" ఇదేయం త్వాం పశ్యామి-01"
(కదా త్వాం పశ్యేయం-27)
***************************
" జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం."
మహేశుని అనుగ్రహ ఆవిష్కరణము శంకరయ్యకు ఈ విధముగా తన స్వరూప-స్వభావములను దర్శింపచేస్తున్నది.కనుక "ఇదేయం త్వాం పశ్యామి" ఇన్ని విధములుగా/ఈవిధముగానిన్ను నేను దర్శించగలుగుతున్నాను.
సర్వం శివ సంకల్పమస్తు.
"
" స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయికోహం? పశుపతీ
పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభు."
"ప్రీతిర్భవతి మయికోహం?
రాజాశ్రయమును పొందుటకు తగిన అర్హతలు లేని,కనీసము నన్ను నేను తెలిసికోలేని పశువును పశుపతివైన నీవు తప్ప ఎవరు రక్షించగలరు?అని శరణు వేడుతూ ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.
అనుగ్రహిస్తున్న ఆదిదేవుని వైపు ఆకర్షితుదగుచున్నాడో,ఆనందానుభూతిని అనుభవిస్తున్నాడో,ఆనందలహరులతో అభిషేకిస్తున్నాడో చెప్పలేని సమయములో పక్షులకిలకిలారావములు శంకరయ్యను బహిర్ముఖుని చేసినవి .
శంకరయ్య మనసు-తనువు ఒక్కొక్క స్థితిని అధిగమిస్తోంది.
1 బయలుదేరినప్పుడు,
వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచనుములు చెప్పింది.
2 శివయ్య పరిచయముతో "కైర్వాన్ పరమశివ జానే"అన్న ధోరణికి వచ్చింది.
3 .తుమ్మెదలను చూచి శివపాదాబ్జ మకరందమును గ్రోలవలెనను కోరికతో వేదవృక్షము దగ్గరకు వెళ్ళి పక్షులతో సంభాషించింది,దారిలో,
ఎన్నెన్నో వింతలు-విశేషాలు.
4 బ్రహ్మమును గురించిబ్రహ్మయ్య ద్వారా తెలుసుకున్నది.
5 ఆటవికుని మాటలతో సందేహములకు ఆటవిడుపు కలిగింది.
అదిగో ఆ దివ్యమంగళవిగ్రహము.ఆ అవ్యాజకరుణా ప్రవాహము. ఆ ఆశ్రితపారిజాత ఆలంబనము.
" త్వత్పాదాంబుజమర్చయామి త్వాం చింతయామ్యన్వహం"
స్వామి అనుగ్రహముతో ఈ ఉపాధిచేతస్సు/చైతన్యము
" చేతః పక్షి శిఖామణే త్యజ సంచారం
"అన్యైః అలం"
నిత్యం శంకర పాదపద్మయుగల "నీడే" విహారంకురు"
ఈ శంకరయ్య ఉపాధిలోని మనసు పక్షిగా మారి ఈశ్వరపాదపద్మములనే గూటిలో విహరించుటకు(/అన్య విహారములకు దూరముగానుండి) ప్రార్థించుచున్నది మహేశా.
అంటుండగా,
శంకరయ్య మేము సరిగ్గా అదే అనుకుంటున్నాము.
స్వామి మాకు పక్షి ఉపాధినిచ్చి ,మమ్ములను
" వేదాంతోపవనే విహార రసికం తం నీలకంఠం భజే" గా,
అనుగ్రహించాడు.
చెట్టు గూటిలో మేము రెక్కలనుముడుచుకుని,వేరొక పక్షుల ప్రసక్తి లేక అంతర్ముఖులమై ఉంటాము.తెల్లవారినదా భక్తి-విశ్వాసము అను రెండు రెక్కలను విదుల్చుకుంటూ,విషయవాసనలను గూటిలోనే పెట్టి,తోటి పక్షులను స్వామి సేవకు పిలుస్తూ,వినువీధిలో విహరిస్తాము.
ఇప్పుడు నీ స్థితికూడా అదే.
.సంసారములో ఉన్నప్పుడు అంతర్ముఖసాధనము,వీలైనపుడు బహిర్ముఖ భజనము.
నిరంతర నిత్యానందలహరులలో నిమజ్జనములు .నీకు కావలిసినదేమున్నది?
అంతా వింతగా ఉన్నది.
నిన్నటి ఆక్షేపణములన్ని నేడు సాపేక్షములై స్వాగతించుచున్నవి.
" నాలం వా సకృదేన దేవ భవతః సేవా నతిర్వానుతాః
పూజావా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం
స్వామిన్ అస్థిర దేవతానుసరణాసేన కింలభ్యతే తదా
కావా ముక్తిరితః కుతోభవతి చేత్కింప్రార్థనీయం తదా."
ఓ భక్త సులభ!
త్రికరణ శుద్ధితో నీకు చేసిన నమస్కారము-సేవనము- స్మరణము -పూజనము-దర్శనముముక్తిసోపానములై ,జీవన్ముక్తులను చేయునను సత్యమును"నాయనార్ల చరితము"చెప్పకనే చెప్పుచున్నది.
పూజాకోటి సమం స్తోత్రం-అన్న ఆర్యోక్తి ముమ్మాటికి సత్యము.
మహాదేవ!
మమ త్వం
" ఆత్మానావేత్ ద్రష్ట్వయః
శ్రోతర్వ్యో మంథవ్యో
నిధిధ్యాసం తవ్యః"
ఆత్మలో దర్శిస్తాను.విన్నది మననం చేసుకుంటాను.ఫలసిద్ధికి పరిశ్రమని/పరిక్రమను ప్రారంభిస్తాను.
స్వామి,
"అరహసి తహసి స్వతంత్రబుద్ధ్యా
వరి వసితుంసులభః ప్రసన్న మూర్తిః
అగణిత ఫలదాయకః ప్రభుః మే
జగదధికో హృది రాజశేఖరోస్తి"
సుముఖుడు-సులభుడు-సర్వసమర్థుడు-బాహ్యాంతరవసితుడైన,చంద్రశేఖరుడు హృదయవాసియై,భాసిల్లుచున్నాడు అను,భావనాలహరులలో మునకలు వేస్తున్న శంకరయ్యను,
పిలుస్తున్నారు అక్కడివారు స్వామి " తాండవమును "దర్శించుటకు వెళుతున్నామ0టూ,చేతిని పట్టుకుని తీసుకెళుతున్నారు.
కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.
'తన్మై మనః శివ సంకల్పమస్తు
వాచే మమశివపంచాక్షరస్తు
మనసే మమ శివభావాత్మ మస్తు".
పాహిమాం పరమేశ్వరా.
(ఏక బిల్వం శివార్పణం)