Friday, May 10, 2019

NAH PRAYACHCHAMTISAUKHYAM-25


  నః ప్రయచ్చంతి సౌఖ్యం-25
  ***********************

  భగవంతుడు-భక్తుడు ఇద్దరు పండితులే

 " నమః స్లోక్యాయచ-అవసాన్యాయచ."

 వైదిక మంత్రములందును వర్దాంతసారమునందున్న మేథా దక్షిణామూరితి తత్త్వమైన రుద్రునకు నమస్కారములు.

  " ఓం అక్షరాయ నమః-ఆద్యంతరహితాయ నమః.

తిరుమురుక్కరు పాలై రచయిత మధుర తముళ కవి నక్కీరర్
నమ్మినసత్యమునకు నిలిచిన,పరమేశ్వరునే చర్చకు రప్పించెను
తివిలై యడయల్ తెలియగ రానివి దేవుని-జీవుని ఆటలు
ఆటకు నాందియైనది అమ్మ ఘనపూంగదై పరిమళ సందేహము
పరిష్కారమునకై పసందుగ రాజుచే ప్రకటనము బహుమానము
పరమేశుడు రాసిన పద్యము ప్రవేశించినది ధారుమి చదువగ
నక్కీరుడు పట్టిన దోషము, నడిపించెను శివుని సభకు చర్చకు
అతి మూర్ఖత్వమె ఆదిదేవుని అనుగ్రహమునకు కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

 " ఆపాతాళ నభః స్థలాంత భువన బ్రహ్మాందమావిస్పురత్
   జ్యోతిః స్పాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః
   అస్తోకాప్లుతమకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్
    ధ్యాయేత్ ఈప్సితసిధ్ధయే ద్రువపదం విప్రోభిషించేత్ శివం."

 " చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా" అమ్మవారి కచభారము  కేశభారము) చంపకములు అశోకములు,పున్నాగలు,సౌగంధికముల పరిమళములను సహజముగనే కలిగియున్నదని " శ్రీ లలితారహస్య సహస్రనామములు" వివరించుచున్నవి.శ్రీ మాత్రే నమః.

  అమ్మ ధమ్మిల్లమును కథావస్తువును హేసి ఆ ఆదిదేవుడు తన భక్తుడైన నక్కీరునితో ఆడుకొనిన ఆటయే అతిపవిత్రమైనది."తిరువిలై యడల్" అను తమిళ ప్రసిధ్ధపురాణమును రచించిన నక్కీరర్ తో నడిపించిన నాటకమే ఇది.
శ్రీ తనికెళ్ళ భరణిగారు శెలవిచ్చినట్లు " ఆత కదరా శివా-ఆత కద కేశవా,ఆటకద నీకిది అమ్మ తోడు" అన్నట్లుగా అయ్యవారి ఆటలో అమ్మవారి కేశపాశ పరిమళము ప్రధాన పాత్రగా మారినది.

  " ఓం కపర్దినేచ-వ్యుప కేశాయచ." చిక్కులజడలు కలవాడు,ముండన కేశుడు అయిన సుందరేశుని ఆట ఇది.

 సూత్రధారుడైన సుందరేశుడు పాండ్యరాజును-ధార్మిని-నక్కీరరును పాత్రధారులను చేశాడు.పాంద్యరాజు ఆనందసందోహుడై యున్న సమయమున అమ్మధమ్మిల్ల పరింఅలముపై సందేహబీజమును వేశాడు.పెరిపెరిగి పెద్దదైనది ఆ అనుమానము ఆ ఆదిదేవుని ఆనయై.మీడుష్తుదైన శివుడు రాజుచే సందేహనివృత్తిని చేసిన సత్పురుషులకు సహస్ర బంగారు నాణెముల బహుమానమును ప్రకటించేయించాడు అ సంకటహరుడు.నమో నమః.దయగలవాడు గనుక ధార్మికి పద్దియమును వ్రాసి ఇచ్చి,పండితసభలో చదివి,పారితోషికమును తీసుకొనమన్నాడు పరమేశ్వరుడు.

  " సర్వేశ్వరాయ-సదాశివాయ-శ్రీమన్మహాదేవాయ నమః".

  ధార్మి ప్రభువు నుండి బహుమానమును అముదుకొనబోవుచున్న సమయమునఘటనాఘటనా సమర్థుదగుగౌరీపతి నక్కీరుని రంగప్రవేశముచేసి,నాటకమును మరింత రక్తికట్టింప దలిచాడు.కాదనగలరా కాముని కాల్చిన వాని ఆనతిని.తన స్వామి రచించినది ఆ పద్దియమూని తెలిసిన నక్కీరుడు ,ధారిమి పద్యము అవాస్తికతతోనున్నదని,సహజ పరిమళమైన ధమ్మిల్లములు కానరావని,సభలో మరొక పర్యాయము పద్దియమును సహేతుకముగా వివరించమని అడిగెను.అవమానమును గ్రహించినఆ ధార్మి సభను వీడిపోయెను.అర్హతలేని వానికి అమదలమెందుకని.అంతటితో ఆగలేదు.ఆదిదేవుడైన ఆ పండితునితో అయ్యా మీ పద్దియము లోపభూఇష్టముగా సభలో నక్కీరునిచే ఆరోపించబడినది.అసహాయుడనైన నేను ఆ బహుమతిని అందుకోలేకపోయాను.అర్థరహిత పద్దియమునిచ్చుట అవమానించుట ఎందుకు ఆర్యా అని ఆవేదనను వెలిబుచ్చాడు.అంతే,

 " మండలాంతరగతం హిరణ్మయం -భ్రాజమాన వపుషం శుచిస్థితం
   చందదీధితం అఖండితద్యుతిం ఇచింతయేన్ముని సహస్రసేవితం"

 అంటూ మునిపుంగవుల స్తుతులు నినదించు శుభసమయమున ,ధార్మితో పాటుగా సభాప్రవేశము చేసినాడు సుందరేశుడు.

 " సభాభ్యో-సభాపతిభ్యో నమో నమో నమః."


 " తిరుమురుక్కరుపాలై"  పెద్ద మూర్ఖుని అనుగ్రహించుటకు వచ్చిన స్వామితో,నక్కీరరు తాను తర్కమీమాంసలను తెలిసినవాడనని,ఎంతటి గొప్పవారు రచించినదైనప్పటికిని పద్దియము అవాస్తికమని,లోపభూఇష్ఠమని వాదించసాగెను.నక్కీరుని అదృష్టమును ఏమని వర్ణించగలను? ఆనిర్హతేభ్యునితో సర్వపాపములను నాశనముచేయువానితో) వాదన చేయగల వరప్రదానుడు.అక్కడ జరుగుచున్నది వాదప్రతివాదములు కావు. నక్కీరుని ప్రతి పదము పవిత్రబిల్వపత్రమై పరమేశుని పాదార్చనచేయుచున్నది,పరమేశుని ప్రతిపదము ఆశీర్వచనమై నక్కీరునికి పరమావధిని చూపించుచున్నదా అన్నట్లున్నది.ఎందుకంతే వాది-ప్రతివాది పరమేశ్వర స్వరూపాలే కదా.

   వాద-ప్రతివాద పతాక సన్నివేశములో పరమేశుడు నక్కీరునకు,

  " ఆ రాత్తే గోఘ్నే .....రక్షాచనో అధిచదేవ."

 పరినామముల ఫలితములు అర్థమగుచున్నప్పటికిని,ఇహపర సుఖములనందించు స్వామితో తన మూర్ఖ వాదనను మాత్రము మానలేదు.స్వామిని మనసులో నాదిస్తున్నాడు-బాహ్యములో వాదిస్తున్నాడు.

 " నమో యామ్యాయచ-క్షేమ్యాయచ"

 దండించి-దయచూపు స్వామి తన మూడవనేత్రముతో నక్కీరుని మూర్ఖత్వమును దహించి వేసెను.స్వామి లీలను గ్రహించలేని రాజు శివునితో,

 "ఏషాం పురుషానాం-ఏషాం పసూనాం
 భేర్మారోమో ఏషాం కించనా మమత్."

 స్వామి మా పురుషులకు-పశువులకు హానిచేయకుము.దయచేసి శాంతించి రక్షించుము అని వేడుకొనగా ,స్వామి కంటిమంత వేడికి తాళలేని నక్కీరుడు తోసివేసిన మూర్ఖత్వముతో బాటుగా,స్వామిచే హిర్ణ్యపద్మ కొలను లోనికి తోసివేయబడినాడని,పునీతుడై వస్తున్నాడని స్వామి అనుగ్రమును తెలుసుకొన్న సభాసదులు అయయంత భక్తిశ్రధ్ధలతో స్వామిని స్తుతించసాగారు.

 " నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
   త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ
   కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
   శ్రీమన్ మహాదేవాయ నమః."
 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.


   ( ఏక బిల్వం శివార్పణం)

   ( ఏక బిల్వం శివార్పణం.)




     



   







   

   




TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...