Thursday, December 30, 2021

PASURAMU-15

తిరు చిట్రంబలం-పాశురం-15 ************************* తిరువెంబావాయ్-15 *************** ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్ శీరోరుకాల్ వాయోంవాళ్ శిత్తం కళికూర నీరొర్కాల్ ఓవా నెడందారై కణ్ పణిప్పన్ పారోర్కాల్ వందనయాల్ విణ్ణోరై తాం పణియాన్ పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు ఆరోరువార్ ఇవ్వణం ఆట్కోళం విత్తకర్తాళ్ వారురువ పూణ్మలైయార్ వాయార్ ఆనాంపాడి ఏరురురువం పూం పునల్ పాయింద్ ఆడేలో రెంబావాయ్ ...... ' పరా భక్త్యా యత్ ప్రాప్య న కించిత్ వాంఛతి- న శోచతి ఆత్మారామోభవతి ************ అంతః బహిః యత్ సర్వం వ్యాప్త పతిం విశ్వస్య ఆత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం. ................................................ తిరుమాణిక్యవాచగరు మనకు ఇప్పటివరకు అందించిన 13 పాశురములలో మనకు అగుపించిన పాత్రలు,పరిస్థితులు-పరిసరములు మానవ శరీర వివిధ అవస్థలను మనలను మనము ఉధ్ధరించుటకు సహాయపడుటకు ు సహకారములుగా నున్న బాహ్య సంకేతములు. కాదారై కుడై యాడ అంటూ కుండలముల ప్రసక్తితో ప్రారంభించిన పాశురములో ఆట-పాట ,పట్టు-విడుపులను చెబుతూ,ఒకదానిని పట్తుకొనవలె నంటేఏ విధముగా వేరొకదానిని విడువ వలెనో సూచించారు. ఆ విషయమునే మరికొంత ప్రస్తావిస్తూ, ప్రస్తుత పాశురములోనిచెలి ఆత్మానంద స్థితిని పొందుటకై, " తనలోని తనను గుర్తించుటకై" ఆత్మాశ్రయణ భక్తిని/పరా భక్తిని ఏ విధముగా ఆశ్రయించినదో,దానిని పట్టుకొనుటకు/అంతర్ముఖమగుటకు బహిర్ముఖత్వమును ఏ విధముగా విడిచి పెట్టినదో మనకు వివరించుచున్నారు. ఆత్మభవునీశ్వరునేశరణంబు వేడెదన్. సిత్తం కళి-మనసు ఆనందముతో ఉప్పొంగగా పాయింద్-మునిగి ఆడేలో-ఆడుదాము అని చెలులను పిలుస్తున్నారు. సిత్తము లో అనందమునకు కారణము ప్రస్తుత పాశురములో వీరు దూకి ఆడదలుచుకొన్న పొయిగై బాహ్యములో లేదు.అది వారి అంతరంగమున నిండినది. ఆ మడుగులోనికి జలము ఏ విధముగా నిండియున్నదంటే. నెడందారై కణ్ పణిప్పన్-మనసులో నిండిన ఆర్ద్రత పొంగిపొరలి నయనములకు చేరి ఆనందాశ్రువులను అనవరతము వర్షించుచున్నవి. ఆ అంతరంగ కొలనులోనికి పాయిందేలో-మునిగిన వెంటనే, " యజ్ఞాత్వా మత్తో భవతి-స్తబ్దో భవతి ఆత్మారామో భవతి.' ఆ పొయిగై లోనికి దూకి /బాహ్యమును వీడి అంతరంగములోనికి జారిన వెంటనే జీవుడు మత్తులో మునుగుతాడు.స్తబ్దుడుగా మారతాడు.తనను తాను కనుగొనే ప్రయత్నములో తన ఉనికిని మరిచిపోతాడు . ప్రస్తుత పాశురములోని చెలి, పారోరుగాల్ వందనయాల్-అని అంటున్నారు. ఆమె భూమికి నమస్కరించుట మరచినది.అంతే కాదు విణ్ణోరం తాం పణియాల్ ఆకాశమునకు-సురులకు నమస్కరించుటయును మరచినది. ఈ వాక్యము మనకు చెప్పుచున్న విషయము ఏమిటంటే ఆమె బాహ్యమును గుర్తించుటలేదు.కాని అదే సమయములో ప్రక్షిప్తముగా నున్న పంచభూతములు నిక్షిప్తమిలైనవి.ఆమె అంతర్నేత్రము వానిని దర్శించుచునే,గౌరవించుచునే యున్నది. ఇంకొక విచిత్రమేమిటంటే పంచభూతములే కాదు ఆమె పంచేంద్రియ శక్తులు సైతము అంతర్ముఖములైనవి. అ శక్తులే ఆమె కేరింతలు కొడుతున్న అంతరంగ మడుగులోని పద్మములు.కనుకనే ఆమె కన్ను, పేర రయ-ఒకే ఒక పెద్ద దేవుని, ఏరురువర్-దివ్యమంగళ విగ్రహమును చూడకలుగుతున్నది. ఆమె వాక్కు ఓరురుకాల్-ప్రతి క్షణము ఎం పెరుమాన్/నం పెరుమాన్ అని వాయ్ ఓవాల్-నోరార పలవరిస్తున్నది/జపిస్తున్నది. అదికాదా మానస సరో వరములో ఝంకారమును/ప్రణవమును జపించుచున్న తుమ్మెదలు. ఆమె మనసు ఆరొరువర్-నిర్ద్వంద్వమైన నామమును వినుచు తరించుచున్నది ఆమె, ఆ అంతరంగ హ్రదములో విత్తగళ్ తాళ్ విశ్వేశ్వరుని పాద సందర్శనముతో/సంసేవనముతో ,ఆత్మానందములో మునకలు వేయుచున్నది.చెలులారా కదిలిరండి.మనలోని మనను దర్శించి తరించుదాము. అంబే శివే తిరువడిగళే శరణం

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...