మీడుస్టమ శివ-వరములను వర్షించు-01
***********************************
శం చ మే-
మే నాకు చ కుడా కావాలి ఏది కావాలి?
శం అనగా ఐహిక సుఖము.
ఐహిక సుఖమును పొందవలెనన్న శరీరమునకు ఆహారము-మనసునకు ఆహ్లాదము కావాలి.
తలదాచుకొనటానికి ఇల్లుకావాలి.కనుక -వస్యశ్చమే.
గూటిలోనికి చేరిన తరువాత కూటిపై తాపత్రయము సహజమే కదా-కనక సీరంచమే-వ్యవసాయము చేసుకొనుటకు కావలిసిన నాగలి-ఎద్దులు-ఇతర పరికరములు కావాలి.కనుక సీరంచమే.
ఆహారముతో పాటు నీరు కూడ కావాలి-అంబశ్చమే.
మనకు కావలిసిన అన్ని వస్తువులను పండించుకోలేము కదా! కనూ మిగిలినవి కొనుగోలు చేయవలసినదే.కనుక ద్రవిణశ్చమే.
కూడు-గూడు ఇచ్చావు.మేము వాటిని ఆస్వాదిస్తూ,అనుభవించాలికదా.కూరిమితో వాటిని అనుభవిస్తున్న సమయములో చిన్న చిన్న జలుబు-దగ్గు-జ్వరము వంటి శరీర రుగ్మతలు రావచ్చును.వాటిని దూరముగా నెట్టివేయి-అనామయశ్చమే.
నువ్వు చిన్నచిన్న వాటిని నెట్టివేస్తున్న సమయములో క్షయ మొదలగు పెద్దపెద్ద వ్యాధులు మమ్ములను సమీపించుటకు సాహసము చేయవచ్చును.వాటిని కూడ మాదరిచేరనీయకు. అయక్ష్మంచమే.
అయినా అవి మా ప్రారబ్దమును అనుభవింపచేయుటకు మాదరిచేరితే వానిని పారద్రోలే ఔషధములను మాకిమ్ము.-జీవాశ్చమే.
ఆ కాలుడు కోరలు చాచి మాపై కొక్కెము వేయాలని చూస్తున్నాడేమో? వానిని గద్దించి అపమృత్యుభయమును తొలగించుము-దీర్ఘాయుశ్చమే.
సరే నేను నీవుచెప్పినవన్నీ చేస్తాను.అప్పుడు నువ్వు వాటితో ఏమిచేస్తావు? అని ప్రశ్నించాడు శివుడు.
అంటూనే ఉన్నాను కదయా మయశ్చమే అంటూ అన్నాడు జీవుడు
అణువణువు శివమే-అడుగడుగుశివమే.
అది ఏమితో రేపు తెలుసుకుందాము.
సర్వం శివమయం జగం.
No comments:
Post a Comment