Thursday, October 13, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-07(SIVAANAMDALAHARI)

 : మన స్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ

కర శ్చాభ్యర్చయాం శృతి రపి కథాకర్ణన విధౌ

తవధ్యానే బుద్ధి ర్నయన యుగళం మూర్తివిభవే

పరగ్రంథాన్ కై ర్వా పరమశివ జానే పరమతః 


 "ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్యచ పునఃపునః

 ఇదమేకంతు-ఎన్నిసార్లు సర్వశాస్త్ర రహస్యములను సంగ్రహించి సాధనచేసినప్పటికిని,అవి

 నిష్పన్నం ధ్యేయో నారాయణః సదా

 అవి నీ అనుగ్రహములే అని తెలియని నాడు,వానిలో నిక్షిప్తముగా నున్న నీ చైతన్యమును గుర్తించలేనినాడు ,అవి నిష్ప్రయోజనములే సుమా అని చెప్పిన శంకరులు,ప్రస్తుత శ్లోకములో ఇంద్రియ ప్రవృత్తిని నిగ్రహించుటకు సామాన్యులకు కష్టమైనది కనుక అవే ఇంద్రియములు వాటి పనులద్వారా పరమాత్మ తత్త్వమును పరికించగలుగు పథము వైపు పయనించనీయమని నవవిధభక్తులను చెప్పుచున్నారు. 

 


 మానస-వాచక-ఆంగిక త్రికరనములు సాక్షిగా ఆత్మార్పనము చేయు విధానమును సులభమార్గమును బోధిస్తున్నారు.

 హే శంభో! నా మనస్సు అనవరతము నీ అనుగ్రహమను మధువును గ్రొలుటకు నీ పాదాబ్జముల చెంత నిలువనీ-మానసికము.

  హేశంకరా! నా వాక్కు నీ దివ్యచరితములను సంకీర్తించుటయందు,నా కర్ణములు నీ అనుగ్రహభాషనములు వినుచు తరింపనీయుము.

  హే పరాత్పరా! నా కరములు నీ సేవనమునందు,నా నేత్రములు నీ దర్శనమునందు,నా పాదములు నీ ప్రదక్షిణమునంది సాఫల్యతనొందనిమ్ము.

 నా ఇంద్రియములు నీ ఉనికిని గ్రహించిన తరుణమున,

 అతః పరం-అంతకు మించిన దానిని నాకు ఏ గ్రంధము అందియ్యగలదు.

 పరమేశా! నా పంచేంద్రియ జ్ఞానము పంచభూతేశ్వరా నీ పదసేవనమునందు తరియించనీ.

 సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...