శ్లోకము
" క్షుప్తిపాసా మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం
అభూతి అసమృద్ధించ సర్వానిర్ణుద మేగృహేత్"
తనతాను సంస్కరించుకొనబడుటకు లక్ష్మీ అనుగ్రహమునకై జాతవేదుని సహాయమును అర్థించుచున్నసాధకుడు ఇంతవరకు వారు నాదగ్గరకు రావాలి.అతి సమీపముగా ఉండాలి.నన్ను వీడకుండా నాశ్వసలో శ్వాసగా ఉండాలని కోరుతూ వచ్చాడు.
కాని వారు వచ్చిన స్థిరముగానిలుచుటకు అవకాశము లేని కొన్ని అడ్డంకులు/ఆటంకములు తనలో ఇంకా ఉన్నాయని,అవి తొలిగితే కాని వారిని స్థిరాసీనులను చేయలేనన్న విషయమును గ్రహించాడు.
కనుకనే ఓజాతవేద! నేనడిగిన వానిని నాదగ్గరకు చేర్చేముందుగా మూడు రకములైన దురవస్థలు నన్ను వీడక ఉన్నాయి.ముందు వాటిని పూర్తిగా,"నిర్ణుద" అమ్మ కరుణపూర్తిగా/సంపూర్తిగా తరిమివేయునట్లు అనుగ్రహించమని సహాయపడుము.
పునర్జన్మతో సంస్కరింపబడాలంటే,
నాలోని,
.క్షుత్తు-ఆకలి 2.పిపాస-దప్పిక 3మలము తొలగిపోవాలి.
క్షుత్తు-పిపాస అభూతినికలిగిస్తాయాఇ.
భూతి అనగా సంపద.న భూతి అభూతి-సంపదను చేరనీయని ఒక దురవస్థ.
సమృద్ధి-పుష్కలము.ఒకవేల సంపద లభించినను తగినంత చేరనీయక పోవుట మరొక దురవస్థ.
ఈ రెండు దురవస్థలు నాలోని యుక్తాయుక్త వివేకమును లోపింపచేసి కౄరకర్మలను చేయిస్తాయి.
తత్ఫలితముగా నా గృహమున జ్యేష్ఠాలక్ష్మీ తాందవిస్తూ తమోగుణమును విస్తరింపచేస్తుంటుంది.ఆకలి-దప్పికలతో/శోక-మనోవ్యథలతో/జరా-మరణభయముతో నేను కప్పివేయబడతాను.
కనున-మే గృహేత్,
1.అభూతిం నాశయామి
2.అసమృద్ధి నాశయామి
3క్షుప్తి నాశయామి
4పాసా నాశయామి
5.మలాం నాశయామి
6 వీటికి మూలకారణమైన జ్యేష్టాదేవి తరలిపోవాలి.
అదికూడా సర్వా-అంతటా-పూర్తిగా తరిమివేయబడాలి.
ఆతదుపరి నా గృహము శోభాయమానముగా /నా ఉపాధి సంస్కారవంతముగా మాలా మాయను తరిమి వేయగలగాలి.
నాబుద్ధి తనలోని తమోగుణమును విడిచిపెట్టగలగాలి.మాయను గుర్తించగలగాలి.
నాఉపాధిలోని చైతన్యము ,
1.అపరిమితము పరిమితముగాను
2అశాశ్వతమును శాశ్వతముగాను
3.స్వస్వరూపమును ఉపాధిగాను
భ్రమపడుటను తొలగించాలి.కనుక నీవు దయతో నా భ్రాంతి యొక్క ముసుగులో భగవంతుని పరిపూర్ణత్వమును గుర్తించలేని స్థితిని "నిర్ణుద" తొలగించగలుగు ప్రకాసమును అందింపుము.
హిరణ్మయీం లక్ష్మీ సదా భజామి.