శ్లోకము
"ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ
ప్రాతుర్భూతోస్మిన్ రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతుమే"
ప్రస్తుత శ్లోకములో సాధకుడు జాతవేదుని "ఉపైతుమాం" అనగా
మాం -నాదగ్గరకు,ఉప-దగ్గరగా,ఇతు-వచ్చియుండునట్లు సహాయము చేయుము అని ప్రార్థించుచున్నాడు.
అట్లు జరిగినచే నేను బాహ్యమునందును-అంతరంగమందును సంస్కరింపబడి "ప్రాతుర్భూతో"తిరిగి కొత్తజన్మను పొందుతాను,బ్రతికియుండగానే అమ్మ దదాతు మే" నన్ను అనుగ్రహిస్తుంది కనుక.
ఈ శ్లోకమునందు ప్రదానము చేయువారొకరైతే,దానిని భద్రపరచి అనుగ్రహించువారు వారి పరివారములోని మరొకరు.
ఒకరు దేవ-మహాదేవుని సఖుడైన కుబేరుడు.
సంపదలకు మూలము ఈశ్వరత్వమును కలిగిన మహేశ్వరుడైతే భక్తులకు దానిని భద్రపరచి అందించునది ఈశ్వరవరప్రసాదితుడైన కుబేరుడు.
సంపదలకు మూలము మహాలక్ష్మి అయితే దానిని మనకు భద్రపరచి అందించు వరమును పొందిన "కీర్తి" అని శక్తి.
ఈమెను దక్షప్రజాపతి కుమార్తెగాను సతిదేవి అనుంగు సోదరిగాను కీర్తిస్తారు.
కనుక జాతవేద! దేవసఖుడైన కుబేరుని ఉపైతుని చేయుము.
చ అనగా మరియును,కుబేరుని ఒక్కనినే కాదు
కీర్తిః+చ మాం ఉపైతు.
చ మరియును,వీరినిద్దరినే కాదు,
" మణినా సహ" మణిని కూడా ఉపైతుమాం.నన్ను సమీపించి,నిలిచి ఉండునట్లు సహకరింపుము.
ఇక్కడ మణి శబ్దమును,
" రాజరాజేశ్వరీం లక్ష్మిం వరదాం మణిమాలినెం
దేవి దేవప్రియాం కీర్తిం వందే కామ్యార్థ సిద్ధయే" సాక్షాత్తు రాజరాజేశ్వరి అనుగ్రహముగాస్వీకరిస్తే నా సమీపమునకువచ్చి,నన్ను వీడక నిలిచియుండునట్లు చేయుము ఓ జతవేద.
తల్లి అనుగ్రహమనే రక్షను మించిన రక్షామణి /కంకణము మరేది లేదుకదా.
పదార్థమును గమనిస్తే బాహ్య ప్రాపంచిక ఉపాధి అవసరములను సంతృఒతి పరచుటకై కుబేరుని,చింతామణిని నా సమీపమునకు వచ్చి నిలిచియుండినచో నేను కీర్తివంతునిగా ప్రసిద్ధికెక్కుతాను.
పరమార్థముగా భావిస్తే మహావేవుని అనుగ్రహమును లక్ష్మీదేవి అనుగ్రహమును రాజరాజేశ్వరి మాత అనుగ్రహమును పొందగలుగు స్థితికి నన్ను చేరిస్తే,
ఓ జాతవేద!
వారినుండి పొందిన అనుగ్రహముతో నేనూ నా బాహ్య ప్రలోభములను-అంతరంగిక శత్రువులను తరిమివేసి సద్గుణ-సాత్త్విక సంపన్నునిగా తిరిగి మానసికముగా జన్మించి,ధన్యతను పొందుతాను.
హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి.
No comments:
Post a Comment