస్తున్నది.
ఇక నేను నిన్ను అడిగిందేమిటి? నువ్వు నాకు ఇచ్చిందేమిటి?ఏమి తెలియనట్లు అంతా సుభిక్షమేనా అంటూ కొంటె ప్రశ్నలు.
నువ్వే నాతో అన్నవు కదా ఒకటి వస్తే మరొకటి వెళ్ళిపోతుందని.ధాన్యరాశులను అనుగ్రహిస్తే దారి మళ్ళుతుందని ఆకలి.అందుకేగా,
నేను నీకు అందరిచేత ఇష్టముగా స్వీకరింపబడెడి వడ్లను ఇచ్చాను నువ్వు "వ్రీహాశ్చమే" అనగానే.ఆ ఆల్పోచనలు అంతటితో ఆగిపోకూదదని ,ఆలోచనలుగానే మిగిలిపోకూడదని వీటిలో ఆధ్యాత్మికతను కలిపాను.ఏదో నువ్వు "యవాశ్చమే" అన్నావని.ఆధ్యాత్మికతతో కలిపిన ఆలోచనలను నీ జీవనవిధానము వైపు మళ్ళించాను మాషాశ్చమే అన్నవని.
నేను అంతటితో ఆగలేదు.మళ్ళించిన దానిని నీవు గుర్తించగలుగుతావో/లేదోనని వాటికి తోడుగా స్నేహమును పెంచే తిలలను కలిపాను.వాటి స్నేహ సౌశీల్యములు నిన్ను సంతోషపరచుటకు అవి చెదిరిపోకుందా-నిన్ను విడిచి పోకుండా వాటిని ఒక్కటిగా కలిపి ఉంచే శనగలను ఇచ్చానూన్నాడు రుద్రుడు నొచ్చుకుంటున్నట్లుగా.
అబ్బురమే ఇది.ధాన్యమును-ధ్యానమును సమగ్రముగా .ఎంతటి చమత్కారివి.అవగతమైనది నీ అద్భుత లీల.
ఆనందముతో అవధరిస్తాను-అనుసరిస్తాను.మరి అది అరికట్టుతుందా నా ఆకలిని ఇంతలోనే సందేహము ఆ దేహికి.
అందుకేగా లౌకికదృష్టి అనే ఆకలిని కంపింపచేసి-పెకలించివేసే పెద్దశక్తిని గోధుమ అని ముద్దుగాపిలుస్తూ నీకు ఇచ్చాను.అది నీలోచిగురించి-పిందెగా మారి-కాయగా పెరిగి ఉన్న ఆద్యాత్మికతను పండుగా మార్చేందుకు మసురాశ్చమే అన్నావని వాటినికూడ కొసరి కొసరి అందించాను అనగానే ఆనందముతో సాధకుడు నామరూపములను నమ్ముకుంటే నట్టేట మునకలే కనుక తత్త్వమనే నావ తారణము అనుకుంటూ తన్మయుడై ఉన్నవేళ
కథలన్నీ కదిలేవే-కదిలించేది కరుణే.
అణువణువు శివమే-అడుగడుగు శివమే.
సర్వం శివమయం జగము.
ఏక బిల్వం శివార్పణం.