Tuesday, September 12, 2017

PURUHOOTIKAA PEETHIKAAPURAE


   "పురుహూత సతి మాత పీఠికాపురు సంస్థిత
   పుత్రవాత్సల్యతా దేవి భక్తానుగ్రకారిణి"


  మాయాసతి పీఠికాభాగము పడిన ఆంధ్ర ప్రదేశములోని పవిత్ర స్థలమును "పీఠికాపురము" అనియు,పిఠాపురము అనియు,పిష్ఠపురము అనియు,పాదగయ అనియు భావిస్తూ,భజిస్తూ ఉంటారు.పీఠికాపురి పాలిని "పీఠాంబ" అని నమ్ముతారు.ఆ తల్లి ఒక చేతిలో బంగారు పాత్ర,వేరొక చేత బాగుగా పండిన ఉసిరికాయ,మరొక చేత త్రిశూలము,నాల్గవ చేత లోహదండమును ధరించి నేత్రోత్సవము చేసెడిదట.వృతాసుర సంహార దోషమును తొలగించుకొనుటకు ఇంద్రుడు అమ్మగురించి అత్యంత నియమ నిష్ఠలతో తపమాచరించి ప్రసన్నురాలిని చేసుకొనెనట అమ్మ సంతసింసించి ఇంద్రుని మరొక పేరైన (పురుహూతుడు)పురుహూతిక నామమును స్వీకరించి,ఆశీర్వదించినదట. హుంకారిణి శక్తిపీఠ్ముగా ప్రసిద్ధిచెందిన స్థలములో వెలిసిన తల్లిని " ఓంకారిణి" అని కూడా పిలుస్తారు.

  ఇంద్రునిచే నిర్మింపబడిన పంచ మాధవక్షేత్రములలో ఒకటైన "కుంతీ మాధ క్షేత్రము" ఇక్కడ కలదు.పిఠాపురమునకు ఉత్తరదిక్కున "ఏలేరూఅనే ఏరు ఒకటి ఉంది.దీనిని ప్రస్తుతము చెరుకుల కాలువ అని పిలుస్తున్నారు

   రాక్షసరాజైన గయుడు విష్ణుభక్తుడు.ఘోరతపముచేసి విష్ణువుని ప్రసన్నముచేసుకొనెను.తన శరీరము ఆపాదమస్తకము సకల తీర్థక్షేత్రములకన్న అతి పవిత్రము కావించమని వరమును ప్రసాదించమని కోరి,అతి పవిత్రుడయ్యెను.ఆ వర ప్రభావముచే పంచమహా పాతకములు గయుని శరీరస్పర్శచే పటాపంచలయేవి.సకలచరాచరములు గయశరీర స్పర్శచే ముక్తిని పొందెడివి.పుణ్యఫలముగా  గయాసురుడు ఇంద్రత్వమును పొందెను.'కాలగతితో నడిచే బుద్ధి"పెడతోవ పట్టింది.అందుకే "బుద్ధి కర్మానుసారిణీ అని అంటారేమో.గయుడు దేవతలకు ఆహారముకావలిసిన యజ్ఞ హవిస్సును వారికి అందనీయకుండా తానే స్వీకరించ సాగెను.దేవతలు నిస్తేజులు కాసాగిరి.
    పాదగయ అను పవిత్రనామమును గల దువ్యక్షేత్రము గురించి అనేక కథలు వాడుకలోనున్నప్పటికిని రెండుకథలగురించి తెలుసుకొని ధన్యులమగుగాము.

     బ్రహ్మగారు ఒకసారి మహాకాయుదైన (అతి పెద్ద శరీరముకలవాడు) గయుని శరీరమును చేసి యజ్ణమును చేయుచుందగా గయుని శరీరము కదలసాగెను.అప్పుడు బ్రహ్మ వివిధ శిలలను అడ్డుపెట్తగా గయుడు వానిని తోసివేసిన అవి రామ పర్వతము-ప్రేత పర్వతముగా భూమిపై నిలిచాయని అంటారు.అప్పుడు బ్రహ్మగారు మరీచి మహాముని శాపము వలన మహాపతివ్రత దేవవ్రత శిలను గయుని తలపై పెట్టెను.పాతివ్రత్యమును గౌరవించు గయుడు కదలక నున్న సమయమున విష్ణువు ఖండించెనని ,గయుని పాదములు ఆ ప్రదేశమున ఉన్నవి కనుక పాదగయ అంటారు.

       రెండవ కథనము ప్రకారము దేవతలకు హవిస్సును అందించుటకై త్రిమూర్తులు ఋషివేషదారులై గయుని సమీపించి ,గయుని ప్రసన్నుని చేసికొని,అతని సంతోషమునకై ఒక వరమును కోరిరి.తాము ఒక బృహత్తర యజ్ఞమును సంకల్పించినామని,పవిత్ర శరీరము,మనము కలవారే యజ్ఞవాటిక కాగలరని,
  దృఢదీక్ష గలవారే యజ్ఞము పూర్తియగు వరకు నిశ్చలముగా ఉండగలరని గయుడు అందులకు తగినవాడని తలుచుచున్నామనిరి.గయుడు ఆ దీక్షకు సంతసముగా అంగీకరించెను.వారు పూర్తియైనదని  చెప్పకముందు గయుడు కదిలినచే అతని శరీరము వివిధ ఖండములగునని హెచ్చరించిరి.షరతును గయుడు అంగీకరించగా యజ్ఞమును ప్రారంభించిరి.విష్ణువు ఇచ్చిన వరమును గయుడు పొందవలసిన సమయమాసన్నమగుటచే పరమేశుడు వ్రతసమాప్తికి ముందగనే కోడిరూపమును దాల్చి కొక్కొరొకో అని కూయసాగెను.యజ్ఞము పూర్తి అయినదనుకున్న గయుడు కదలగానే నియమ ప్రకారము అతనితల వివిధ
  ఖండములై పాదములు మాత్రము ఆ ప్రదేశములో ప్రకాశించుచుండేనట.పాదగయగా గయును పాదములు పావనత్వమును పొందినవి.

  కోడిని కుక్కుటము అనికూడా అంటారు.భక్తులపై మిక్కుటముగా కరుణగల స్వామి
  కుక్కుటేశ్వరుడై కొలువబడుచున్నాడు.

    పూర్వము అమ్మవారిని లక్ష్మీరూపముగాను,అంబారూపముగాను భావించు రెందు వర్గములవారు  "పద్మధారియైన పురుహూత లక్ష్మిని సమయాచార ప్రకారము,పురుహూతాంబిక అని వామాచార ప్రకారము ఆరాదించేవారట.అమ్మ వారి పూజలను ఆనందముగా స్వీకరించి,అనుగ్రహించెడిదట. వ్యాస మహర్షి,ఆదిశంకరులు అమ్మను దర్శించి ధన్యులైరి.

   కాలభైరవుడు క్షేత్ర పాలకుడైన పీఠికాపురమందు ఇంద్రుని ఋషిగాను,కుక్కుటేశ్వరుని గురువుగాను గౌరవింతురు.గయుని శిరో-మధ్య-పాదములను పవిత్రము చేసిన యోగ క్షేత్రి,పీఠికాపురనివాసి ఉత్తరాభిముఖియై  మన చిత్తములలో స్థిరముగా నుండుగాక.

   శ్రీ మాత్రే నమః
.. .

UJJAYINYAAM MAHAA KAALI


   "ఉజ్జయిన్యాం  మహాకాళి మహా కాళేశ్వరేశ్వరి
   క్షిప్రతిరస్థిత మాతా వాంచితార్థ ప్రదాయిని"

 మధ్యప్రదేశములోని  మాల్వా పీఠభూమి యందు,క్షిప్రనదీ తీరములోని మాల్వ పీఠభూమి యందు,పదహారు జనపదములలె ఒకటైన అవంతీ రాజ్యమునందు పడిన మాయాసతి పై పెదవి/పలువరస ఉజ్జ్వల మహా కాళిగా/మహా కాలునిగా ఆవిర్భవించెను.దీనిని "మహా శ్మశానము" అని కూడా అంటారు

  చంద్రసేనుడను భక్తుని రక్షించుటకు శివుడు ఇక్కడ వెలిశాడని అంటూంటారు.విక్రమాదిత్యుడు,సాందీపని,మహాకవి కాళిదాసు తరించిన ప్రదేశము కనుక ,సాధనతో ఎందరో మహానుభావులు సిద్ధిపొందిన క్షేత్రము కనుకను,సిద్ధమాతా క్షేత్రమని కూడా వ్యవహరిస్తారు.

  మంగళనాథుని కోవెల కుజునిచే నిర్మింపబడినదని ఇక్కద మంగళగ్రహ దివ్యశక్తి కలదని,దర్శించిన ప్రజలు కుజదోషము నుండి విముక్తులగుదురని భక్తుల విశ్వాసము..

   అబంతీ పట్టణము కాలక్రమమున ఉజ్జయినిగా మారినది.దాని యందు మహాకాలుడుగా  అయ్యవారు,మహాకాళి గా అమ్మవారు ఆరాద్గింపబడుదురు.ఈ క్షేత్రమును మహా శ్మశానవాటిక అనికూడా అంటారు.అమ్మవారు రౌద్రరూపిగా పుర్రెలను మొలకు వస్త్రములుగా ధరిస్తుంది.కాలము ప్రళయస్వరూపము.నాలుక బయటపెట్టి కాళికాదేవిని ఉపాసనాబలముగలవారు బహుతక్కువ.యుద్ధభూమిలో పడియున భర్త పరమశివుని తన తాండవసమయములో కాలితో తొక్కినది.

        ఉజ్జయిని విద్యాక్షేత్రము.సిద్ధక్షేత్రము.హరసిద్ధి అమ్మవారుకనుక ఇది సిద్ధ క్షేత్రముగా ప్రసిద్ధిచెందినది.గడ్ కాళి మాత అనికూడా అంటారు.కాళిదాసుని అనుగ్రహించినతల్లి.సాందీపని నివసించిన సాహీతీక్షేత్రము.
   కాలము అనగా తరిగిపోవునది.మింగివేయునది."కలయతీతి కాళి" కాలములోనున్న అఖండశక్తియే కాళిక.కలయతి నియతి కాళి అని కూడా అంటారు.కాలగతిని నడిపించునది.అయ్యవారు మహాకాళుడు.అమ్మవారు మహా కాళీ.లింగభేదమును పరిగణనలోనికి తీసుకోకుంటే కాలము/సమయమే కాళి.వస్తువుల పరిణామమును తెలియచేయునది కాలము కనుక "కాలో జగద్రక్షక"  అని అంటారు."కాల కాష్టేన రూపేణా' అనికూడా కాలికాదేవిని కొలుస్తారు.కాలాతీతురాలైన తల్లికి కాల నిర్దేశములేదు కనుక నాలుకను తెరచి దర్శనమిస్తుంది,అమ్మ నిత్యత్వమునకు ప్రతీకగా నాలుకను కిందకు సాచిఉంటుంది.అమ్మలీలను అర్థముచేసికొనుట దుర్లభము.అంతులేని అమ్మమహిమలను తెలుసుకోలేనితనము అమ్మ శరీరమును నల్లతనముగా (తమస్సుగా)  అల్లుకున్నదేమో.."కళా కాష్టాది రూపేన పరిణామప్రదాయిని" కాళీ.

  సూర్యోదయ చంద్రోదయములకు అంతు  తెలియని కాలమే మహాకాలం.కాలోపాసనతో కాలాతీత స్థితిని చేరుకోగలము.కాలబద్ధులు జీవులు.కాలాతీతుడు దైవము.బ్రహ్మము మొదలుకొని గడ్డిపోచవరకు  కాలబద్ధులే.కాలము ఎవరి అధీనములో ఉందో ఆమెయే కాళి.కాల నిర్దేశములను భావించు సూర్యచంద్రులను అమ్మ తాటంకములుగా ధరించుట వలన విషమును మ్రింగినను పరమేశ్వరుడు కాలాతీత మహాకాళుడు.రామక్రిష్ణ పరమహంస కాళికాదేవిని తల్లిగా భావించి  ధన్యుడయ్యెను..
   తల ఆలోచనలకు,చేతులు ఆచరణలకు సంకేతములు. అమ్మ తలలను చేతితో పట్టుకుని నడుముకు ధరించుట సత్భాషణ-సత్కార్యా విష్కరణకు సూచనగదా.  అమ్మ ధరించు కొలికిపూస లేని పుర్రెలదండ అసంపూర్ణ పుర్రెల మాలలకు సంకేతము.కాలతత్త్వ ఉపాసనయే కాళికోపాసన.మహేశ్వర మహాకల్ప మహా ప్రళయ   సాక్షి యైన తల్లి మనకు మంగళమొనరించుగాక.

   శ్రీ మాత్రే నమః

 

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...