Thursday, January 5, 2023

AALO REMBAAVAAY-22

 



   పాశురము-22
   ***********
 " అహమును వీడి రాజసము సర్వవాహనమగు సుందరరూపము
   ఇహపరమని కాంచగనీయదు సహనము లేనిదగు మాదుశాపము"

సరస సింగారభరితముగా భ్రమింపచేసిన సంసారమను,
     తమోభూమిని వీడి తపోభూమిని ప్రవేశించినారు గోపికలు.కాని వారికి స్వామి దర్శనము లభించకపోవుటకు కారణము ఇంకను తమను వెంటాడుతున్న ,తమను పూర్తిగా విడువని శాపములేమో.స్వామి తన దృక్కులద్వారా వాటిని పరిహరించగలడను నమ్మకముతో,

  "అకించిన్యం"-నా ఉపాధి సమర్థవంతము కానిది
  "అనన్యగతిత్వం'-అది కదులుచున్నదంటే అది నీ అనుగ్రహమే అను భావనను "సర్వవాహన" సింహాసన !అను అందమైన ఉదాహరణలతో గోపికల పలుకుల ద్వారా అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
 ఇరువది రెండవ పాశురము.
*********************


అంగణ్ మాఞాలాత్తరశర్ అబిమాన
బంగమాయ్ వందునిన్  పళ్ళికట్టిల్ కీళే

శంగం ఇరుప్పార్ పోల్వందు తలైపెయిదోం
కింగిణి వాయ్ శెయిద తామరై పూప్పోలే

శెంగణ్ శిరిచ్చిఱిదే యెమ్మేల్ విళియావో
తింగళుం   ఆదిత్తనియుం ఎళుందార్ పోల్


అంగణ్ ఇరండుం కొండుం ఎంగళ్మేల్నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇళిందేలో రెంబావాయ్.

  స్వప్రవృత్తి నివృత్తి అయినవేళ ప్రపత్తిగా పరమాత్మను చేరు ఆర్తిగా పరిణమించి స్వామిని ప్రసన్నుని చేస్తుంది.
 ప్రతివిషయమునకు ప్రమాణములను చూపిస్తూ వారివలె మేమును వచ్చి నీ ముందు నిలిచియున్నాము అంటున్నారు గోపికలు స్వామితో.
 ఎందరో రాజులు తమ అభిమానమును వదిలివేసి శరణార్థులై వచ్చి నీ మంచముకిండ కూర్చునియున్నారట.వారి శంఖముల వలె తెల్లని/సత్వస్వభావులై నీ నామసంకీర్తనమనే నాదమును/అన్యథా శరణం నాస్తి-త్వమేవ శరణం మమ".అంటు నినదిస్తున్నది ఆ శంఖము అన్నది ఒక భావన.
  వారు వదిలినది దేహాభిమానము-రాజ్యాభిమానము-యశోభిమానము-నీవే వారిదగ్గరకు తరలి వెళ్ళాలనే తలపు అభిమానము.
 అలా వచ్చిన రాజులు ఒక్కరు- ఇద్దరుగారు.గుంపులుగుంపులుగా వచ్చి నిన్ను సర్వవాహభూషితునిగా సంకీర్తిస్తున్నారు.
   సర్వాలంకార సర్వభూషణుని సందర్శించనీయుట లేదు స్వామి మమ్ములను ఆడ్డుకుంటున్న మా శాపము.కనుక మేము మా అంతట నీ విప్పారు నేత్ర దర్శనమును వీక్షించలేము.కాని స్వామి శరణాగతులమైన మా మీద నీ  కృపావీక్షణమును ప్రసరించి మమ్ములను అనుగ్రహించు కృష్ణా.
  
 స్వామి ప్రాతికూలస్య వర్జనం-నీ నేత్రదర్శనమునకు మాకు ప్రతిబంధకములైన వాటిని/సంసార వ్యామోహములను విడిచి వచ్చాము.ఏ విధముగా రాజులు రాజ్యాధికారులమనే దురభిమానమును వీడి నిన్ను చేరిరో అదే విధముగా సంసారమనే సాంజ్యమున్నవారమను అభిమానమును వీడి నిన్ను సేవించుకొనుటకు 
 "అంకణ్ మాన్యాలా"-అందమైనదిగా మేము ఊహించుకొనిన భూమి
 "ఇరుం కణ్ మాన్యాలా"-చీకటి భూమి యని నీ అనుగ్రహముతో 
  తెలిసికొని నిన్ను సర్వస్య శరణార్థులమై వచ్చాము.
 "న విష్ణుః పృథ్వి పతిః"
 నీవొక్కదవే రాజువి అనే జ్ఞానమును అనుగ్రహించిన స్వామి,
 మాకు నీ నేత్ర వికసన సౌందర్య దర్శనమును అనుగ్రహింపుము.
 స్వామి కన్నులను సిరిమువ్వలతో పోలుస్తూ మెల్లమెల్లగ 
1.కింగిణి వాయ్ శెత్త-గంటకు కట్టిన మువ్వ వలె శబ్దముచేయుచు-మమ్ములను  నీ మౌనమును భరించలేని  శ్రవణముతో పులకించనీ.ఆ శబ్దము సౌమ్యముగానుండి మమ్ములను ధన్యులను చేయనీ.అంతేకాదు,.

2
తామరై పూప్పోలె-తామరసదళనేత్రునివలె,
 మా విరహపు చీకట్లను పారద్రోలు జ్ఞానమును ప్రసరించనీ
3.తింగళుం ఆదిత్తియనుం ఎరుందార్పోల్
   చంద్రుడు-సూర్యుడు ఒకేసారి ఉదయించనీయని

ఎంగళ్మేల్ నోక్కుదియేల్*
*ఎంగళ్మేల్ శాపం ఇరింద్ - నీ చూపులు మాపై ప్రసరించి శాపమును తొలగించు.అని వేడుకుంటున్నారు


  స్వామి అహల్య.దక్షుడు మొదలగువారి శాపములను నీ స్పర్శచే,వీక్షణముచే, తొలగించిన అనుగ్రహమే మమ్ములను నీముందుంచినది నీవు  కనులుమూసుకొని ఉండునట్లు చేయుచున్నది కేవలము మా పాప శాపములే.కరుణించి నీ అసమాన సౌందర్యవంతమైన-సత్కృపా వీక్షణముతో  మా శాపములను హరించి,నీ దివ్య నేత్ర  దర్శనభాగ్యమును ప్రసాదింపమనుచున్న నీలాసహిత గోపికల వెంటనున్న,

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం 



TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...