మీడుషటమ శివ-02
***********************
న రుద్రో రుద్ర మర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రునితో సంభాషించలేడు-అర్చించలేడు.
సాధకుని మాటకు మయశ్చమే అంతే అని అమాయకముగా అడిగాడు ఆదిదేవుడు అమాయకముగా.ఎంత చతురుడవయ్యా చంద్రశేఖరా! శాపగ్రస్థౌడైన చంద్రుని నీ చాతుర్యముతో శిరోభూషనముగా చేసికొనినావు.ఆ అవ్యాజప్రేమ అటుగా వెళుచున్న నాపై కొంచము ప్రసరించినదేమో.నా నోటినుండి వినాలనుకున్న నీ కోరికను నా అదృషముగా స్వీకరిస్తాను.
నాకు ఇల్లుకావాలి అన్నానుకదా.నీవు సరే అన్నావు.నా ఈ ఉపాధియే ఇల్లు వస్యశ్చమే అని అడిగాను. .గూటిలో కూర్చుని ఉన్న నాకు నీ అనుగ్రహముతో ఈ ఉపాధి ఉపయోగమేమిటి? అనే ప్రశ్న ఉదయించింది.ఇదియే నాకు నా ఆధ్యాత్మిక అంచులను చూపించే సాధనము అని అనిపించింది.ఇట్టి విశిష్టగల పరికరమును నేను సమర్థవంతము చేసుకోవాలి కద.అందుకే ఆధ్యాత్మికముగా తృప్తిని కలిగించే భావములను అహారముగా ఇమ్మనమని "ప్రియంచమే" అని అర్థించాను.సంకల్ప వికల్పములు నా మనసును కుదిపివేస్తూ ప్రశాంతతకు అడ్డుపడుతున్నాయి.వాటిని తొలగించి,నా మనో క్షత్రమును చదును చేయుటకు నాగలిని "సీరంచమే" అని అడిగాను.ఆ నాగలి స్థితప్రగ్నతకు ప్రతిరూపమా అన్నట్లుండాలి.
అంతే కాదు.నేను చ కూద కూద అంటుంటూనే ఉంటాను.నీ అనుగ్రహిస్తూనే ఉండాలి అన్నాడు సాధకుడు.
మందహాసముతో మారసంహారకుడు మరినేను వెళ్ళిరానా అన్నాడు.
మారాముగా సాధకుడు నాకు శాస్త్రప్రమాణములు స్నేహితులవలె సౌమనస్కులుగా కావాలి అన్నాడు.ప్రస్తుతము వీటిని స్వీకరించి పనిని ప్రారంభించు అన్నాడు పరమేశ్వరుడు.
అణువణువు శివమే-అడుగడుగుశివమే
సశేషం
సర్వం శివమయం జగం.
No comments:
Post a Comment