శ్లోకము
చంద్రాం ప్రభాసా జ్వలంతీ శ్రియంలోకే దేవజుష్టాముదారాం
తాం పద్మినీం శరణం అహంప్రపద్యే అలక్ష్మీం నశ్యతాం త్వాం వృణే.
-ఓ జాతవేద అంటు,
లక్ష్మీ దేవి అనుగ్రహమునకై అగ్ని సహాయమును అర్థించుచున్న సాధకుడు,
1.మొదటి శ్లోకములో "మ ఆవహ" అంటూ అహ్వానించమని కోరాడు.
అహ్వానమును మన్నించి వచ్చుటయే కాదు,
2."అనపగామినీం' అంటూ రెండవ శ్లోకములో వచ్చిన తరువాత తనను వీడక శాశ్వతముగా ఉండునట్లు చేయుము.
అంతేకాదు,ఓజాతవేద
3"అశ్వపూర్వాం రథమధ్యాం" అంటూ ఆమె తన దగ్గరకు వచ్చు సన్నివేశమును,తన ఇంద్రియములనే ఆశ్వములను సరైన మార్గములోఉంచుతూ,తన గుణ్డెచప్పుడు చేయు ప్రణవనాదము అనుసరించుచుండగా హ్రిదయరథ మధ్యమున ఆసీనమై తల్లి రావలెనన్న దర్శనాభిలాషను కోరాడు.
4.నాల్గవ శ్లోకములో,
కాం అనిర్వచనీయమైన ఆ పరశక్తి నాకు అత్యమ్య విడదీయరాని సాన్నిహిత్యములో "ఉపహ్వయే" నా శ్వసగా మారిపోయి ఉండేలా చేయమని ప్రార్థిస్తున్నాడు.
ప్రస్తుత శ్లోకములో శరణాగతి,ప్రపద్యే శరణమహం" అంటూ,
బాహ్య-అంతర్ శుచికి సానుకూలతను కలిగించునట్లు తల్లి అనుగ్రహమును కోరుతున్నాడు.
ప్రస్తుత శ్లోకములో 'అలక్ష్మి"ని ప్రస్తావించినాడు.ఈమె లక్ష్మీదేవికన్నా ముందు ఉన్నది మానసిక ఆటంకములకు-బాహ్య అడ్డంకులకు కారణమగుచున్నది కనుక,
శ్రియం లోకే-ఆ అలక్స్మిని నశింపచేయుము.
షడూర్ములను అల్స్క్మిగా భావిస్తుంది సనాతనము.ఆరు బాధలు.అవి
1 ఆకలి-దప్పికలు
2;శోక-మనోవ్యథలు
3.జరా-మృత్యువులు.
వీటి చింతననశించిన నాడే శ్రియము ప్రాప్తిస్తుంది.
దానిని తొలగించగల సామర్థ్యము కలది లక్ష్మి+ఈం
మహాలక్ష్మి,
1 తాం ప్రభసా జ్వలంతీ-చైతన్య సక్తిగా ప్రకాశిస్తున్నావు
2.తాం చంద్రాం-చదనమితిచంద్ర.అహ్లాదకారిణిగా అనుగ్రహిస్తున్నావు
3.తాం ఉదారాం-నీవు కరుణించే స్వభావము కలదానివి
4.తాం-పద్మిని+ఈం-నీవు సృష్టి కర్తివి,జ్ఞాన స్వరూపము నీవ్,ఈ ప్రపంచము స్ర్ష్టించి దానికి అతీతముగా ఉండుదానివి
5.తామ్యశసాం-నీవుకీర్తింపబడుదానివి,కీర్తిని భక్తులకు అనుగ్రహించుదానివి
మానవులకు మాత్రమే కాదు,దేవతలకు సైతము.అందుకే తలీ
6.తాం దేవజుషతాం-దేవతలచే పూజింపబడుదానివి
సకలసంపద సంకేతమైన లక్ష్మిదేవి నాబాహ్య-అంతర అమంగళములను నశింపచేసి నన్ను సంస్కరింపుము.నీ పవిత్ర పాదపద్మముల శరణాగతిని అనుగ్రహింపుము.
హిరణ్మయీం లక్ష్మీం శిరసావదామి.