" త్వం సూర్యం ప్రణమామ్యహం."
***************************
"ఏకం సత్ విప్రా బహుధా వదంతి." వేదము.
సూర్యుడు ప్రసన్నంగా ఉదయిస్తాడు.ప్రచండముగా వెలుగుతాడు.తిరిగి ప్రసన్నముగా అస్తమిస్తాడు.ఉదయ-మధ్యాహ్న-అస్ తమయ సమయములందు సూర్య బింబము తామ్ర-అరుణ-గోరోజన వర్ణములతో విరాజిల్లుతుంటుంది.సూర్యుడు ఎప్పుడు ప్రచండముగానుండడు.ఎప్పుడు ప్రసన్నముగాను ఉండడు.క్షేత్ర-ఋతు ధరములననుసరించి సర్వమంగళములకై సౌరశక్తులను సద్వినియోగపరచుతుంటాడు ఆ ప్రత్యక్ష సాక్షి.
నమో నమః.
" జపా కుసుమ సంకాశం -కాశ్యపేయం మహాద్యుతిం
తమోరి సర్వ పాపఘ్నం -ప్రణతోస్మి దివాకరం."
మాఘ శుద్ధ సప్తమి సూర్యారాధనకు ప్రసిద్ధి చెందినది.దీనిని రథ సప్తమి అని కూడా పేర్కొంటారు.పక్షములోని ఏదవ తిథి సప్తమి.స్వామిని ఆదుత్యుడు,భాస్కరుడు,రవి,మిత్రు డు,దినకరుడు,ప్రభాకరుడు అర్కుడు,సవిత్రుడు అంటు పలు నామములతో ప్రస్తుతులు చేస్తుంటారు.
సప్తవర్ణ శోభితుడు,సప్తాశ్వ వాహనుడు తన దక్షిణాయన గ్రహణము నుండి విడివడి,ఉత్తర దిక్కుగా పయనమును ప్రారంభించు శుభదినముగా "రథ సప్తమిని" పెద్దలు విశ్వసిస్తారు.
రథమునకు సప్తమికి కల సంబంధము ఏమిటి? అంతగొప్పదా ఆ రథము ?అను ప్రశ్నకనుక వేసుకుంటే అద్భుత సమాధానాలు ఆవిష్కరింప బడుతాయి.ఈ రథము కొయ్యతో నిర్మించినదికాని, లోహములతో నిర్మించినది కాని మృచ్చకటకములో ముచ్చటించినట్లు మట్టితో నిర్మించినది కాని కాదు.ఏ విధముగా వేదములు అపౌరుషేయములో అదే విధముగాపవిత్రమైనది ,సమస్త జీవరాశుల మనోరథమునుతీర్చుటకు అనవరతము శ్రమించు కర్మసాక్షి రథము.అందరిని ఆదరించు అరదము.
" యద్భావం తద్భవతి" ఆర్యోక్తి.ఎందరో మహానుభావులు తమతమదృక్కోణముల ద్వారా దర్శించి ,పరిశీలించి ప్రస్తుతించినారు
.
"మానవ శరీరము రథమునకు సూక్ష్మ రూపము".జ్ఞానమే చక్రము.కామక్రోధాది అరిషడ్వరగములే ఆకులు.శుభేచ్చ-విచారణ-తను మనసి-సత్వాపత్తి-సంసక్తి-పదార్ థభావన-తురీయము అను సప్తజ్ఞానభూమికలే ఏడుగుఱ్ఱాలు.మనసే పగ్గాలు.బుద్ధియే సారధి.హృదయమే పరమాత్మ ఆసనము.జీవుని ప్రయాణ సాధనము శరీరము. ఇదియే సూర్య రథము.(సూక్ష్మ రథము.)
స్థూలభావముగా గోచరించిన వారికి విశ్వమే ఒక రథము.కాలమే చక్రము.ఉత్పత్తి-స్థితి-పరిణా మము-వృద్ధి-క్షయము-నాశనము ఆరు ఆకులు.దేవ- మానవ-వృక్ష-మృగ-పక్షి-కీటక- జలచరములు అశ్వములు.యోగ శాస్త్రకారులు శరీరమును రథముగా భావిస్తారు.వారి యోచన ప్రకారము కుండలిని శక్తి ఏకచక్రము.షట్చక్రాలు ఆరు ఆకులు.భూమి-నీరు-వాయువు-అగ్ని- ఆకాశము-మహత్తు-అహము ఏడుగుఱ్ఱాలు.చిదాత్మనే సూర్యుడు.(స్థూల రథము.)
సంఖ్యా శాస్త్రకారుల అభిప్రాయము ప్రకారము విశ్వము 360 డిగ్రీలు గల ఒక వృత్తము.సూర్యుడు ఒకరోజుకు ఒక డిగ్రీ చొప్పున పయనిస్తూ 360 రోజులలో వృత్త గమనాన్ని పూర్తిచేస్తాడు.మిగిలిన రోజుల లెక్కలే అధికమాసములుగా పరిగణింపబడుతాయి.
("కాల రథము.) ఈ రథసాక్షాత్కారమును పొందిన దివ్యులు ఈ విధముగా స్తుతించుచున్నారు.గంధర్వులు సంగీతముతో,అప్సరసలు నాట్యముతో,నాగులు రథ అలంకరణలతో,యక్షులు అంగ రక్షణతో,వాలిఖ్యాది మునులు ప్రస్తుతులతో,నిశాచరులు అనుసరిస్తూ భక్తోపచార-శక్తోపచారములను చేస్తూ తరిస్తున్నారట. ప్రత్యక్ష సాక్షి కి నిత్యార్చనలు నెనరులు.
సూర్య రథము మూడుకోట్ల ఆరు లక్షల యోజనముల పొడవు,తొమ్మిది లక్షల యోజనముల వెడల్పు కలిగి,పన్నెండు నెలలలో,పన్నెండు రాశులలో ,మిత్ర-రవి-సూర్య-భగ-పూష-హిరణ గర్భ-మరీచి-ఆదిత్య-సవిత-అర్క-భా స్కర రూపములతో పయనిస్తు ఋతువుల ఋజు వర్తనమునకు ఋజువైనాడు ఆ పరమాత్మ. సప్త ఋషులే రథాశ్వములని , అనూరుడు సారథి అయి,
స్వామి కనుసన్నలను అనుసరి0చు ఉరుతర రథచోదకుడు.
స్వామి కనుసన్నలను అనుసరి0చు ఉరుతర రథచోదకుడు.
ఈ రథసాక్షాత్కారమును పొందిన దివ్యులు ఈ విధముగా స్తుతించుచున్నారు.గంధర్వులు సంగీతముతో,అప్సరసలు నాట్యముతో,నాగులు రథ అలంకరణలతో,యక్షులు అంగ రక్షణతో,వాలిఖ్యాది మునులు ప్రస్తుతులతో,నిశాచరులు అనుసరిస్తూ భక్తోపచార-శక్తోపచారములను చేస్తూ తరిస్తున్నారట. ప్రత్యక్ష సాక్షి కి కోణార్క అరసవెల్లి ఇంకా ఎన్నెన్నో పవిత్ర దేవాలయములలో,యోగ సాధనలైన సూర్య నమస్కారములతో,సూర్యోపాసన దాగిన గాయత్రీదేవి మంత్ర సాధనతో బహుముఖములుగా బహువిధ నిత్యార్చనలు నిత్య కళ్యాణములు..
ధర్మము అనే ధ్వజముతో గాయత్రీమాతగ, గమనము చేయు రథము,సారథి యైన అనూరుడు,స్వామి సూర్య భగవానుడు సకల చరాచర జీవరాశుల సృష్టి-స్థితి-లయములకు కారణభూతుడై,తాను అనవరతము శ్రమిస్తున్నను,మనకు విశ్రాంతిని ఇచ్చుటకు రేయిగా మనకు కనుమరుగవుతున్న ఆ సూర్యభగవానుడు అదితి-కశ్యపులకు జన్మించిన రోజు కనుక పుట్టిన రోజు శుభాకాంక్షలతో,కుటుంబీకుడైన రోజనే వారిని గౌరవిస్తు విశ్వ కుటుంబీకునికి వినమ్ర ప్రణామములతో,యధాశక్తి స్మరిస్తూ-
" శ్రీ సూర్య నారాయణ మేలుకో-హరి సూర్య నారాయణ మమ్మేలుకో"
"సూర్యునికి ఒక చిన్ని దివిటీ."