"రుజం ద్రావయతీ రుద్రః" ఆర్యోక్తి.జన్మ జర మృత్యు దుఃఖములను నశింపచేసేవాడు రుద్రుడు.పంచకృత్యములలో మూడవదైన సంహార కార్యమును జరిపే రుద్రుడు పరమాత్మ యొక్క శక్తియే తక్క అన్యము కాదు.
వపుషో-అని పరమాత్మను ప్రస్తుతిస్తున్నది ఆదిత్యహృదయ స్తోత్రము.మన భాషలో చెప్పలంటే నిరాకార-నిర్గుణ-నిరంజన పరమాత్మ మనము పరమాత్మ శక్తిని అర్థము చేసుకొనుటకు తనకు తానుగా సాకారమును ధరించి తన స్వరూప-స్వభావములను మరింత స్పష్టము చేయుట.
నాల్గవ కృత్యమైన తిరోధానము గురించి ఒక్క సారి పరిశీలిస్తే ఇదే విషయమును మనము గ్రహించనీయకుండే మాయచే మనలను కప్పుచున్నది పరమాత్మయే-తిరిగి దానిని తొలగించి అనుగ్రహిస్తున్నదీ పరమాత్మయే.
వపు శబ్దమును విష్ణుసహస్రనామ స్తోత్రము మరింత స్పష్టపరుస్తున్నది.
విశ్వం-విష్ణుః అంటూ మనము కనులారా చూచుచున్న విశ్వములో ఉన్న విశ్వాత్మకుడే పరమాత్మ.తాను విశ్వ వపునిగా మనకు కనబడుతున్నాడు.
శ్రీ లలితా రహస్య సహస్రనామము సైతము పరాశక్తిని,
సంహారిణీ రుద్ర రూపా గా ప్రస్తుతించినది.
సంహారము తమోగుణ ప్రధాన కృత్యము.దానిని జరుపువాడు రుద్రుడు.ఇంకను తల్లి,
విధాత్రీ-విశ్వజననిగాను,
శ్రీకంఠార్థశరీరిణిగాను
విశ్వతోముఖిగాను
లీలా విగ్రహధారిణిగాను కీర్తింపబడుచున్నది.
ఆదిత్య మండలాంతః స్పురత్ అరుణ వపుః-అంటుంది అప్పయ్యదీక్షితుని ఆదిత్యస్తోత్ర రత్నము.
మందలమునుండి స్వామి తన అరుణకాంతులతో దర్శనమిస్తూ మన ఆలనా-పాలన చేస్తున్నాడు.