Wednesday, September 7, 2022

YAADEVI SARVABHOOTESHU-02

 


 సర్వాశాపరిపూరక చక్రము-రెండవ ఆవరణము

 **********************************************


  హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం

 సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ ।

 వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం

 త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ॥

   28 ప్రకటయోగినుల అనుగ్రహముతో సాధకుడు రెండవ ఆవరణమైన,ఊహా వృతాకారముతో 16 పద్మములరేకులవంటి ద్వారములున్న "సర్వాశాపరిపూరక చక్రములోనికి" ప్రవేశించబోతున్నాడట.

   పిల్లలు మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు.ఒకరు ప్రారంభము అనగానే వెంటనే మాటలు ప్రారంభిస్తున్నాడు మరొకడు.ఆపమనగానే క్షణమాత్రము ఆలస్యము చేయకుండా ఆపివేస్తున్నాడు.వారినే గమనిస్తున్నా నేను విచిత్రకరమైన అనుభూతికి లోనయినాను.మాట్లాడుటకు పెదవులు అప్రయ్త్నముగా తెరచుకుని,అవసరము తీరినవెంటనే దగ్గరకు వచ్చి ముడుచుకుని పోతున్నాయి.చెవులు ఆ శబ్దమును స్వీకరించి మనకు వినపడేటట్లు చేస్తున్నాయి.అసలు ఈ శబ్దము ఎక్కడి నుండి వస్తున్నది వ్యక్తి నుండా వ్యక్తిలో దాగిన శక్తి నుండా?

   మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।

   చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా 

   ఎక్కడో విన్నట్లు గుర్తు.పరమాత్మ 

 పరమాత్మ బహిరాకాశముగాను/దహరాకాశముగాను విరాజిల్ల్య్తు,శబ్దమును ప్రథమముగా సృష్టించాడని.

  ఈ ఆవరనములోని పదిహేను శక్తులు మనసును విపరీతముగా ఆకర్షించే శక్తి గలవి కనుక గుప్త యోగినులుగా కీర్తింపబడుతున్నవనుకుంటున్నాను.

    ముందు మనము బహిరాకాశము గురించి అందులో జరుగుచున్న మార్పులగురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.

  మనచే తిథులుగా పిలువబడుచున్న పదిహేను ఆకర్షణ శక్తులు షోడశి అను పదహారవ కళనుండి ప్రకటింపబడుతుంటాయి.ఈ కళలు ఒక నియమమును అనుసరించి సూర్యమండలమును వీడిచంద్రుని చేరి పదిహేనురోజుల తరువాత సూర్యమండలమును తిరిగి ప్రవేశిస్తాయి.పౌర్ణమినాడు పదిహేను కళలు చంద్రునిలోనే ఉంటాయి.

 నిశ్చలమైన షోడశికళ తననుండి ప్రకటింపబడుచున్న కళలకు దిశానిర్దేశము చేస్తూ,దివారాత్రములను,పక్షములను పేర కాల విభజనమును చేస్తూ విమర్శ రూపిణి అగుచున్నది.

మూలశక్తిని స్పందింపచేయుటచే కలుగుచున్న ప్రథమ వికసనమే విమర్శగా శాస్త్రకారులు చెబుతారు.

  ప్రతిపత్తు చంద్రుని మొదటికళ.ఆ కళ శుక్లపాడ్యమి నాడు సూర్యమండలమును వీడి చంద్రుని చేరుతుంది.కృష్నపాడ్యమి నాడు తిరిగి సూర్యమండలములోనికి ప్రవేశిస్తుంది.తక్కిన కళలు అదేవిధానముగా కదులుతుంటాయి.రాత్రి జగతికి కావలిసిన మధువును/ఆహారములను స్వీకరించి పగలు మనకు అందిస్తుంటాయి.

   ఈ మార్పులు/చేర్పులు మనము భౌతికముగా చూడగలము.ఎందుకంటే ఇవి బహిరాకాశములో జరుగుచున్న మార్పులు.

  " చంద్రమా మనసో జాతః" అనునది ఆర్యోక్తి.

బహిరాకాశములో ఏ విధముగా చంద్రుడు సూర్యమండలము నుండి వచ్చిన ఒక్కొక్క శక్తిని తనలో కలుపుకొని తిరిగి పంపించివేస్తున్నాడో అదేవిధముగా మన మనసనే చంద్రుడు ఎన్నో భావములను తనతో కలుపుకుంటూ తిరిగి విడిచిపెడుతుంటాడు మన హృదయమే ఆకాశములో.

 బహిరాకాశములోని పదిహేను శక్తులు,వానిని నియంత్రించుచున్న మూలశక్తివలె,మన మనసనే చంద్రుని పరాశక్తి అయిన మూలకళ,కామాకర్షిణి,బుద్ధ్యాకర్షిణి,అహంకారాకర్షిణి,శబ్దాకర్షిణి,స్పర్శాకర్షిణి,రూపాకర్షిణి,రసాకర్షిణి,గంధాకర్షిణి,గంధాకర్షిణి,చిత్తాకర్షిణి,ధైర్యాకర్షిణి,స్మృత్యాకర్షిణి,నామాకర్షిణి,బీజాకర్షిణి,ఆత్మాకర్షిణి,అమృతాకర్షిణి,శరీరాకర్షిణి అను పదిహేను శక్తులు చక్రేశ్వరి అయిన త్రిపురేశి కనుసన్నలలో మెలగుతూ సాధకుని సద్బుద్ధిని ప్రసాదిస్తూ,మూడవ ఆవరనము వైపునకు అడుగులు వేయిస్తున్నారు.

  సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు.


TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...