Wednesday, May 3, 2023

ANUBAMDHAM ADITYAHRDAYAM WITH NAMAKAM -PART-01

 


 మనుగడలోని ప్రశాంతతను అడ్డుకొనునది రోదనము.

 స్వస్వరూపమును తెలిసికొననీయనిది రోదనము.

 రోదనం ద్రావయతి ఇతి రుద్రః.

 దుఖమును-శోకమును ద్రవింపచేయువాడు కనుక పరమాత్మ

 రుద్రునిగా సంకీర్తింపబడుతున్నాడు.అంటే భద్రతను చేకూర్చు పరమాత్మయే రుద్రుడు.

 ఆదిత్యహృదయ స్తోత్రము సైతము పరమాత్మ ప్రసన్నతను సూర్యమండలముగా భావిస్తూ,ప్రసాదగుణమును సూర్య రూపముగా ప్రస్తుతిస్తున్నది.

 అంతే కాదు అనేకానేకములుగా మండలమునుండి విస్తరిస్తున్న కిరణములను అనేకానకములుగా విస్తరించుచున్న రుద్రులుగా భావిస్తున్నారు.భాసిస్తున్న కిరణములు భవసాగరమును దాటించు రుద్రులు అన్నమాట.


 పరమాత్మ రుద్రములో రుద్రునిగాను-ఆదిత్యహృదయములో మండలాంతరగత సూర్యునిగాని రెండు నామములతో కీర్తిస్తున్నప్పటికిని,నమకము ప్రథమ అనువాకములోని 7-8 శ్లోకంలు పరమాత్మయొక్క ప్రసారగుణమును-ప్రసాదగుణమును వివరించుటలో ఏకాభిప్రాయముతోనే ఉన్నవి.

  ఏడవ మంత్రము అసౌ-అన్న సంబోధనతో ఆయననే అసమానమైన పరమాత్మ.అవ్యాజకరుణమూర్తి.అనుగ్రహప్రదాత.

 కనకనే చీకటిపై-జడత్వముపై -పాపములపై తనకున్న

 "హేడ" కోపమును తొలగించుటకు,నిర్మూలించుటకు ఉదయమునుండి-అస్తమయము వరకు మనలను తాకుచున్నాడు.

 రుద్రా-ఇమాంగుం అభితః-ఉదయ సంకేతముగా రుద్రుడు/సూర్యుడు భూమి మీద విస్తరిస్తున్నాడు.

 అంతేకాదు-మరియును అని చెప్పుటకు"ఉత" అనే శబ్దము ప్రయోగింపబడినది.

 రుద్రుడు భూమి మీద సూర్యునిగా ఎలా విస్తరిస్తున్నాడో చెప్పాలంటే అభితః దిశః-అన్ని దిశలయందును/దిక్కులయందును విస్తరిస్తున్నాడు.

 రుద్రుడు అన్ని దిక్కులయందు విస్తరిస్తున్నప్పుడు మూడు రంగులతో 

తామ్ర-అరుణ-బభ్రు-ఎర్రని రంగు-కొంచము లేత ఎరుపు రంగు-బంగరు రంగుతో ప్రకాశిస్తున్నాడు.

 ఇక్కడ దిక్కులు-రుద్రులుగా ప్రస్తుతింపబడు సూర్యకిరణములు పరస్పరాశ్రితములు.

  ఏకం-అనేకం సిద్ధాంతమునకు ప్రతీక.భానుమండల/హిరణ్యగర్భమండలమునకు-భాను కిరనములకు అభేదము.భానుని/రుద్రుని కోపమునకు-భానుకిరణముల-రుద్రుల కోపములకు అభేదము.వారి విస్తరిస్తున్నది జడత్వ/తమో నివారణమునకు.

 మానవ ఉపాధికి /జీవుల పాపములను నిర్మూలించుటకు వారిని దండించుట కూడా వారి కర్తవ్యము.కనుక పరమాత్మ యొక్క సుమంగళత్వమును మరింత సుస్పష్తము చేస్తున్నారు.


 తూరుపు దిక్కును సుమంగళము అంటారు.రుద్రుని/సూర్యుని సుమంగళుడు అంటారు.

 నమకము ప్రధమానువాకములో ఏడవ శ్లోకములో పరమాత్మ తనకు తాను సూర్యునిగా మనకు ప్రత్యక్షమగుట-పరిపాలించుట చెప్పబడినది.తన కిరణ ప్రతాపములను అనుకూలముగా మలచుకొని అనుగ్రహించునట్లు చెప్పబడినది.

 

 ఎనిమిదవ శ్లోకములో రుద్రా! సూర్యునిగా ఉదయిస్తున్న నీ కాంతిని తాకుతూ,గోపులను కాచుకొను గొల్లవారును,నీటిని గ్రహించి ఇంతికి కడవలతో తీసుకొనివెళుతున్న గొల్లవనితలును,సకల జంతువులును 

 అదృశన్-చూచుచున్నారు.

విశ్వా భూతాని అదృశం-విశ్వములోని సకల జీవరాశులు చూడకలుగుతున్నవి.

 తం సూర్యం ప్రణమామ్యహం.



TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...