Monday, March 26, 2018

SAUNDARYA LAHARI-59

సందర్య లహరి-58

 పరమపావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 వేదోచ్చరణనుతెలుపు శిక్ష అను శాస్త్రము
 దోషరహిత పద సంస్కారమైనవ్యాకరణము

 గణముల కలయిక మెళకువలు తెలుపు ఛందము
 వేద మంత్ర ఉత్పత్తిని తెలియచేయు నిరుక్తము

 కాల నియమ వివరణ విధానముగా జ్యోతిషము
 యజ్ఞ-యాగ మాచరించ విధానమైన కల్పము

 అమ్మ చుబుకమే తమకు పుట్టినిల్లనుచును
 ఆమ్నాయముల అధ్యయమునకు ఆలంబనమైన వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సందర్య  లహరి.

 ఛందోబద్ధమైన వేదమును ఋక్కులు అనుటచే దానికి సంబంధించినవేదమును"ఋగ్వేదము" అనియు,గద్యాత్మకమైన వేదమును యజస్సు గలది కనుక "యజుర్వేదము" అనియు,గీతాత్మకమైన వేదము సామం కనుక " సామవేదము" అంటారని,పద్య గద్యాత్మకమైన వేదమును "అధర్వణ వేదము" అని అలంకారికులు విశ్వసిస్తారు.వారుఈ విషమును,వేదమును"త్రయి" అనుటకు మూడు వేదములే అన్న వాదనసరికాదని,జ్ఞాన-కర్మ-ఉపాసన అను మూడు సంస్కారములను తెలియచేయునవి వేదములు అని కీర్తిస్తారు.అమ్మ చుబుకము (గడ్డము) నుండి ఆవిర్భవించిన ఆరు వేదాంగములు వేద అర్థమును తెలుసుకొనువారికి సహాయపడుటయే తమ విధిగా భావించి,సహాయమునుచేయుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
 

SAUNDARYA LAHARI-58

 సౌందర్య లహరి-57

 పరమపావనమైన నీ పాదరజ కణము
 పతితపాలకమైన పరమాత్మ స్వరూపము

 ఎడమనేత్ర కాంతిమారె లక్ష్మితత్వముగ
 ఎడతెగక నడిపించె స్థితికార్యపు మాతృకగ

 కుడినేత్ర కాంతిమారె పార్వతితత్వముగ
 విడనాడక కాపాడగ కరుణకు ప్రతిరూపముగ

 మూడవ నేత్ర కాంతిమారె సరస్వతి తత్వముగ
 మూఢత్వము తొలగించగ సారస్వత రూపముగ

 ఉద్ధరింపగ మమ్ములను ముగ్గురమ్మలను అందించిన
 నీ ఊపిరి నాలుగు వేదములైన వెలుగుచున్న వేళ

 నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.


 "విద్" అను ధాతువునకు తెలియుట అను అర్థమును మనము అన్వయించుకుంటే భగవంతునిద్వారా తెలుపబడినవి "వేదములు." వీనిని శృతులు-ఆమ్నాయములు-అపౌరుషేయములు అని కూడా కీర్తిస్తారు.కావలిసిన వాటినిచ్చి,అక్కరలేని వాటిని దగ్గరకు రానీయని శక్తిగలవి వేదములు.వేదము అనగా జ్ఞానము-నిజము అని కూడా అర్థముచేసుకోవచ్చును.వేదరాశి వ్యాసమహర్షిచే, నాలుగుగా క్రమబద్ధీకరించబడినవి.అవి ఋగ్వేదము-యజుర్వేదము-సామవేదము-అధర్వణవేదము. ఆది శంకరులు ప్రశంసించిన ఋగ్వేదము కామితార్థప్రదము.యాగ విధానమును తెలియచేయునది యజుర్వేదము.ఉపనిషత్తులను కలిగి సంగీత ప్రాధాన్యము కలది సామవేదము.మూడు వేద పఠనములలో దొర్లిన తప్పులను సరిచేయ సామర్థ్యము కలది అధర్వణవేదము.దీనిని పఠించే బ్రహ్మలు నిష్ణాతులైయుంటారు.(మహా భారతము పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కినది.) శ్రీమాత ఊపిరులే శ్రీకర వేదములని అవగతమగుచున్న సమయమునచెంతనేనున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక వందనములు.    

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...