Friday, April 7, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SINADHIPATAYE-16)

 నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః ।

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 16 ॥

 ప్రస్తుత శ్లోకములో స్వామిని ఉదయస్తమాన కరునిగను,జ్యోతిర్గనములైన నక్షత్ర-గ్రహ-తరలకు అధిపతిగను-దినామునకు అధిపతిగాను సంభావిస్తూ నమస్కరిస్తున్నారు.
 ద్వాదశ మాసములకు అధిపతిగాను-దశేంద్రియములకు తోడుగా బుద్ధి-మనసును నడిపించువానిగను ప్రస్తుతింపబడిన పరమాత్మ ప్రస్తుత శ్లోకములో వేదమయునిగా ప్రస్తుతింపబడుతున్నాడు.
 నమః పూర్వాయ గిరయే-పూర్దిక్కున ఉదయరూపముగా ప్రకటింపబడు పరమాత్మ నమస్కారము.అనునది ఒక భావము.
 గిరులు అను శబ్దమునకు వాక్కులు అని అన్వయించుకుంటే వేదరూపముగా /యజ్ఞమూర్తిగా కర్మలను మానవులచే ప్రారంభింపచేయు పరమాత్మ నమస్కారములు.
 చైతన్యమును కలిగించు చిద్రూపమా నమస్కారములు.
   తూరుపు దిక్కు అనగానే మెలకువ కార్యాచరణము సంకేతముగా సమన్వయపరచుకుంటే వాటి వలన లభించు ఫలితములే పశ్చిమాద్రి.కర్మల వలన లభించే స్థిరమైన జ్ఞానమే పశ్చిమ అద్రి .స్వామి కార్యాచరనమును తెలియచేసి-మనచే నిర్వర్తింపచేసి-దాని ఫలితమునందించుటయే పశ్చిమాద్రిని చేరుకొనుట.
  దాని పర్యవసానమే యోగులు-సాధకులు-ముక్తపురుషులు పరమాత్మను పొందగలుగుట ఇది పౌరాణిక స్పందనము.
 వైజ్ఞానిక స్పందనము ప్రకారము స్వామి తన ఉదయాస్తమానములను మనచే భ్రమింపచేస్తూ,తన తేజస్సును అనేకానేక నక్షత్రములయందు-తారల యందు-గ్రహములయందు -ఉల్కల యందు ప్రవేశింపచేసి అనేకానేక ఖగోళ వాసములకు అధిపతి యైనాడు.
 అంతేకాదు వేదములచే తూర్పుదిక్కున ఉదయించుచున్నట్లు-జరుగుతు జరుగుతు ఉపనిషత్తులచే బ్రహ్మజ్ఞానమునందించుచు సాఫల్యతను అందించినట్లు,పురాణములు,శాస్త్రములు,వేదాంగములు,ఇతిహాసములు అను అనేక సంప్రదాయ సాహిత్యములను అందించి,వారిలోని మేథకు-వాక్కుకు తానే కారనమయి జ్యోతుర్గనములకు అధిపతియే ,అజ్ఞానపు చీకట్లను పారద్రోలి  జ్ఞానభాస్కరునిగా ప్రకాశించు పరమాత్మకు నమస్కారములు.

    తం సూర్యం ప్రణమామ్యహం.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...