Thursday, August 29, 2024

SREESUKTAM 07-UPAITU MAAM



 శ్లోకము
 
 "ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ
  ప్రాతుర్భూతోస్మిన్ రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతుమే"

   ప్రస్తుత శ్లోకములో సాధకుడు జాతవేదుని "ఉపైతుమాం" అనగా
 మాం -నాదగ్గరకు,ఉప-దగ్గరగా,ఇతు-వచ్చియుండునట్లు సహాయము చేయుము అని ప్రార్థించుచున్నాడు.
  అట్లు జరిగినచే నేను బాహ్యమునందును-అంతరంగమందును సంస్కరింపబడి "ప్రాతుర్భూతో"తిరిగి కొత్తజన్మను పొందుతాను,బ్రతికియుండగానే అమ్మ దదాతు మే" నన్ను అనుగ్రహిస్తుంది కనుక.
  ఈ శ్లోకమునందు ప్రదానము చేయువారొకరైతే,దానిని భద్రపరచి అనుగ్రహించువారు వారి పరివారములోని  మరొకరు.
 ఒకరు దేవ-మహాదేవుని సఖుడైన కుబేరుడు.
 సంపదలకు మూలము ఈశ్వరత్వమును కలిగిన మహేశ్వరుడైతే భక్తులకు దానిని భద్రపరచి అందించునది ఈశ్వరవరప్రసాదితుడైన కుబేరుడు.
  సంపదలకు మూలము మహాలక్ష్మి అయితే దానిని మనకు భద్రపరచి అందించు వరమును పొందిన "కీర్తి" అని శక్తి.
  ఈమెను దక్షప్రజాపతి కుమార్తెగాను సతిదేవి అనుంగు సోదరిగాను కీర్తిస్తారు.
 కనుక జాతవేద! దేవసఖుడైన కుబేరుని ఉపైతుని చేయుము.
    చ అనగా మరియును,కుబేరుని ఒక్కనినే కాదు 
  కీర్తిః+చ మాం ఉపైతు. 
     చ మరియును,వీరినిద్దరినే కాదు,
 " మణినా సహ" మణిని కూడా ఉపైతుమాం.నన్ను సమీపించి,నిలిచి ఉండునట్లు సహకరింపుము.
   ఇక్కడ మణి శబ్దమును,
 " రాజరాజేశ్వరీం  లక్ష్మిం వరదాం  మణిమాలినెం
   దేవి దేవప్రియాం కీర్తిం వందే కామ్యార్థ సిద్ధయే" సాక్షాత్తు రాజరాజేశ్వరి అనుగ్రహముగాస్వీకరిస్తే  నా సమీపమునకువచ్చి,నన్ను వీడక నిలిచియుండునట్లు చేయుము ఓ జతవేద.
  తల్లి అనుగ్రహమనే రక్షను మించిన రక్షామణి /కంకణము మరేది లేదుకదా.
   పదార్థమును గమనిస్తే బాహ్య ప్రాపంచిక ఉపాధి అవసరములను సంతృఒతి పరచుటకై కుబేరుని,చింతామణిని నా సమీపమునకు వచ్చి నిలిచియుండినచో నేను కీర్తివంతునిగా ప్రసిద్ధికెక్కుతాను.
  పరమార్థముగా భావిస్తే మహావేవుని అనుగ్రహమును లక్ష్మీదేవి అనుగ్రహమును రాజరాజేశ్వరి మాత అనుగ్రహమును పొందగలుగు స్థితికి నన్ను చేరిస్తే,
 ఓ జాతవేద!
  వారినుండి పొందిన అనుగ్రహముతో నేనూ నా బాహ్య ప్రలోభములను-అంతరంగిక శత్రువులను తరిమివేసి సద్గుణ-సాత్త్విక సంపన్నునిగా తిరిగి మానసికముగా జన్మించి,ధన్యతను పొందుతాను.
    హిరణ్మయీం లక్ష్మీం  సదా భజామి.
 

SREESUKTAM-06-ADITYAVARNAAM


   శ్లోకము


 " ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిః తవ వృక్షోధ బిల్వః

   తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్య అలక్ష్మీః"


   తపఃఫలము బిల్వవృక్షమై ఆదిత్యవర్నముతో ప్రకాశిస్త్యున్నది.లక్ష్మీదేవి తపఫలముగా ఉదయిస్తున్న భానుతేజముతో అనుగ్రహ సంకేతముగా బిల్వవృక్షము లక్ష్మీదేవిచే సృష్టించబడినది.


   ఏవిధముగా సూర్యోదయము చీకట్లను తరిమివేసి అఖండకాంతితో ఉంటుందో అదేవిధముగా లక్ష్మీదేవికరుణకు ప్రతిరూపముగా "బిల్వవృక్షము"భానుతేజముతో విరాజిల్లుతు ప్రకటింపబడినది.

  ఇక్కడ మనము వనస్పతి-బిల్వ వృక్షము గురించి తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము.

   ఇక్కడనుదంతు/ఉదంతు అన్న శబ్దము ప్రయోగించబడినది.తల్లివనలక్ష్మియై పచ్చని వనములను సృష్టించింది.

   లక్ష్మీదేవి వనస్పతి.వనః+పతి-ఋగ్వేద 9వ మడలములో ప్రస్తావించిన ప్రకారము అడవికి అధిపతిగా ఉండే దేవతామూర్తి "వనస్పతి".

  ఇక్కడ లక్ష్మీదేవికి-బిల్వవృక్షమునకు అభేదము సూచింపబడినది.

  చరక సంహిత/సుశ్రిత వృక్షములలో ఉన్నతమైనదానిగా బిల్వవృక్షమును పేర్కొనినవి.

  వేయికొమ్మలతో వసివాడక నిత్యము బంగరు ఛాయతో ప్రకాశించేవృక్షములు "వనస్పతి"

  వామనపురాణకథనము ప్రకారము బిల్వవృక్షము లక్ష్మీదేవి హస్తము నుండి ఉద్భవించిన మహాప్రసాదము.

  త్రిగుణాతీతముగా పుష్పించకుండానే ఫలప్రదమునొసగు వృక్షములను వనస్పతి అను సంప్రదాయము కలదు.

 చీకటి తెరలను తొలగించేది  ఆదిత్యవర్ణము.

 మాయ అవనికను తొలగించేది లక్ష్మీకటాక్షము.

  బాహ్యపు చీకట్లను మాత్రమే కాక అంతరంగ అజ్ఞానమును సైతము తొలగించేది అమ్మ తపఫలమైన బిల్వవృక్షము.

 


 'వామ పత్రే వసేత్ బ్రహ్మ పద్మనాభశ్చ దక్షిణే

  పత్రాగ్రే లోక పాలశ్చ మధ్యపత్రే సదాశివః"


   స్కాంద పురాణ కథనము ప్రకారము 

 మూడు పత్రములు ఒకే కాండమును  ఆశ్రయించి ఉంటాయి.ఆ మూడు పత్రములే,

1.కర్త-కర్మ-క్రియ అనుమూడు విభాగములుగాను

2.సౄష్టి-స్థితి-సంహారము అను మూడు పనులుగాను

3.సత్వ-రజ-తమో గుణవిభాగముగాను

4.స్థూల-సూక్ష్మ-కారణ శరీరములుగాను

5.జాగ్రత్-స్వప్న-సుషుప్తి అవస్థలుగాను

6.భూత-వర్తమాన-భవిష్యత్కాలము గాను నిర్ధారిస్తూ,


  వీటన్నింటికి ఆధారమైన పరబ్రహ్మమును ఆశ్రయించియున్న కాడగా అభివర్ణిస్తారు.

  బిల్వ పత్రము సకలదేవతా సమాహారముగాను

  బిల్వ ఫలమును జ్ఞాన/శ్రీ ఫలముగాను

  బిల్వ వృక్షమును లక్ష్మీస్వరూపముగాను

  బిల్వ వనమును కాశీక్షత్రముగాను 

     అసలిన్ని మాటలెందుకు?

 "  త్రిపుటీ జ్ఞానమే బిల్వపత్రము."

   పువ్వు నుండి కాకుండా జ్ఞానఫలమును సృష్టించగలిగినది

  బిల్వవృక్షము.

  లక్ష్మీదేవి తపః ఫలితముగా ఆవిర్భవించినది(స్కాంద పురాణము)


  తల్లీ నీ పూజ అరిషడ్వర్గములను అంతర్మాయను,షడూర్ములను బాహ్యమాయను తొలగించగలుగు సామర్థ్యమును కలిగినవి.


  హిరణ్మయీం లక్ష్మీం  సదా స్మరామి.




TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...