Thursday, October 13, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-09(SIVAANAMDALAHARI)


 శ్లో : గభీరే కాసారే విశతి విజనే ఘోర-విపినే

విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడ-మతిః

సమర్ప్యైకం చేతః-సరసిజం ఉమా నాథ భవతే

సుఖేన-అవస్థాతుం జన ఇహ న జానాతి కిమ్-అహో


 జడానాం భ్రమసి-అన్యపూజానాం అంటూ భ్రమ యొక్క ప్రభావమును మరింత సుస్పష్టము చేయుచు పుష్పసమర్పనము నందు జడత్వముతో నిండిన భ్రమ ఏ విధముగా తనలో దాగిన చైతన్యమును గుర్తించలేదో,హృత్పద్మమును సమర్పించలేదో,-అవస్థాతుం జన ఇహ న జానాతి కిమ్-అహో

 శంకరా! పుష్ప సమర్పణముతో లభించే అవ్యక్తానందానుభూతిని తెలుసుకోలేరు.

ఏకం చేతః సరసిజం అన్న విషయమును తెలియచేస్తున్నారు.

 అంతర్ముఖత్వమునకు-బహిర్ముఖత్వమునకు సారూప్యమును తెలియచేస్తున్నారు.

 ఒకేఒక పుష్పమును సేకరించుటలో కలుగు అవరోధములను తెలియచేస్తున్నారు.

 అందులకు కింది కాసారము,విపినము,శైలము అను మూడింటిని ఉదాహరనముగా తీసుకున్నారు.


 ఒకటి భ్రాంతి పుష్పము- సేకరణము- సమర్పణము-దుఃఖమయము.

 రెండవది ఆత్మపుష్పము- సేకరణము-సమర్పణము సుఖమయము.

 బాహ్యము అనిత్యము-ఆంతరంగికము-నిత్యము.

 బాహ్యములో లోని లోతైన సరసు సంసారము.ఈదలేనంత లోతైనది కనుకనే సాగరమనై అంటారు.దానిలోని పుష్పము పరిమళరహితము.

హృదయమనే సరసులోని పుష్పము భావనాభరితము.

 స్వామి మనము పత్రం-పుష్పం-ఫలం-తోయం అంటూ ఏది సమర్పించినను స్వీకరించునది భావన మాత్రమే.

 మనఃపుండరీకము సమర్పించుటలో భవనయే గదా ఉన్నది.పైగా అతి వసివాదనిది.పంచేంద్రియ సమర్పిత పరిమళభరితము.

 పుష్పార్థం-అంటున్నారు సంకరులు.

 లోతైన సరస్సులలో దిగుతున్నారు.

 విజన విపినే-జనసంచారములేని అడవిలో వెతుకుతున్నారు.ఎవరా జనులు,సత్వగుణశోభిత తలపులు సంచరించలేని చిమ్మచీకటితో నిండిన అడవి.తమస్సుతో నిండిన మనసులో జ్ఞాన పుష్పము లభిస్తుందా?

 అంతటితో ఆగక మూడవ ప్రయత్నముగా విశాలమైన పర్వత సానువులలో సంచరిస్తూ,

ఎంతటి చక్కని ఉపమానము

 సాధకా స్థూలదృష్టితో పాటుగా సూక్షమముగా నీలోని నీవారశూక పరిమానములో దాగి నిన్ను జాగృతపరుస్తున్న చైతన్యమునకు,నీ హృదయమనే మడుగులో వికసిస్తున్న నిస్తులభక్తి పద్మమును సమర్పించు అని చెబుతున్నారు.

 సర్వం పార్వతీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.

NA RUDRO RUDRAMARCHAYAET-08( SIVAANAMDALAHARI)

 : యథా బుద్ధిః-శుక్తౌ రజతం ఇతి కాచాశ్మని మణి:-

జలే పైష్టే క్శీరం భవతి మృగ-తృష్ణాసు సలిలమ్

తథా దేవ-భ్రాంత్యా భజతి భవద్-అన్యం జడ జనో

మహా-దేవేశం త్వాం మనసి చ న మత్వా పశు-పతే


 ప్రస్తుత శ్లోకములో భ్రాంతి యొక్క ప్రభావము చైతన్యము గుర్తించనీయదో తెలియచేస్తున్నారు.

 అన్యం భజతి-భవత్-జడజనో

 స్వస్వరూపమును గమనించనీయని భ్రాంతిచే కప్పబడి,చైతన్యమును గుర్తించలేని జడత్వము,

'దేశకాల అపరిచ్ఛిన్నమైన,నీ అవిఛ్చిన్నతను గుర్తించలేక,అన్యములను అనన్యముగా భావిస్తుంది.కీర్తిస్తుంది.

 జడత్వంజనమం భజతి అన్యం త్వం భ్రమసి.

 

 ఏవిధముగా,

వారి బుధ్ధి విచక్షణను కోల్పోయి సత్యముకానిదానను-అసత్యముగాను,నిత్యము కానిదానిని నిత్యముగాను తలపింపచేస్తుందో చైతన్యమును గమనించనీయదో,

 నాలుగు ఉదాహరణములతో వివరించుచున్నారు.

 ముత్యపుచిప్పపొడిని వెండిగాను,గాజుపెంకును వజ్రముగాను,పిండికలిపిన నీటిని క్షీరముగాను,మృగతృష్ణను జలాశముగాను భ్రమింతురో,అదేవిధముగా నీ అనుగ్రహప్రకటనమును గుర్తించలేని వారికి సద్బుద్ధిని ప్రసాదించమని ప్రార్ధించుచున్నారు.

  సర్వం పార్వతీపరమేశ్వర చరణారవిందార్పణమస్తు.



NA RUDRO RUDRAMARCHAYAET-07(SIVAANAMDALAHARI)

 : మన స్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ

కర శ్చాభ్యర్చయాం శృతి రపి కథాకర్ణన విధౌ

తవధ్యానే బుద్ధి ర్నయన యుగళం మూర్తివిభవే

పరగ్రంథాన్ కై ర్వా పరమశివ జానే పరమతః 


 "ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్యచ పునఃపునః

 ఇదమేకంతు-ఎన్నిసార్లు సర్వశాస్త్ర రహస్యములను సంగ్రహించి సాధనచేసినప్పటికిని,అవి

 నిష్పన్నం ధ్యేయో నారాయణః సదా

 అవి నీ అనుగ్రహములే అని తెలియని నాడు,వానిలో నిక్షిప్తముగా నున్న నీ చైతన్యమును గుర్తించలేనినాడు ,అవి నిష్ప్రయోజనములే సుమా అని చెప్పిన శంకరులు,ప్రస్తుత శ్లోకములో ఇంద్రియ ప్రవృత్తిని నిగ్రహించుటకు సామాన్యులకు కష్టమైనది కనుక అవే ఇంద్రియములు వాటి పనులద్వారా పరమాత్మ తత్త్వమును పరికించగలుగు పథము వైపు పయనించనీయమని నవవిధభక్తులను చెప్పుచున్నారు. 

 


 మానస-వాచక-ఆంగిక త్రికరనములు సాక్షిగా ఆత్మార్పనము చేయు విధానమును సులభమార్గమును బోధిస్తున్నారు.

 హే శంభో! నా మనస్సు అనవరతము నీ అనుగ్రహమను మధువును గ్రొలుటకు నీ పాదాబ్జముల చెంత నిలువనీ-మానసికము.

  హేశంకరా! నా వాక్కు నీ దివ్యచరితములను సంకీర్తించుటయందు,నా కర్ణములు నీ అనుగ్రహభాషనములు వినుచు తరింపనీయుము.

  హే పరాత్పరా! నా కరములు నీ సేవనమునందు,నా నేత్రములు నీ దర్శనమునందు,నా పాదములు నీ ప్రదక్షిణమునంది సాఫల్యతనొందనిమ్ము.

 నా ఇంద్రియములు నీ ఉనికిని గ్రహించిన తరుణమున,

 అతః పరం-అంతకు మించిన దానిని నాకు ఏ గ్రంధము అందియ్యగలదు.

 పరమేశా! నా పంచేంద్రియ జ్ఞానము పంచభూతేశ్వరా నీ పదసేవనమునందు తరియించనీ.

 సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.


NA RUDRO RUDRAMARCHAYAET-06(SIVAANAMDALAHARI)

  

 ఘటోవా మృత్పిండోప్యణురపిచ ధూమోగ్నిరచలః

 పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం

 వృధా కంఠక్షోభం వహసి తరసి తర్కవచసా

 పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః


 శ్రీ జగద్గురువులు ఐదవశ్లోకములో స్వస్వరూపమును తెలియచయలేని ,కేవలము రాజాశ్రితములగు అనేకానేకళలను ప్రస్తావిస్తూ,ప్రస్తుత శ్లోకములో తర్కశాస్త్రమునాధారము చసుకొని ,ప్రత్యక్షప్రమాణమనియు,అనుభవప్రమాణమనుచు వాదించుకొనుచు,ఏదో సాధించామనుకొని ఆనందపడుట ఎంతటి అమాయకత్వమో ఎందుకంటే ఆ వాదనలు రాబోవుచున్న ఘోరశమనమును /మృత్యుకోరలను ఆపివేసి ముక్తిని ప్రసాదించలేనివి కదా.

ఓ శంకరా!

ముగ్గురు తర్కవేత్తలు ఒకే వస్తువును చూపుతూ మూడు విధములుగా ప్రకటించినారు.

 మొదటి వారు దానిని కుండ అని సంబోధించగానే,

 రెండవ వారు అది కుండ కాదు,మట్టిముద్ద అని నిర్వచించారు.

 మూడవవారు తాను సంఖ్యాశాస్త్ర ప్రకారము చెబుతానని నేకానేక మట్టి అణువుల సమూహము అని చెప్పి మహదానందమును పొందిన భ్రాంతిలోనున్నారు.(ప్రత్యక్ష ప్రమానము) 

  మరికొందరు పట-వస్త్రమును చూపితూ దాని పేక-బడుగులు సంఖ్యలు చెబుతుంటే అది వృధాకంఠశోషకదా.

 మరికొందరు తాము చూసిన అనుభవించిన దానిని ప్రమాణము చేసి,కొంద మీద నుండి పొగ వ్యాపించుచున్నది కనుక నిప్పు కొండవెనుక జ్వలించుచున్నదనిన,మరికొందరు కాదు కాదు నిప్పు ప్రజ్జ్వలించుటకు ముండు సూచనగా పొగను వ్యాపింపచేసినదని వాదించుకొందురు.

 ఈ ప్రమాణములు ఒక పదార్థము యొక్క అనేకానేక అవస్థలను కనుక నిజముగా తెలియచేయగలిగితే,వాటిలో వాటికి మూలమైన నిన్ను దర్శింపచేయు శక్తిని ప్రసాదించునవి.నీ పాదపద్మభజనమునకు నీ మనస్సును మరలించును కదా అని ఇంద్రియ సదుపయోగమునకు సూచనచేయుచున్నారు.

 తరసా-వెంటనే

 పరమసౌభ్యం వ్రజ-పరమానందమును పొందుదుము.

 సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. 



TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...