Saturday, October 24, 2020

MEEDUSHTAMA SIVATAMA-02

 


    మీడుషటమ శివ-02

   ***********************


   న రుద్రో రుద్ర మర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రునితో సంభాషించలేడు-అర్చించలేడు.


  సాధకుని మాటకు మయశ్చమే అంతే అని అమాయకముగా అడిగాడు ఆదిదేవుడు అమాయకముగా.ఎంత చతురుడవయ్యా చంద్రశేఖరా! శాపగ్రస్థౌడైన చంద్రుని నీ చాతుర్యముతో శిరోభూషనముగా చేసికొనినావు.ఆ అవ్యాజప్రేమ అటుగా వెళుచున్న నాపై కొంచము ప్రసరించినదేమో.నా నోటినుండి వినాలనుకున్న నీ కోరికను నా అదృషముగా స్వీకరిస్తాను.


   నాకు ఇల్లుకావాలి అన్నానుకదా.నీవు సరే అన్నావు.నా ఈ ఉపాధియే ఇల్లు  వస్యశ్చమే అని అడిగాను.  .గూటిలో కూర్చుని ఉన్న నాకు నీ అనుగ్రహముతో ఈ ఉపాధి ఉపయోగమేమిటి? అనే ప్రశ్న ఉదయించింది.ఇదియే నాకు నా ఆధ్యాత్మిక అంచులను చూపించే సాధనము అని అనిపించింది.ఇట్టి విశిష్టగల పరికరమును నేను సమర్థవంతము చేసుకోవాలి కద.అందుకే ఆధ్యాత్మికముగా తృప్తిని కలిగించే భావములను అహారముగా ఇమ్మనమని "ప్రియంచమే" అని అర్థించాను.సంకల్ప వికల్పములు నా మనసును కుదిపివేస్తూ ప్రశాంతతకు అడ్డుపడుతున్నాయి.వాటిని తొలగించి,నా మనో క్షత్రమును చదును చేయుటకు నాగలిని "సీరంచమే" అని అడిగాను.ఆ నాగలి స్థితప్రగ్నతకు ప్రతిరూపమా అన్నట్లుండాలి.


  అంతే కాదు.నేను చ కూద  కూద అంటుంటూనే ఉంటాను.నీ అనుగ్రహిస్తూనే ఉండాలి అన్నాడు సాధకుడు. 


   మందహాసముతో మారసంహారకుడు మరినేను వెళ్ళిరానా అన్నాడు.


   మారాముగా సాధకుడు నాకు శాస్త్రప్రమాణములు స్నేహితులవలె సౌమనస్కులుగా కావాలి అన్నాడు.ప్రస్తుతము వీటిని స్వీకరించి పనిని ప్రారంభించు అన్నాడు పరమేశ్వరుడు.


  అణువణువు శివమే-అడుగడుగుశివమే


       సశేషం


  సర్వం శివమయం జగం.

MEEDUSHTAMA SIVATAMA-01

 


    మీడుస్టమ శివ-వరములను వర్షించు-01

    ***********************************


  శం చ మే-


   మే నాకు చ కుడా కావాలి ఏది కావాలి?


 శం అనగా ఐహిక సుఖము.


   ఐహిక సుఖమును పొందవలెనన్న శరీరమునకు ఆహారము-మనసునకు ఆహ్లాదము కావాలి.

  తలదాచుకొనటానికి ఇల్లుకావాలి.కనుక -వస్యశ్చమే.


     గూటిలోనికి చేరిన తరువాత కూటిపై తాపత్రయము సహజమే కదా-కనక సీరంచమే-వ్యవసాయము చేసుకొనుటకు కావలిసిన నాగలి-ఎద్దులు-ఇతర పరికరములు కావాలి.కనుక సీరంచమే.


   ఆహారముతో పాటు నీరు కూడ కావాలి-అంబశ్చమే.


 మనకు కావలిసిన అన్ని వస్తువులను పండించుకోలేము కదా! కనూ మిగిలినవి కొనుగోలు చేయవలసినదే.కనుక ద్రవిణశ్చమే.


   కూడు-గూడు ఇచ్చావు.మేము వాటిని ఆస్వాదిస్తూ,అనుభవించాలికదా.కూరిమితో వాటిని అనుభవిస్తున్న సమయములో చిన్న చిన్న జలుబు-దగ్గు-జ్వరము వంటి శరీర రుగ్మతలు రావచ్చును.వాటిని దూరముగా నెట్టివేయి-అనామయశ్చమే.


   నువ్వు చిన్నచిన్న వాటిని నెట్టివేస్తున్న సమయములో క్షయ మొదలగు పెద్దపెద్ద వ్యాధులు మమ్ములను సమీపించుటకు సాహసము చేయవచ్చును.వాటిని కూడ మాదరిచేరనీయకు. అయక్ష్మంచమే.


   అయినా అవి మా ప్రారబ్దమును అనుభవింపచేయుటకు మాదరిచేరితే వానిని పారద్రోలే ఔషధములను మాకిమ్ము.-జీవాశ్చమే.


   ఆ కాలుడు కోరలు చాచి మాపై కొక్కెము వేయాలని చూస్తున్నాడేమో? వానిని గద్దించి అపమృత్యుభయమును తొలగించుము-దీర్ఘాయుశ్చమే.


   సరే నేను నీవుచెప్పినవన్నీ చేస్తాను.అప్పుడు నువ్వు వాటితో ఏమిచేస్తావు? అని ప్రశ్నించాడు శివుడు.


  అంటూనే ఉన్నాను కదయా మయశ్చమే అంటూ అన్నాడు జీవుడు


   అణువణువు శివమే-అడుగడుగుశివమే.


   అది ఏమితో రేపు తెలుసుకుందాము.


  సర్వం శివమయం జగం.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...