తలకట్టు తమాషా
************
మొదటి అచ్చు అ స్వతంత్రమైనది కనుక పదనిర్మానములో ముందు తానుండి అర్థవంతమైన పదమవుతుంది.ఉదాహరనకు,
అల,అలక,అణ,అబల,అరనం,అక్షరం,అథరం,అసహనం,అందలం......
అ అచ్చు తనరూపమును పూర్తిగా మార్చివేసుకుని,తలకట్టు అను పేరుతో టిచ్క్ గుర్తుగా మారి హల్లు జతకడుతుంది.హల్లు సైతము అచ్చును మెచ్చుకుని తన నెత్తిమీద కూర్చోపెట్టుకుంటుంది.అందుకు అనుగుణముగా తనమీద నున్న హలంతరూపమును తొలగించుకొను కొత్తరూపు దిద్దుకుంటుంది.
ఉదాహరణమునకు-నడక,పడవ,గగనం,పగడం,కదవ ....
కాని కొన్ని హల్లులు తమరూపును కొంచము మార్చుకుంటాయి గాని తలకట్టును మాత్రం స్వీకరింపవు.అయినప్పటికిని అచ్చు అ హల్లునకు సంపూర్ణత్వము ఇస్తూనే ఉంటుంది తాను అదృశ్యముగా ఉండి.
ఖ,ల,బ,జ,ఱ .....
ఇక్కడ కొన్ని పదములను మనము పరిశీలిద్దాము.
వల,తల,కల, మఖ,గజం....
వీనిలోని మొదటి అక్షరమూకు తలకట్టు కనబడుతోంది కాని రెండవ అక్షరమునకు లేదు.
లత,బకం,ఖగం,జగం,జత...
ఈ పదములలో మొదటి అక్షరము తలకట్టు కనపడకుండా-రెండవ అక్షరము తలకట్టుతో అ అను అచ్చును తమతో కలుపుకుని ఉన్నాయి.