Monday, March 28, 2022

TELUGU PALUKU

చేతల చేతులు. ************* లక్ష్మీపురములోని రాముడు అను యువకునిది ఎముకలేనిచేయి.(గొప్ప దాత.)ప్రజలు అతని దానధర్మములగురించి,మంచితనమును చేయెత్తిచాటిరి.(నమస్కారములతో గౌరవించిరి.నలుదిశలా వ్యాపింపచేసిరి.) ఒకనాడు అతనితో రాజు అను పట్నపు యువకుడు చేయి కలిపెను.(స్నేహితుడయ్యెను)రాజు చెల్లెలు లత.లత మంచితనమునకు ముగ్ధుడైన రాముడు లత చేతిని స్వీకరించెను.(వివాహముచేసుకొనెను) కష్టసుఖములలో కలిసి ఉండెదమని చేతిలో చేయివేసుకొనిరి.(ప్రమాణములు చేసుకొనిరి.)వారి జీవితములోనికి భూపాల్ అను వ్యక్తితో పరిచయము పెరిగినది.భూపాల్ వారికి తన చాకచక్యముతో అరచేతిలో వైకుంఠమును (నమ్మపలికెను-మోసపు ప్రవర్తన) చూపించెను.కల్లాకపటము గుర్తించలేని రాముడు అనాలోచితముగా నిర్దోషులపై సైతము ఆగ్రహముతో చేయిచేసుకొనసాగెను.(కొట్టసాగెను)విషయము అర్థమవుతున్నను లత పరిస్థితి చేతకానిదిగా (నిస్సహాయముగా)నుండెను.రాముని తన స్వార్థప్రయోజనములకు పావుగా వాడుకొనిన భూపాల్ రామునకు చేయిచ్చెను.(మోసగించెను) తన తప్పును తెలిసికొనినరాముడు గ్రామస్థులకు చేయూతగా (సహాయముగా) ఉండాలని నిర్ణయించుకొనెను.అందరు సంతోషముతో నోరు తీపిచేసుకొనుటకు చేతిలో మిఠాయిని పట్టుకొని ఉన్న సమయమున చెడును విడిచేయి కుళ్ళు తుడిచేయి నలుగురు మెచ్చే దారిలో నడిచేయి అని .(విజయసంకేతముగా)ముందుకు నడిపిస్తున్నది.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...