Monday, September 14, 2020

SIVA SANKALPAMU-94

ఓం నమః శివాయ-94 ************** గణపతిని శిక్షించగ గజముతలను పెట్టావు దక్షుని రక్షింపగ మేకతలను పెట్టావు నరసింహుని శాంతింపగ పక్షితలతో వెళతావు కుక్కుటేశ్వరుడనంటు కోడితలతో ఉంటావు నారదుని కనువుప్పు కోరి కోతి తలను పెట్టావు తుంబురునికి సంబరముగ గుర్రపు తల పెట్టావు శుభకరుడితదనుచు శుకము తలను పెట్టావు పతంజలి అంటు మనిషికి పాముతలను పెట్టావు తలరాతల మార్పులంటు తలలనే మారుస్తుంటావు వెతలను తీరుస్తానంటు కతలనే రాస్తావు నా కతవినిపించానంటే నా తల మారుస్తావేమో తలమానికము నేనంటు తలల మార్పుచేర్పులతో తలకొక మాదిరిగ తరియింపచేయువాడిననే నీవి, దిక్కుమాలిన పనులురా! ఓ తిక్కశంకరా. శివుడు సుందరేశ్వరుడనని చెప్పుకుంటూ సుందరముగా ఉన్నవానిని,వారిని క్రీడలుగా ముఖములను మారుస్తూ,బహుముఖములుగా మనలను రక్షిస్తున్నానంటున్నాడు.గణపతికి ఏనుగుతల.దక్షునికి మేకతల,నారదునికి కోతి తల,తుంబురునకు గుఱ్ఱము తల, శుక మహర్షికి చిలుకతల, పతంజలి అను పామునకు మనిషి తల పెట్టతమే కాకుండా నన్ను చూడండి నేనుకూడా కోడితలతో,పాము తలతో,పులితలతో ఎంత బాగున్నానో అని చెబుతూ,తన దిక్కుమాలిన పనులనే చక్కదిద్దు పనులను భ్రమలో ఉంటాడు శివుడు. తల,-నింద. కతలు నమః శివాయ-వెతలు నమః శివాయ శరభుడు నమః శివాయ-శర్వుడు నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " భ్రంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా హ్లాదో నాదయుతో మహాసి తవపుః పంచేణా చాదృతః సత్పక్షో సుమనో వనేషు న పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసి విభుః." శివానందలహరి. భృంగి ఇష్టపడునట్లుగా నాట్యము చేయువాడును,గజాసురుని మదమణచిన వాడును,ఢక్కా నాదమును చేయువాడును,శుధ్ధస్పటిక తెల్లదనమును కలవాడును,నారాయణునకు ప్రియమైన వాడును,సజ్జనులను కాపాడుటలో మంచిమనసున్న శ్రీశైల భ్రమరాంబిక పతి శరణు-శరణు.స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...