చిదానంద రూపా-కన్నప్ప నాయనారు
*******************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
ఎనలేని భక్తిని చాతగ అర్జునుడు ఎరుకలవానిగ పుట్టెగ
ఎలమిని తిన్నడుగ శ్రీ కాళహస్తీశ్వరుని పాదము పట్టగ
బోయ దంపతులు నాగడు-దత్త యోగఫలముగ
నాయము తప్పని వేటగాడు ఆ తిన్నడుగ
నందివాహనుని కరుణను డెందము భక్తిమరందమాయెగ
పొందగ దండిగ చిందిన రక్తపు కన్నుల కరుణను
తన కన్నులను మందుగ సామికి అందించెనుగ
తిన్నడు కన్నప్పగ మారగ కళ్ళను ఇచ్చుట కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.