Monday, September 14, 2020
SIVA SANKALPAMU-108
ఓం నమః శివాయ-108
******************
కరుణరస పట్టిది కచ్చితము కనికట్టనలేనిది
నేనేమరియున్నవేళ తానే నన్నుచేరినది
మనోకలశము చూచినది మక్కువ తిక్కశంకరుని
తక్కువచేసినగాని దయతలుచు దిక్కగువానిని
సన్నుతిచేయుచు సంతోషపు జలమును నింపుచున్నది
అనురక్తితో భక్తిదారమును చుట్లుగ చుట్టుచున్నది
పదపదమని చేరినవి పరమేశుని పదములు మామిడాకులై
అపరాధము తలంచుచు పలాయనమైనది నింద కుందుచు
నా పశ్చాత్తాపము పరివర్తన చెందెను నారికేళమై
నిను నిందించిన ఇంద్రియములు నిష్కృతి కోరెను
పుణ్యహవచనము జరుగుచున్నది పునీతమవ్వగా
వసియింపుము శివా నామది వాత్సల్యము వాసికెక్కగా.
పరబ్రహ్మము ఒక్కటే.పైపై తొడుగులు వేరువేరుగా గోచరిస్తుంటాయి.పరమాత్మను అనుభవించాలంటే సూక్ష్మాతి సూక్ష్మమైన దర్శనశక్తిని కలిగియుండాలి.ఈ శక్తి అచేతనములను చైతన్యవంతము చేయు చిత్-శక్తి.దీనిని ఆత్మ యొక్క (పరమాత్మలోని చిన్ని మచ్చుతునక)అఖండశక్తిగా కూడ భావించవచ్చును.నేను-నాది అను అపరిమితమైన అహము అఖండశక్తిచే ప్రభావితమై మంచుకరిగినట్లు కరిగి,అంతఃకరణ శుధ్ధితో అసలు నిజము తెలుసుకోగలుగుతుంది.తాను నీడను మాత్రమేనని తెలుసుకొని నిజమైన పరమాత్మకు దూరముగా నుండి నడవలేక కదులుతున్న నేను కదిలిస్తున్న నేనులో కలిసిపోతుంది. అంతే,
సర్వం శివమయం జగం.దీనిని అర్థము చేసుకొనేటట్లు చేయుటకు ఆదిదేవుడు తాను ఒక్కొక్క మెట్టు దిగుతు-నన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తు,అలసట రానీయకుండా ఆడిన ఆటయే శివసంకల్పమను ఈ నిందా-స్తోత్రముల మారేడు దళము.
...ప్రియ మిత్రులారా.నా ఈ చిన్ని ప్రయత్నమునకు ఊపిరినిచ్చినది మీ ఉన్నత సం స్కారమే కాని నా
అర్హత కాదు.ఈ పవిత్ర
" శివ సంకల్ప" పలుకులను -చూసినా-చూడకున్నా,వినినా-వినకున్నా,చదివినా-చదువకున్నా,చర్చించినా-లేకున్నా,ఎప్పుడో పుక్కిట పట్టేశామని వెక్కిరించినా,గొప్పగా ఏమిలేదు అని పెదవిని చప్పరించినా,తప్పులు సవరించుటకు కనికరించినా.మేమా--తప్పులను సవరించేది అని హుంకరించినా
(ఫలశృతి)
గంగా స్నాన ఫలితమును ఇచ్చు గంగాధరుని ఆన
నాశ రహిత పుణ్యమును ఇచ్చు నాగాభరణుని ఆన
విభవమొసగు-విజయమొసగు విశ్వేశ్వరుని ఆన
సర్వ జనులకు శుభములు ఇచ్చు సదా శివుని ఆన.
( సవినయ ధన్యవాద కుసుమాంజలి)
ఓం మంగళం- ఓంకార మంగళం
జయము మంగళం-జగన్నాథ మంగళం
శుభం మంగళం-శుభాకార మంగళం
సత్య మంగళం-సచ్చిదానంద మంగళం
నిత్య మంగళం-నిరాకార మంగళం
మహాదేవ మంగళం-మహనీయ మంగళం
అర్థనారీశ్వర అందుకో మంగళం.
జయ మంగళం-నిత్య శుభ మంగళం
జయమంగళం-నిత్య శుభ మంగళం.
సర్వం సదాశివ పాదారవిందార్పణమస్తు
Attachments area
SIVA SANKALPAMU-107
ఓం నమః శివాయ-107
********************
భక్తుల కంఠస్థమైన శితికంఠుని స్తోత్రములకు-దండాలు శివా
పృథ్వీలింగమైన ఏకామ్రేశ్వరునికి -దండాలు శివా
అగ్నిలింగమైన అరుణాచలేశునికి-దండాలు శివా
జల లింగమైన జంబుకేశ్వరునికి-దండాలు శివా
వాయు లింగమైన శ్రీ కాళహస్తీశ్వరునికి- దండాలు శివా
ఆకాశలింగమైన చిదంబరేశ్వరునికి- దండాలు శివా
సూర్యబింబ లింగమైన కోణార్క దేవునికి-దండాలు శివా
చంద్ర బింబలింగమైన చంద్రకోన దేవునికి-దండాలు శివా
భక్తి ఆలింగనమైన మహాలింగమునకు -దండాలు శివా
(ఓం) న-మ:-శి-వా-య అను పంచాక్షరికి-దండాలు శివా
దం-డా-లు-శి-వా అను ఐదు అక్షరములకు-దండాలు శివా
సుస్పష్టపు ఇష్టమైన అష్టమూర్తికి-దండాలు శివా.
పంచభూతములు-సూర్యుడు-చంద్రుడు-జీవుని కలయికయే అష్టమూర్తితత్త్వము.
జగత్ ఈశ ధీయుక్త సేవనం-భగవాన్ రమణమహర్షి.
చరాచరాత్మకములన్నియు ఈ ఎనిమిది శక్తుల సంగమమే.సూక్ష్మముగా మనలో పంచభూతములుగా,సూర్యునిగా కంటిని-బుధ్ధిని పాలిస్తూ,చంద్రునిగా మనసును మళ్ళిస్తూ,జీవుని లోని శక్తిగా అష్టమూర్తి సంగమము నెలకొన్నది.
సదా శివుడు అష్టమూర్తి తత్త్వముతో ఎనిమిది పేర్లతో ,భూతత్త్వమును వివరించు శర్వునిగా,జలతత్త్వమును వివరించు భవునిగా,అగ్నితత్త్వ ప్రతీకగా రుద్రనామముతో,వాయు తత్త్వధారియై ఉగ్ర నామముతో,ఆకాశ తత్త్వధారిగా గ్రీవా నామముతో,సూర్య ప్రతీకయైన ఈశాన నామముతో,చంద్ర తత్త్వ ప్రతినిధిగా మహాదేవ నామముతో,జీవునికి ప్రతినిధిగా యజమాన మూర్తి పశుపతి నామముతో ప్రకాశిస్తున్నాడు.శివుని అష్తమూర్తి తత్త్వమును అవగతము చేసుకొన్న జీవుడు శివుడుగా పరిణిని చెందుచున్నాడు.
శివోహం-శివోహం.
తెల్లారి పోయింది పల్లె లేచింది
పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది.
స్వామీ నీ దయతో ఈ రాతిరి తెల్లారుట వలన నా శరీరమునకు కమ్ముకున్న చీకట్లు తొలగి వెలుగు రేఖలతో నా కళ్ళు తెరుచుకుంటున్నవి.నా లోని ప్రతి అణువణువు జ్ఞానమయమవుతున్నది,నందివాహనా! .దీనిని కదలకుండా కళ్యాణ కర్తవై నన్ను అనుగ్రహించు .
ఇన్నాళ్ళు నేను పూజగా భావించబడినది పూజకాదని,నన్ను నేను మరిచిపోయి త్వమేవాహం (నువ్వే నేను-నేనే నువ్వు) భావనయే తరింపచేయగలిగినదను సత్యము ఇప్పుడిప్పుడే అర్థమగుచున్నది ఆదిదేవా.ఈ భావనను నాలో స్థిరముగా నిలుపు తండ్రీ.
నిజమును గ్రహించగలుగు వానికి శివమందిర ప్రాకారములు-ధ్వజస్తంభము-శివలింగము-అర్చకులు-నంది-బలిపీఠము-భక్తులు అన్నీ-అందరు శివస్వరూపముగానే దర్శనమిస్తారు అన్న నిర్ద్వంద్వము నీ దయతో అవగతమగుచున్నది.అనుగ్రహింపుము ఆదిదేవా.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-106
ఓం నమః శివాయ-106
********************
ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా
భక్తి మకరందమును చందనముగ పూయనా
ఆది-అనాది లేదంటు బూదిని నే పూయనా
శాంతి సహనపుష్పాలతో పూజలనే చేయనా
పాప రహితము అనే దీపము వెలిగించనా
పొగడ్తపూల వాసనలనే పొగలుగ నే వేయనా
లబ్బు-డబ్బు శబ్దాలతో స్తొత్రములే చేయనా
ఉచ్చ్వాశ-నిశ్వాస వింజామరలను వీచనా
అరిషడ్వర్గములు లేని ఆతిధ్యమునీయనా
హర హర మహాదేవ అంటు హారతులే ఇయ్యనా
దాసోహం-దాసోహం అంటు నే ధన్యతనే పొందనా
నా పక్కనే ఉన్నావురా చూడ చక్కనైన శంకరా!
అప్రాకృత శరీరం తం అతి మన్మథ రూపిణం శివా.
సచ్చిదానంద రూపాయ సదాశివాయతే నమః.
నా కోసం రూపమును ప్రకటించుకొని,నాచే పరిహాసము చేయించుకొని,పరమ దయతో నాకు పరతత్త్వమును పరిచయమును చేసిన పరమాత్మా! ఇప్పుడు ఎవరైనా నన్ను నీ రూపము గురించి అడిగారనుకో,ఆనందముతో నీ సూక్ష్మ తత్త్వముతో పాటు,నీ స్థూల రూపమును కూడా అగ్ని నీ ముఖమని-పరాపరాత్మకము ఆత్మ యని,కాలము గతి యని,భూమి నీ పాదపీఠమని,ఊరుపు గాలి యని,నాలుక జలోత్పత్తి స్థానమని,దిశలు(దిక్కులు) కర్ణంబులని,దివము నాభియని,సూర్యుడు కన్నులని,శుక్లము సలిలమని,జఠరము జలధులని,వేదములు (ఛందములు) ధాతువులని,పంచ ముఖములు విస్తరించినపుడు ఉపనిషత్తులని,హృదయమే ధర్మమని ఎంతో ఇష్టముతో నిన్ను దర్శించనీయి అష్టమూర్తి వైభవమును స్పష్ట పరచనీ తండ్రీ.అనుమానముతో మొదలైన భక్తి అనందాబ్ధిలో తేలియాడనీ.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-105
శివ సంకల్పము-105
************************
నువ్వు తిక్కలోడివని అంది నా మూఢత్వం
నిన్ను చక్కదిద్దాలనుకుంది నా మూర్ఖత్వం
నీకేమి తెలియదంది నా అహంకారం
నీకు తెలియచేయాలనుకుంది నా అంధకారం
నిన్ను గౌరవించలేనంది నా తాత్సారం
నీతో గారడి చేయాలనుకుంది నా మాత్సర్యం
నీకు నాగరికత లేదంది నాలోని ఆటవికం
నిన్ను నాగరికుడిని చేయాలంది నాలోని ఆధునికం
నీకు పాఠము చెబుదామనుకుంది నాలోని ఆర్భాటం
నీకు పరీక్ష పెట్టాలనుకుంది నాలోని ఆరాటం
సముద్రాన్ని పరీక్షించు ఉప్పుబొమ్మ నేనైతే
నా తప్పు చెప్పినావురా ఓ గొప్ప శంకరా.
ఆరూఢ భక్తిగుణ కుంచిత భావచాప
యుక్తైః శ్శివస్మరణ బాణ గణైరమోఘైః
నిర్జిత్య కిల్బిష రిపుం విజయీ సుధీంద్రః
సానంద మావహతిసుస్థిర రాజ్యలక్ష్మీ.
శివమే జగము-జగమే శివము
శివోహం శివోహం.
శివా! నీ అనుగ్రహ వృష్టిలో మునిగి పునీతుడనైన నేనేకాదు,మరెందరో బుధ్ధిమంతులు ధనుర్విద్యా సంపన్నతతో ధన్యులగుచున్నారు.వారి హృదయమనే ధనుస్సుకు నిష్కళంక భక్తి అనే నారి బంధించబడినది.నెరజాణలైన శివ నామములు అనే బాణములు అమ్ములపొదిని అలంకరించుచున్నవి.వారి ధన్యత నేమనగలను? అర్జునుని తో పాటు సమానముగా అందించిన నీ ధనుర్విద్యా చాతుర్యముతో వారు పాపములనే శత్రువులపై శివనామ బాణములను సునాయాసముగా సంధించుచు,భక్తి రాజ్యమునేలుచున్నారు భవబంధ విముక్తులై.స్వామి నీ కడగంటి చూపు చాలదా నన్ను కడతేర్చగ.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-104
ఓం నమః శివాయ-103
********************
చిలుకగ నే జన్మిస్తే చిదంబరుడ అంటాను
కోడిగ నే జన్మిస్తే కోటిలింగేశ్వర అంటాను
కాకిగ నే జన్మిస్తే కాళహస్తేశ్వర
ఆవుగ నే జన్మిస్తే అంబాపతి అంటాను
మేకగ నే జన్మిస్తే నే మేలమాడుతుంటాను
పాముగ నే జన్మిస్తే భృస్మేశ్వర అంటాను
ఏనుగుగ నే జన్మిస్తే ఏకాంబరేశ్వర అంటాను
కీటకముగ నే జన్మిస్తే నే కీర్తిస్తూనే ఉంటాను
జన్మకాదు ముఖ్యమనే కర్మసిద్ధాంతపు సాక్షిగా
ఏ జన్మలో నేనున్నా ఏలినవారి దయతో
"త్వమేవాహం" అని తలుస్తు నన్ను తరియింప చేయగా
బిరమున నన్ను బ్రోవరా పరమైన శంకరా.
" ఏషత్యేషజనిం మనోన్య కఠినం తస్మిన్నటానీతిమ
ద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః
నోచేదివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు
ప్రాయః స్సత్సు శిలా తలేషు నటనం శంభో కిమర్థం తవః."
ఓ తండ్రీ! నేను దుర్భాషలాడతానని నీకు ముందే తెలుసుకదా.అయినా నీ పితృవాత్సల్యము నన్ని విడిచిపెట్టలేదుకదా.అందుకే అవును అందుకే వీడు పుడతాడు.వీడి మనసు కఠినమైనది అయినప్పటికి నేను అక్కడ సంచరించాలని నా మీది ప్రేమతో ఎన్నో దివ్య భవనము (మెత్తని తివాచీలు కప్పినవి),పూలపానుపులు (సుతిమెత్తనివి) యజ్ఞవాటికలు (అతి పవిత్రమైనవి) ఉన్నప్పటికిని శిలాతలములపై నాట్యము చేసి,నా కొరకు పురాభ్యాసితుడవైనావు.నీ పాదములెంత కందిపోయినవో కదా.వాటిపై భక్తి అను లేపమును అద్దుతు నన్ను సేవించుకొనీయి శివా.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-103
ఓం నమః శివాయ-103
********************
చిలుకగ నే జన్మిస్తే చిదంబరుడ అంటాను
కోడిగ నే జన్మిస్తే కోటిలింగేశ్వర అంటాను
కాకిగ నే జన్మిస్తే కాళహస్తేశ్వర
ఆవుగ నే జన్మిస్తే అంబాపతి అంటాను
మేకగ నే జన్మిస్తే నే మేలమాడుతుంటాను
పాముగ నే జన్మిస్తే భృస్మేశ్వర అంటాను
ఏనుగుగ నే జన్మిస్తే ఏకాంబరేశ్వర అంటాను
కీటకముగ నే జన్మిస్తే నే కీర్తిస్తూనే ఉంటాను
జన్మకాదు ముఖ్యమనే కర్మసిద్ధాంతపు సాక్షిగా
ఏ జన్మలో నేనున్నా ఏలినవారి దయతో
"త్వమేవాహం" అని తలుస్తు నన్ను తరియింప చేయగా
బిరమున నన్ను బ్రోవరా పరమైన శంకరా.
" ఏషత్యేషజనిం మనోన్య కఠినం తస్మిన్నటానీతిమ
ద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః
నోచేదివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు
ప్రాయః స్సత్సు శిలా తలేషు నటనం శంభో కిమర్థం తవః."
ఓ తండ్రీ! నేను దుర్భాషలాడతానని నీకు ముందే తెలుసుకదా.అయినా నీ పితృవాత్సల్యము నన్ని విడిచిపెట్టలేదుకదా.అందుకే అవును అందుకే వీడు పుడతాడు.వీడి మనసు కఠినమైనది అయినప్పటికి నేను అక్కడ సంచరించాలని నా మీది ప్రేమతో ఎన్నో దివ్య భవనము (మెత్తని తివాచీలు కప్పినవి),పూలపానుపులు (సుతిమెత్తనివి) యజ్ఞవాటికలు (అతి పవిత్రమైనవి) ఉన్నప్పటికిని శిలాతలములపై నాట్యము చేసి,నా కొరకు పురాభ్యాసితుడవైనావు.నీ పాదములెంత కందిపోయినవో కదా.వాటిపై భక్తి అను లేపమును అద్దుతు నన్ను సేవించుకొనీయి శివా.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-102
ఓం నమః శివాయ-102
*********************
తామరలున్న కొలనులో తిరుగాడు కప్పను నేననుకో
తామసమడచి ఆ కప్పను తుమ్మెదగా మార్చరాదో
మధురసమున్న పాత్రలో తిరుగాడు తెడ్డుననుకో
మేధను అనుగ్రహించి తెడ్డును జిహ్వగ మార్చరాదో
కొమ్మకు చుట్టుకుని తిరిగాడు గాలిపటము నేననుకో
ఇమ్ముగ జాలిచూపి దానిని చుక్కల పక్కకు చేర్చరాదో
వాన నీరు వృధాచేయు సంద్రమునునేననుకో
పన్నీరై క్షుథతీర్చు పంటబీడు చేయరాదో
శివుడెంత అని అన్న గర్వపు గంగను నేననుకో
శివపాదమే తనకు సర్వమన్న గంగగా చేయరాదో
ఇన్ని మార్పు చేర్పులకు కూర్పువైన నిన్ను
ఎన్న తరము కదురా నా కన్నతండ్రి శంకరా.
" రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో
భీతః స్వస్థగృహం గృహస్థమతిధిః దీనః ప్రభుం ధార్మికం
దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా
చేతః సర్వ భయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం
శివానందలహరి.
ఓ మనసా! ఏ విధముగా నీటిలో కొట్టుకొనిపోవువాడు ఒడ్డును,అలిసిన బాటసారి చెట్టు నీడను,వర్షభయము కలవాడు ధృఢమైన ఇంటిని,అతిథి గృహస్థుని,దీనుడు ధార్మికుడైన ప్రభువును,చీకటిలో భయపడువాడు దీపమును,చలిలో వణుకువాడు మంటనుచేరునట్లుగా,సమస్త భయములను పోగొట్టి సుఖమునిచ్చు శివుని పాద పద్మములను ఆశ్రయింపుము.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-101
ఓం నమః శివాయ-101
********************
కాసు లేనివాడవని కానిమాటలన్నాను
బేసి కన్నులను చూసి రోసిపోయి ఉన్నాను
దోసములే నీ పనులని ఈసడించుకున్నాను
వేసమేమిటో అంటుఈసడించుకున్నాను
నీ కొండను ఎత్తినాడు నీ విల్లు ఎత్తలేదు కద
సహకారమునుఈయనిది అతని అహంకారమేగ
దిక్కు నీవు అనగానే పక్కనేఉంటావు
అహంకారమును వదిలేస్తే అధీనుడివి అవుతావు
స్వల్పకాలిక లయముతో శక్తినీస్తావు
దీర్ఘకాలిక లయముతో ముక్తిని ఇస్తావు
నిన్ను తక్కువన్న నా తెలివి పక్కదారి మళ్ళించి
మొక్కనీయరా భక్తితో ముక్కంటి శంకరా!
మూగమనసులు చిత్రములోని గౌరమా నీ మొగుడెవరమ్మా అను జానపద గీతిక జ్ఞానదీపికగా ప్రకాశిస్తోమి పరమేశ్వరా నీ తత్త్వమును అర్థమును చేసికొని తరించుటకు.
పురుషపాత్రధారి వ్యంగంగా రూపమును మాత్రమే ఇల్లు-వాకిలి లేనివాడు,బిచ్చమెత్తుకుని తిరిగేవాడు,ఎగుడు-దిగుడు కన్నులవాడు,జంగమదేవర నీ వాడా? అంటు పరిహాసముచేస్తే,శక్తిస్వరూపమైన స్త్రీ పాత్రధారి శివుని రూపము వెనుక దాగిన తత్త్వమును ,ఆకాశమే ఇల్లు,భూమియే వాకిలి అంటు పంచభూత తత్త్వమును పరిచయము చేయుటయే కాక,బిచ్చమడిగేది భక్తి-బదులు ఇచ్చేది ముక్తి,అని ఆదిదేవుని అవ్యాజ కరుణను అనుభవించమంటున్నది.ఎగుడుదిగుడు కన్నుల లక్ష్యమును కూడ బేసికన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు అంటు అగ్గికన్ను అంతరార్థమును అర్థమయ్యేలా చెబుతుంది.పాటతో పరమార్థమును చాటిన పండితునికి శతకోటి నమస్కారములు.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-100
ఓం నమః శివాయ-100
*******************
నీ సుతుడగు గణపయ్య అడ్డంకులు తొక్కాడు
నీవాహనమగు బసవయ్య పుష్టిని అందించాడు
నీకంఠాభరణము పొత్తముగా మారింది
నీ సగభాగపు గౌరమ్మ ఘంటము తానయింది
నీ సిగపూవగు గంగమ్మ గలగలా సాగింది
నీపరివారపు స్వచ్చంద సహకారములేగ
నీవే స్పురింపచేసిన నిందాస్తుతుల హేల
వికల్పములు పారద్రోలు శివ సంకల్పపు లీల
నా దిక్కైన శంకరుడు నాలోనే ఉన్నాడని
లెక్కలేని నా తిక్కను మక్కువతో నీకు ఇచ్చి
నీకు అక్కరే లేనివైన ఈ చక్కెర పలుకులను
నేనెక్కడ వ్రాసానురా?నా దిక్కైన శంకరా!
మహేశ పాప వినాశ నా హృదయవాస ఈశా
ఎంత భాగ్యమందినానో ఏలినావయా
భక్తి ఏదో పూజఏదో తెలియనైతిని
గుట్టు పట్టులేక నిన్ను తిట్టిపోస్తిని
మంత్రయుక్త పూజలేవి తెలియనైతిని
కుతంత్రముతో కూడి నిన్ను వెక్కిరిస్తిని
నిజము ఏదో నింద ఏదో తెలియనైతిని
బొమ్మ వెనుక బొరుసు నేను చూడనైతిని
చీకటేదో వెలుతురేదో తెలియనైతిని
ఏకమే అనేకమని నేనెరుగనైతిని
క్షమయు నీవైనవేళ నేను క్షేమమైతిని
రక్ష-రక్ష నామమే నా లక్ష్యమైనది.దేవా-మహేశా
ఏక బిల్వం శివార్ప
SIVA SANKALPAMU-99
>ఓం నమః శివాయ-99
*******************
శివ కుటుంబములోని "చిన్ని శిశువును" నేను
"ఆకలేస్తున్నదంటే" అన్నపూర్ణమ్మకు చెప్పు
"అన్నము నే తిననంటే" ఆ జాబిలిని కిందకు దింపు
"దాహమువేస్తున్నదంటే" ఆ గంగమ్మకు చెప్పు
"నేను ఆడుకోవాలంటే" ఆ లేడిపిల్లను పంపు
ఆటుపోటులన్నిటిని" ఆదరముతో" కప్పు
కనురెప్పగ పిల్లలను" కాచుటయే ఒప్పు"
కానిపనులు చేసినను" క్షమియించుటయే మెప్పు"
నిన్ను విడిచి ఉండలేక నిందించిన నా మనసు
తప్పు తెలిసికొన్నది" తరియిస్తున్నది నీ ఒడిలో"
లక్షణమగు ప్రేమతో" ఒక్క క్షణమైనను" నన్ను వీడక
రక్షను అందీయరా తక్షణమే శంకరా
నిన్ను విడిసి యుండలేనయా
కైలాసవాసా
నిన్ను విడిసి యుండలేనయా
కైలాసవాసా
lనిన్నుl
నిన్ను విడిసి యుండలేను
కన్నతండ్రి వగుట చేత
ఎన్నబోకు నేరములను
చిన్ని కుమరుడనయ్యా శివా
lనిన్నుl
సర్వమునకు కర్త నీవె
సర్వమునకు భోక్త నీవు
సర్వమునకు ఆర్త నీవు
పరమపురుష శివహర
lనిన్నుl
వరద పద్మ బాల శంభో
బిరుదులన్నీ కలవు నీకు
కరుణతోడ బ్రోవకున్న
బిరుదులన్నీ సున్నాలన్నా
lనిన్నుl
శివ మహాదేవ శంకర
నీవే తోడు నీడ మాకు
కావుమయ్య శరణు శరణు
దేవ దేవ సాంబశివ
lనిన్ను
Eka bilvam SivaarpaNam.
SIVA SANKALPAMU-98
ఓం నమః శివాయ-98
********************
సుగంధిపుష్టి కర్తకు సుప్రభాత దీపములు
నిటలాగ్ని హోత్రునికి నిత్య ధూప దీపములు
పాషాణపు దేవునికి ప్రభల వెలుగు దీపములు
కందర్ప దర్పునికి కర్పూర దీపములు
పరంజ్యోతి రూపునికి ప్రమిదలలో దీపములు
జలజాక్షునికి వేడుకగా జలములోన దీపములు
ప్రమథ గణాధిపతికి ప్రదోషవేళ దీపములు
ఆశాపాశ రహితునికి ఆకాశదీపములు
మా ఆర్తిని తొలగించే కార్తీక దీపములు
దీపములను పేర వెలుగు నీ నామ రూపములు
జాణతనము తోడుకాక జ్వాలాతోరణములో
చిక్కు కున్నావురా ఓ తిక్క శంకరా.
శివుడు చాలా పిరికివాడు.చీకటి అంతే భయపడుతు ఎవరు,ఎప్పుడు-ఎక్కద దీపములను వెలిస్తారా అని ఎదురుచూస్తూ,వెలించిన దీపముల నుండి తనకు కావలిసిన శక్తులను గ్రహిస్తూ,తనకు ఒక కన్నులో అగ్గి ఉందని,తాను జంబుకేశ్వరములో జలస్వరూపుడనని చెబుతూనే జలములో అరటిదొన్నెలలో భక్తులు పెట్టు దీపములకై ఎదురుచూస్తుంటాడు.చిదంబరములో ఆకాశతత్త్వమే నేనంటు భక్తులు ఇంకా ఆకాసదీపములను వెలించలేమిటబ్బ అని ఆలోచిస్తుంటాడు.పైగా తాను విరాగిని కనుకనే మన్మథుడిని సంహరించానని చెప్పుకుంటూనే "కర్పూరదీపం మయర్పితం" అని భక్తుడు అనగానే ముక్కుపుటాలను విస్తరింపచేస్తు,"కర్పూరదీపం మయ స్వీకృతం" అంటు సువాసనను పీలుస్తూనే ఉంటాడు.పైగా తాను కర్పూరగౌరం అంటు తన తెల్లని మేనిఛాయను గుర్తు చేసుకుంటుంటాడు.పరంజ్యోతికి ప్రమిదలలోని దీపమెందుకండి.సూర్యుని ముందు దివిటీల కాని మన స్వామి వద్దనడు.అవి ప్రమదభరితమే అంటూ పరుగులెత్తి మరి తీసుకుంటాడు.సుగంధపుష్టి కర్తట.ఏట్లా అయ్యడో చూసారా.సుప్రభాత దీపములనుండి సద్దుచేయకుండ తనకు కావలిసిన శక్తులన్నిటిని సంగ్రహిస్తాడు.(సద్దుచేయక్యండ)ప్రతినిధే ఇట్లా ఉంటే పాపము నమ్ముకున్న ప్రమథగనము పరిస్థితి ఊహిస్తేనే,ఉమాపతి నీ బండారం బయటపడుతోంది.ఇంకా చీకటి పడనేలేదు..కొంచంకొంచముగా ఆవరించుకుంటోంది.వెలుగు తాను తప్పుకోవాలనుకుంటోంది.ఇంతలోనే ,
ప్రదోషదీపములు వెలిగించండి అంటూ ఒకటే హడావిడి.గమనించారు అందరు శివుని బాగా.కాసేపు పొగిడి జ్వాలా తోరణము లోనికి ప్రవేశించి బయటకు రమ్మన్నారు.పాపము శివునికి చీకటి అంటే భయము పోగొట్టడానికే సుమండి.చాకచక్యముగా తప్పించుకొనే చతురతలేక , చేసేదిలేక సరేనన్నాడు.-నింద.
దోషము నమః శివాయ-ప్రదోషము నమః శివాయ
జ్యోతి నమః శివాయ-పరంజ్యోతి నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" కృష్ట పచ్యంచమే-అకృష్ట పచ్యంచమే" రుద్రము.
వ్యవసాయమునకు అనుకూలముగా ఉన్నిన నేలలో-దున్నని నేలలో సమబుధ్ధితో ప్రకటితమవుతానుతకు ఇంతకన్న ఏమి నిదర్శనముంటుంది శివా.దున్నని క్షేత్రమైన(శరీరమునును పంటకు పక్వము చేసిన పరమేశా! పాహిపాహి.నీ దృక్కులను నాగలితో (సీరంచమే) నా మనసనే బీడునేలను దున్ని,నీ కృపాకటాక్ష వృష్టితో చదునుచేసి-పంటను (నీ అనుగ్రహమే) పండించుటకు సిధ్ధము చేసిన కర్షకుడా దానిలో భక్తి-విశ్వాసము అను విత్తులను వేసి నన్ను అనుగ్రహింపుము.నా అజ్ఞానము కొంచము కొంచము నన్ను వీడుచున్నది.నీ అనుగ్రహము నా దారిని చూపించుచున్నది శుభసూచకముగా.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-97
ఓం నమః శివాయ-97
***************
కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవా
సిగపూవగు గంగమ్మ సిరులను అందీయగలదా
కట్టుకున్న గజచర్మము పట్టుపుట్టమీయగలదా
నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములనందీయగలదా
కరమున నున్న శూలము వరములనందీయగలదా
పట్టుకిఉన్న పాములు నీకు పసిడిని అందీయగలవా
కరుగుచున్న నగము తరగని సంపదనీయగలదా
కదలలేని చంద్రుడు ఇంద్రపదవినీయగలదా
కాల్చున్న కన్ను నీకు కాసులనందీయగలదా
ఆదిశక్తి అండనున్న ఆదిభిక్షువైన నిన్ను నమ్మి
" ఒం దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ" అంటుంటే
ఫక్కుమని నవ్వారురా ఓ తిక్క శంకరా.
శివుడు ధరించిన రుద్రాక్షలు-గంగమ్మ-ఎద్దు-శూలము-మంచుకొండ-చంద్రుడు-అగ్గి కన్ను సంపదలనిచ్చు శక్తిలేనప్పటికిని,భక్తులు అమాయకంగా దరిద్రమనే దుఃమును కాల్చివేసి,ఐశ్వర్య ప్రదుడు శివుడని నమ్మి, కీర్తిస్తుంటేనవ్వుకుంటూ వింటుంటాడేకాని,అది అబధ్ధమని చెప్పడు-నింద.
ధనికుడు-నమః శివాయ-దరిద్రుడు నమః శివాయ
భావము నమః శివాయ-భాగ్యము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
దారిద్ర దుఖః హరణ స్తోత్రము-వశిష్ట మహర్షి విరచితము.
***********************************************
1.నరకము దాటిస్తాడు-సకలము పాలిస్తాడు
శృతులను వినిపిస్తాడు-సుధలను కురిపిస్తాడు
సర్పాలను ధరిస్తాడు- కర్పూరపు కాంతివాడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.
2.. పాము కంకణముల వాడు-పార్వతి మెచ్చినవాడు
యమునికి యముడైనవాడు-తోయమును ధరించాడు
కరిచర్మము ఒలిచాడు-కళాధరుని మెచ్చినోడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.
3. జలధిని దాటిస్తాడు-జన్మలు తీసేస్తాడు
భక్తుల దగ్గరి వాడు-భ్రష్టుల శిక్షిస్తాడు
వెలుగు గుప్పిస్తాడు-స్మరణతో నర్తిస్తాడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు
4. మూడు కన్నులవాడు-మువ్వల పాదముల వాడు
బూడిద పూతల రేడు-భువనైక మనోహరుడు
చర్మము ధరియించుతాడు-కర్మలు తొలగించుతాడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.
5. ముల్లోకములు వాడు-మూలస్థానము వాడు
పసిడి వస్త్రములవాడు-ప్రసాద గుణమే వాడు
చీకటి కూల్చేస్తాడు-చీకును తుంచేస్తాడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్రహృదతుడు శివుడు.
6. బ్రహ్మ కొలుచు వాడు-బ్రహ్మాండములు వాడు
కాలసాక్షి ప్రియుడు-కాల కాలాంతకుడు
చూడచక్కని రేడు-మూడు కన్నుల వాడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు
7.శ్రీ రామునికి సఖుడు-కైలాస నిలయుడు
సేవగణ సేవితుడు-కైవల్య వరదుడు
పాములు మెచ్చినవాడు-పావన చరితుడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.
8. సామి శివగణములకు-సామగాన ప్రియుడు
నామ స్మరణ ప్రియుడు-నంది వాహనుడు
కర్మఫలమిస్తాడు-చర్మ వస్త్ర ధరుడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.
ఏకబిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-96
ఓం నమః శివాయ-96
********************
ఎత్తైన కొండలలో భోగనందీశ్వరుడనని అంటావు
చేరలేనంత ఎత్తులో చార్ధాంలో ఉంటావు
లోయలలో హాయిగా త్రిసిల్లిరి మహాదేవుడనని అంటావు
దూరలేనంత గుహలలో అమరనాథుడివై ఉంటావు
కీకారణ్యములలో అమృతేశ్వరుడనని అంటావు
ఏదారులలో వేడుకగా అమృతేశ్వరుడనని అంటావు
కనుమల దగ్గర కామరూపకామాఖ్యుడనని అంటావు
జలపాతాల లోతులలో బాణేశ్వరుడనని అంటావు
భూగర్భమున దాగి హంపి విరూపాక్షుడినని అంటావు
ఈదలేనంత గంగఒడ్డున ఈశ్వరుడినంటావు
నామదిని వదిలేసావు దయలేక తెలియదుగా
నీకు ఎక్కడ ఉండాలో ఓ తిక్క శంకరా.
శివుడు ఎత్తైన కొండలలో-లోతైన లోయలలో-ఎడారులలో-కీకారణ్యములలో-ఎక్కడెక్కడో ఉంటాడు కాని నిత్యము నిర్మలభక్తితో కొలిచే భక్తుని మదిలో ఉండాలని తెలియనివాడు.-నింద.
ఎత్తు నమఃశివాయ-లోతు నమః శివాయ
అడవి నమః శివాయ -ఎడారి నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" గుహాయాం గేహేవా బహిరపి వనేవాద్రి శిఖరే
జలేవా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలం
సదా యస్త్యైవాంతహ్కరణమపి శంభో తవపదే
స్థితంచేద్యోగోసౌసచ పరమయోగీ సచ సుఖీ"
శివానందలహరి.
పరమశివా నీ నిజతత్త్వమును తెలిసికొనలేని నా మనసును గుహలోకాని-ఇంటిలోకాని-వెలుపల కాని-పర్వతశిఖరముపై కాని నీటిలో కాని,నిప్పుపై కాని నిలిపిన ఏమి లాభము? పరమదయాళు!దానిని ఎల్లప్పుడు నీ పాదపద్మములయందు స్థిరముగా నిలిచియుండు యోగమును అనుగ్రహింపుము.స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-95
ఓం నమః శివాయ-95
***************
రూపివా/అరూపివా/అపురూపివా? శివా నీవు
కన్నతండ్రిని చూడ నే కాశిపోవ కానరాడు
దేవతల మోహమడచ మొదలు-చివర కానరాడు
చిదంబరము పోయిచూడ చిన్నగను కానరాడు
అటుచూడని-ఇటుచూడని ఆటలెన్నో ఆడతాడు
నింగిలోకి సాగుతాడు-నేలలో దాగుతాడు
అగ్గినంటి ఉంటాడు-గాలినేనే అంటాడు
జ్యోతిని నేనంటాడు-ప్రీతిని నీకంటాడు
ఈ వలసలు ఎందుకంటే చిద్విలాసమంటాడు
దాగుడుమూతలు ఆడుతు పట్టుకోమంటాడు
సుందరేశ్వరడునంటాడు ముందున్నానంటాడు
ఒక్కరూపునుండవేమిరా ఓ తిక్కశంకరా.
శివుడు తనమాటలతో మనలను తికమకపెట్టటానికి చూస్తుంటాడు.అరుణాచలములోని అగ్గి,కంచిలోని మట్టి,చిదంబరములోని గగనం,జంబుకేశ్వరములోని నీరు,శ్రీకాళహస్తిలోని గాలి నేనే నంటుంటే,మిగత ప్రదేశాలలో వేరే రూపాలలో శివుడులేడా అనే సందేహము మనకు రాదా? అసలే మనము చాలా తెలివైనవారముకదా.శివుని తెలివితక్కువ మాటలను నమ్మలేము కదా.అందుకని అదే విషయమును అడిగితే మాటమారుస్తూ మీరు కాశికి వచ్చి చూడండి.అక్కడి వెలుగు అంతా నేనే అంటూ ప్రగల్భాలు పలుకుతాడు.చాల్లే నీ బడాయి మాటలు అని అనుకునే లోపలే ఇదిగో మీకు నాపేరు చెబుతున్నాను అంటు మథురలో నున్న సుందరేశుని పేరును మహగొప్పగా చెబుతాడు.చాల్లే సంబడం అంటే ఏమాత్రము వినకుందా అన్ని జ్యోతిర్లింగాలలో నున్నది తానేనని ,మనతో సరదాగా ఆగుడుమూతలాట ఆడుతున్నానంటూ మాటలతో మరింత గారడి చేస్తూ,మనలను బురిడీ కొట్టిస్తాడు.అమ్మో ఎంత జాణతనము కాకపోతే తన చేతకాని తనాన్ని మన చేవలేని తనముగా చూపాలనుకుంటాడు.-నింద.
కాలడి నమః శివాయ-గారడి నమః శివాయ
బడాయి నమః శివాయ-బురిడీ నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః
సద్దుమణిగిన సత్వగుణము నిద్దురలేచిందేమో అన్నట్లుగా నా మనసులోని రజోతమోభావములు చేసేదిలేక దూరముగా జరుగుతు నక్కినక్కి చూస్తున్నాయి.నీ సంగతి తెలిసినదిలే .నేను నీతత్త్వము కొంచం కొంచం అర్థమవుతోంది.కాసేపు ఇద్దర్ము ఆడుకుందాము నా మాటలను అవునన్నా-కాదన్నా అది నాకు శిరోధార్యమే శివా.
శ్రీ తనికెళ్ళ భరణి గారికి నమస్కారములతో,
ఎంత మోసగాడివయ్యా శివా-నువ్వెంత వేషగాడివయ్యా శివా
పైన మూడు నామాలంటా శివా నీకు
లోన వేయి నామాలంటా శివా
బయటకేమో తోలుబట్టలంటా శివా నీకు
లోపల పీతాంబరాలంటా శివా
బయటకేమో లింగరూపమంటా శివా నీకు
లోపల శ్రీరంగమంటా శివా
కడతీర్చేవాదవీవె శివా మమ్ము
కాపాడేవాడవు నీవే శివా
ఎంత పిచ్చివాదవయ్యా శివా
ఎంత పిచ్చి వాడివయ్యా శివా
నీవెంతా మంచివాడవయ్యా శివా
నీవెంత మంచివాడివయ్యా శివా
ఎంతెంత ఎంతెంత మంచివాడివయ్యా శివా-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-94
ఓం నమః శివాయ-94
**************
గణపతిని శిక్షించగ గజముతలను పెట్టావు
దక్షుని రక్షింపగ మేకతలను పెట్టావు
నరసింహుని శాంతింపగ పక్షితలతో వెళతావు
కుక్కుటేశ్వరుడనంటు కోడితలతో ఉంటావు
నారదుని కనువుప్పు కోరి కోతి తలను పెట్టావు
తుంబురునికి సంబరముగ గుర్రపు తల పెట్టావు
శుభకరుడితదనుచు శుకము తలను పెట్టావు
పతంజలి అంటు మనిషికి పాముతలను పెట్టావు
తలరాతల మార్పులంటు తలలనే మారుస్తుంటావు
వెతలను తీరుస్తానంటు కతలనే రాస్తావు
నా కతవినిపించానంటే నా తల మారుస్తావేమో
తలమానికము నేనంటు తలల మార్పుచేర్పులతో
తలకొక మాదిరిగ తరియింపచేయువాడిననే నీవి,
దిక్కుమాలిన పనులురా! ఓ తిక్కశంకరా.
శివుడు సుందరేశ్వరుడనని చెప్పుకుంటూ సుందరముగా ఉన్నవానిని,వారిని క్రీడలుగా ముఖములను మారుస్తూ,బహుముఖములుగా మనలను రక్షిస్తున్నానంటున్నాడు.గణపతికి ఏనుగుతల.దక్షునికి మేకతల,నారదునికి కోతి తల,తుంబురునకు గుఱ్ఱము తల, శుక మహర్షికి చిలుకతల, పతంజలి అను పామునకు మనిషి తల పెట్టతమే కాకుండా నన్ను చూడండి నేనుకూడా కోడితలతో,పాము తలతో,పులితలతో ఎంత బాగున్నానో అని చెబుతూ,తన దిక్కుమాలిన పనులనే చక్కదిద్దు పనులను భ్రమలో ఉంటాడు శివుడు.
తల,-నింద.
కతలు నమః శివాయ-వెతలు నమః శివాయ
శరభుడు నమః శివాయ-శర్వుడు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" భ్రంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా
హ్లాదో నాదయుతో మహాసి తవపుః పంచేణా చాదృతః
సత్పక్షో సుమనో వనేషు న పునః సాక్షాన్మదీయే మనో
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసి విభుః."
శివానందలహరి.
భృంగి ఇష్టపడునట్లుగా నాట్యము చేయువాడును,గజాసురుని మదమణచిన వాడును,ఢక్కా నాదమును చేయువాడును,శుధ్ధస్పటిక తెల్లదనమును కలవాడును,నారాయణునకు ప్రియమైన వాడును,సజ్జనులను కాపాడుటలో మంచిమనసున్న శ్రీశైల భ్రమరాంబిక పతి శరణు-శరణు.స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-92
ఓం నమః శివాయ-93
***************
నీ చిన్మయముద్రను నేను అనురక్తితోచూస్తుంటే
నీ తలపని గంగమ్మ నన్ను తుంగతొక్కుతానంటున్నది
నీ జటాజూటము నన్ను దక్షుడు అనుకుంటున్నది
నీ శిరమున శశి గ్రహణము నాకేనని అంటున్నది
నీ కంఠములోని విషము నన్ను కబళించాలనుకుంటున్నది
నీ చేతి డమరుకము నా వివరము అడుగుతున్నది
నీ నడుము పులితోలు కలవరమేఅంటున్నది
నీ వాహనమైన ఎద్దు నన్ను గద్దిస్తోంది
నీ మంజీరమైన పాము నాపై బుసలు కొట్టుతున్నది
వేడుకొనుట దేవుడెరుగు నిన్ను చూడనీయకున్నవి
నీ వైనము ఏమిటి? నావైపు చూడవు భయముతో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నానురా ఓ తిక్క శంకరా!
శివ దర్శనమునకై వెళ్ళిన భక్తుని శివుని గంగ-జటాజూటము-చంద్రుడు-విషము-డమరుకము-పులితోలు-మంజీరము ఎద్దు ఎద్దేవా చేస్తూస్వామి దగ్గరకు వెళ్ళనీయకున్నవి.శివుడు వాటిని మందలించలేని అసమర్థతతో,కళ్ళుమూసుకొని ధ్యానముద్రలో నున్నట్లు నటిస్తున్నాడు.
వైనము నమః శివాయ-ధ్యానము నమః శివాయ
భయము నమః శివాయ-అభయము నమః శివాయ
నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ
సత్వగుణమును సద్దుమణిగించి తమో-రజోగుణములను తాళ్ళతో బంధింపబడిన నేను,నీవు వేరు-నేను వేరు అను తామసభావన,బింబ-ప్రతిబింబ వైనమే నిన్ను ఆశ్రయించి ఆనందించుచున్న అమృతమూర్తులను అన్యముగా భావించునట్లు(భ్రమించునట్లు)నా మసకబారిన మనోఫలకముపై ముద్రించుచున్నది.మహాదేవ నా తప్పును మన్నించి నీ సేవాభాగ్యమును అనుగ్రహించు తండ్రీ.
" జటాభిర్లంబమానాభిరృత్యంత మభయప్రదం
దేవం శిచుస్మితం ధ్యాయేత్ వ్యాఘ్రచర్మ పరిష్కృతం"
వ్రేలాడుచున్న జటలతో కూడినవాడై,నృత్యము చేయుచున్న వాడును,అభయమునిచ్చువాడును,స్వచ్చమైన చిరునగవు కలవాడును,వ్యాఘ్రచర్మముచే అలంకరింపబడినవాడును అగు సదాశివుని ధ్యానించెదను.-స్తుతి.
ఏకబిల్వం శివార్పణం
SIVA SANKALPAMU-91
ఓం నమః శివాయ-91
*********************
పాట పాడుచు నిన్ను చేర పాటుపడుతు ఒక భక్తుడు
నాటకమాడుచు నిన్నుచేర పోటీపడుతు ఒకభక్తుడు
నాట్యమాడుచు నిన్నుచేర ఆరాటపదే ఒక భక్తుడు
కవితవ్రాయుచు నిన్నుచేర కావ్యమైన ఒక భక్తుడు
తపమాచరించి నిన్నుచేర తపియించుచు ఒక భక్తుడు
ప్రవచనముల నిన్నుచేర పరగుతీయు ఒక భక్తుడు
చిత్రలేఖనములతో నిన్నుచేర చిత్రముగా ఒక భక్తుడు
నిందిస్తూనే నిన్నుచేర చిందులేయు ఒక భక్తుడు
నిలదీస్తూనే నిన్నుచేర కొలిచేటి ఒకభక్తుడు
అర్చనలతో నిన్నుచేర ముచ్చటనుచు ఒకభక్తుడు
ఏదారిలో నిన్నుచేరాలో ఎంచుకోలేని ఈ భక్తుడు
నువ్వు నక్కతోక తొక్కావురా ఓ తిక్కశంకరా.
శివుడు అనిశ్చిత
మనస్కుడు.ఒక క్రమపధ్ధతిని తన విషయములోను అనుసరించలేడు.అంతే కాదు భక్తులను తాను త్వరగా అనుగ్రహించుటకు ఒకేఒక చక్కని మార్గమును చెప్పలేడు.చేసేదిలేక పాపము వారు పాటో,ఆటో,కవితో,నాటకమో,ప్రవచనమో,చిత్రలేఖనమో తమకు తోచినది ఏఓ ఒక మార్గమును ఎంచుకొని,ప్రయత్నిస్తూ,ఫలితమునకు ఎదురుచూస్తుంటారు.కాని విచిత్రమేమంటే నక్క తోకను తొక్కిన ప్రదేశమును శాంతికై తవ్విస్తుంటే లంకెబిందెలు దొరికినట్లు అయోమయము దేవునకు అనేకానేక భక్తులు-నింద.
ఏకము నమః శివాయ-అనేకము నమః శివాయ
గమనము నమః శివాయ-గమ్యము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
సకలదేవతా శివస్తుతి
****************
1. దేవదేవ త్రినేత్రాయ అందుకో వందనములు
జటామకుట కపర్ది అందుకో వందనములు.
2.భూత భేతాళ నాథాయ అందుకో వందనములు
రక్త పింగళ నేత్రాయ అందుకో వందనములు.
3.భైరవ ఊర్థ్వకేశాయ అందుకో వందనములు
అగ్ని నేత్ర చంద్రమౌళి అందుకో వందనములు.
4.బ్రహ్మ కపాల మాలాయ అందుకో వందనములు
బ్రహ్మాండ కాలాతీతాయ అందుకో వందనములు.
5.కరిగర్భ నివాసాయ అందుకో వందనములు
కరి మస్తక పూజ్యాయ అందుకో వందనములు.
6.ప్రచండదందహస్తాయ అందుకో వందనములు
ప్రపంచ పూర్ణ వ్యాప్తాయ అందుకో వందనములు.
7.నీలకంఠ త్రిసూలాయ అందుకో వందనములు
లీలా మానుష దేహాయ అందుకో వందనములు
8.అష్టమూర్తి యజ్ఞమూర్తి అందుకో వందనములు
దక్షయజ్ఞ వినాశాయ అందుకో వందనములు.
9.వేద వేదాంగ వక్త్రాయ అందుకో వందనములు
వేద వేదాంత వేద్యాయ అందుకో వందనములు
10.సకలసన్మంగళ విగ్రహాయ అందుకో వందనములు
సకల దేవతాస్తుతాయ అందుకో వందనములు.
ఇది మహా పురాణాంతర్గత సకల దేవతా స్తుతి సకలాభీష్ట ప్రదం. సర్వమంగళ కరం. సదా శివ కృపాకటాక్ష కరం.
( ఏక బిల్వం శివార్పణం.)
ఓం తత్ సత్.
SIVA SAMKALPAMU-90
ఓం నమః శివాయ-90
*****************
అసత్యమాడు బ్రహ్మపుర్రె అంతగా నచ్చిందా
ఆభరనముగా చేసి అలంకరించుకున్నావు
హింసకు గురిచూసే బోయకన్ను నచ్చిందా
రక్తాశ్రువులను కార్చ అనురక్తిని చూపావు
అమ్మ దగ్గర ఉండనన్న అర్భకుని వాక్కు నచ్చిందా
అమృతధారగ మారి ఆర్ద్రతనందించావు
స్వార్థమే నింపుకున్న కరి ఉదరము నచ్చిందా
ఉదారతను చూపిస్తు ఒదిగిఒదిగి పోయావు
పృష్టభాగమున పూజలందు ఆవుచెవి నచ్చిందా
లంకకు నేరానంటు గోకర్ణమున నిలిచావు
పెంపును అందించుతావో పంపు అని చంపుతావో
పెక్కుమాటలేలరా ఓ తిక్క శంకరా.
ఓకే గూటి పక్షులు ఒద్దికగా ఉంతాయన్న సామెతను పెద్దలు చెప్పారు కద!ఒకే స్వభావము కలవారు ఒకరినొకరు విడువలేనంత సఖ్యముగా ఉండుతలో వింత ఏమీలేదు కదా.
శివుడా అవలక్షణ సంపన్నుడు.మరి శివుడు ఇష్టపడే వస్తువులు-మనుషులు అవలక్షణాలతో ఉండకపోతే ఎలా?శివుడు లోపభూయిష్ఠములను పాపరహితములుగా మారుస్తున్నానన్న భ్రమలో మునిగి,అబధ్ధాల బ్రహ్మపుర్రెను దండగుచ్చుకొని అలంకరించుకుంటాడు.అబధ్ధము చెప్పిన తన తోకను అటు-ఇటు తిప్పిందని (దురదవేసి విసురుకున్నదేమో)సత్యము పలికిందన్న
"గొప్పసాక్షి" అను బిరుదును దానికిచ్చి,పధ్ధతిగా రావణునితో లంకకు పోకుండా,దానిచెవి వంటి ఆకారముగల ప్రదేశములో(గోకర్ణము) తాను నిలిచి పోయాడు.అబధ్ధాలు ఇషమైనవి.సరే.దానికి మించిన స్వార్థము కలవారికి కూడ పరమార్థము తెలుసంటు పోయి వారి ఉదరనివాసము చేయుటయే కాక,చర్మమును కూడా తాను వస్త్రముగా ధరించే స్థితికి వచ్చాడు.అయ్యో-అయ్యయ్యో.మాతృదేవోభవ అని కృతజ్ఞతగా తల్లిని దగ్గరుండి చూసుకోవలసిన ఒక్కడే అయిన కొడుకు,టక్కరితనముతో తన కాలిని మొసలి పట్టుకున్నదని,అది విడువాలంటే తల్లి సన్యాసమును స్వీకరించుటకు అనుమతించాలని మాయమాటలతో పారిపోయిన వాడికి ధారణశక్తినొసగి దయచూపించాడు.అన్నిటికన్నా విడ్డూరము.రాయి కంటె కఠినమైన మనస్సుతో,కౄరత్వము కన్నునిండా నింపుకుని హింసకు గురిచూసే తిన్నని కన్ను నచ్చిందంటు అమాయకముగా తన కన్ను నుండి రక్తమును కార్చుకున్నాడు.ఎంతన్న లయకారుడిని అంటూ అందరిని అంతమొందించే అవలక్షణమున్నవాడుకదా.తప్పులుచేసే వాటికి మెప్పులు అందిస్తూ,తాను గొప్పవాడిననే భ్రమలో ఉంటాడు శివుడు.
సులక్షణము నమః శివాయ-అవలక్షణము నమః శివాయ
తప్పులు నమః శివాయ-తత్త్వము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
వన్నే యేనుఁగుతోలు దుప్పటము బువ్వా కాలకూతంబు చే
గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మే
ల్నిన్నీలాగున నుంటయున్ దెలిసియు న్నీపాదపద్మంబు చే
ర్చె నారాయణుఁడెట్లు మానసముఁ దా శ్రీకాళహస్తీశ్వరా!
ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీవు కట్టునది ఏనుగుచర్మము, ఆహారమా కాలకూటవిషము, చేతిలో బ్రహ్మదేవుని కపాలము, మెడలో భీకరమైన సర్పము. ఇంత ఉగ్రమైన ఆకారము కలిగిన నిన్ను చూసి కూడా ఆ శ్రీమన్నారాయణుడు సదా తన మనస్సును నీ ధ్యానమందు ఏ విధముగా నిలిపినాడో కదా ప్రభో? అటువంటి నిష్కళంక మనసును అనుగ్రహించి,నన్ను ఉధ్ధరింపుము శివా.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-12
తనోతు నః శివః శివం-12 ***************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...