Sunday, September 29, 2019

 ప్రియ మిత్రులారా,దేవీశరన్నవరాత్రుల శుభకామనలు.
 ***************************************
  తెలుగు మొదటి నక్షత్రమైన అశ్విని ని అనుసరించి,
ఆశ్వయుజ-కార్తిక మాసముల శరద్రుతువును గౌరవిస్తూ ఆదిశక్తి రూపాలైన దశవిద్యా తత్త్వమును గురించి తెలుసుకొనేటందుకు చేసే ప్రయత్న్మే ఇది.మొదటి అడుగు.అమ్మ చేయి పట్టుకుని అర్థము చెప్పమని చేసే అభ్యర్థన ఇది.కనుక విజ్ఞులైన మీరు ఇందలి దోషములను సవరించుట అమ్మ సేవగా భావించి,నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ,  నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

  అమ్మ సేవలో అందమైన పరిమళ పద్యపుష్పములను సమర్పించుచున్న ప్రసాద్ నిమ్మగడ్డ ( నా తమ్ముడి ని) అభినందిస్తూ,ఆశీర్వదిస్తూ,అమ్మ కృప అనవరతము వర్షించాలని కోరుతూ,చిరంజీవి సాయి ప్రసన్న అమ్మరూపములో వచ్చి అత్యంత అమూల్యమైన సహాయ సహకారమును అందించినందులకు ఆశీర్వదిస్తూ మీముందుంచటానికి ప్రయత్నిస్తాను.

శార్దూలము

పాళీమ్ హార కపాలధారి రుధిరామ్ ప్రాముఖ్య మాలాన్వితాం
కేళీమ్ జిహ్వ మహారుణారుచి భయక్రీడావచూడాస్ధి కం-
గాళీ రాక్షస భంజనేన రణరంగాలింగనోత్సాహికామ్
కాళీమ్ కాలకలాప దంత ధవళా  కార్యానువర్తీమ్ శివమ్!

భావము: కపాలముల సమూహమును హారముగా ధరించి, రక్తము రంగు పూలమాలను కూడా ధరించి, ఎర్రని కాంతివంతమైన నాలుకతో, విరబోసుకున్న జుట్టుతో, ఎముకలతో, భయక్రీడగా నీచమైన రాక్షస సంహరణ చేయుటకై రణరంగమునే  ఆలింగనము చేసుకొనే ఉత్సాహముతో,  తెల్లని దంతములుగలిగి, (జగత్కళ్యాణ) కార్యములను వెంటవుండి చేసే ఓ కాళీ, శుభము చేకూర్చుము!! 



    శ్రీమాత్రే నమః
    **************
 " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
   భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా
   బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా
   ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."

   నమామి మహాకాళి విద్యాం నిరంతరం.
 ************

  " యుగాది సమయే దేవీ శివం పరగుణోత్తమం
   తదిఛ్చా నిర్గుణం శాంతం సచ్చిదానంద విగ్రహం
   శాశ్వతం సుందరం శుక్లం సర్వదేవయుతం వరం
   ఆదినాథం గుణాతీతం కాళ్యా సంయుతం ఈశ్వరం."


  ఆవిర్భావ కారణము.
 ***************

 "" యా చిన్మయీ పరాదేవీ త్రిపురా త్రివిధా భవత్
    దేవకార్య సుసిధ్ధ్ర్యర్ధం అసురాణాం వధాయచ
    మహత్యాపది సంప్రాప్తే దేవా సంతుష్టువుర్భృశం
    తదాసా చిన్మయీ శక్తిః కాళీరూపా బభూవహ"

     దేవకార్యసిధ్ధి కోసము పరాశక్తి అయిన త్రిపురసుందరి కాళీ-లక్ష్మీ-సరస్వతీ రూపాలుగా ఆవిర్భవించినది
         త్రిశక్త్యైకరూపిణీ నమో నమః.

ఆవిర్భావ విధానము
***************

 కాళీమాత అవతరణ విషయమై దేవీ సప్తశతిలో రెండు విధములైన అభిప్రాయములున్నవి.

 మొదటిది మథుకైటభ రాక్ష వధకై బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రార్థించగా,విష్ణువు యొక్క నేత్రములు-నాసిక-కర్ణములు-బాహువులు-హృదయము-వక్షస్థలము నుండి తేజరిల్లిన మహాశక్తియే కాళివిద్య యని భావిస్తారు.

  రెండవ విషయమునకు వస్తే చండ-ముండ రాక్షస వధకై అంబిక యొక్క కనుబొమల మధ్యనుండి ఆవిర్భవించిన శక్తియే కాళి అని భావిస్తారు.

  దక్షిణే కాళికా పాతు ఘ్రాణయుగ్మమ్మహేశ్వరి.

 శ్రీ కావ్యకంఠగణపతి ముని కాళిశక్తిని పరిణామశక్తిగాను,కాలశక్తిగాను క్రియాశక్తిగాను,అండ-పిండ-బ్రహ్మాండ సంహారశక్తిగాను ఆరాధించి,తరించినారు.నమోనమః.


  కదలకున్నట్టి శక్తియే ఘనుడు శివుడు
  కదలి వచ్చిన కాళి జగద్వ్యవస్థ
  ద్వైతభావమ్ము లేదెల్ల చేతనమ్మె
  సకలమన్నను నదియె నిష్కలయు నదియె

  అని తెలియచేసినారు విజ్ఞులు.మూలశక్తి సమయ సందర్భములను అనుసరించి అనేక రూపములను,ధర్మములను అనుసరిస్తు,ధర్మరక్షణ ను కొనసాగిస్తుంది అనుట నిర్వివాదము. కాళి శక్తి ఆవిర్భావమునకు ఇక్కడ రెండు సందర్భములను స్మరించుకుందాము.( నా ప్రయత్నము మేరకు).




  ఆవిర్భావము.
  ************

   శివుడు పగటికి ప్రతీక.ఒక్కొక్క మహావిద్య రాత్రియై,శివతేజమును కలుపుకొని,రాత్రిందివ సమ్మేళనాన్ని సంపూర్ణము చేస్తుంది.కాళికాదేవి అవతరణము వైదికమే.ఆ దేవి ప్రళయరాత్రిని సూచిస్తుంది.సమస్త భూత సృష్టిని తన రూపములో లీనము చేసుకునే శక్తిని కాళరాత్రి అనికూడా కీర్తిస్తారు.శివశక్తైకరూపిణి నమో నమః.. మమనామసహస్రంచ మయాపూర్వం వినిర్మితం
 మత్స్వరూపంకకారాద్యం మహాసామ్రాజ్యనామకం.-----

 కృష్ణమూర్తి కాళి అన్నారు పెద్దలు.

స్వరూపము
*********

 " శివారూఢాం మహాభీమాం ఘోరదం ష్ట్రాం వరప్రదాం
    హాస్యయుక్తాం త్రినేత్రాంచ కపాల కర్త్రికా కరాం
    ముక్తకేశీంలలజ్జిహ్వాం పిబంతీం రుధిరం ముహుః
    చతుర్బాహుయుతాం దేవీం వరాభయరాంస్మరేత్."


 సాకార-నిరాకార కాళిస్వరూపములను గురించి పరికిస్తే కాళిమాత అరూపతను తమస్సుగాను,అగ్నిగాను,నిష్కల బ్రహ్మము గాను విజ్ఞులు భావిస్తారు.

 "భక్త ప్రాణప్రియా దేవీమహాశ్రీచక్ర నాయికా
  తత్రబిందౌ పరం రూపం సుందరంసుమనోహరం."

కాళిమాత నల్లనివర్ణమును కలిగియుంటుంది.అవర్ణత్వశక్తి దీని అంతరార్థము.అనగా తననుండి అన్నిరంగులను సృష్టించే శక్తికలది.మాంసము ఎండిపోయి,అస్థిపంజరము వంటి శరీరముతో కనిపిస్తుంటుంది.ముఖము విశాలముగా ఉంటుంది కాని ముఖములోని నాలుక విలవిల్లాడుతు కొట్టుకుంటు ఉంటుంది.ఎర్రని లోతైన కళ్ళతో ఉగ్రశక్తియై ఉంటుంది.దశదిశలను భయకంపితులను చేసే వికటాట్టహాసము చేస్తూ ఉంటుంది.పదిచేతులు-పది కాళ్ళు,ముండమాలను ధరించి పచ్చిమాంసమును తింటు-పచ్చినెత్తురు తాగుతుంటుంది.

ఆయుధములు
***********
 " ఖడ్గినీ మాలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా
   శంఖినీ చాపినీ బాణా భుశుండీ పరిగాయుధా."


   ఖడ్గము-బాణము-శూలము గద శంఖము-చక్రముపరిగె,ధనువు మొదలగువానిని ధరిస్తుంది.సమయ-సందర్భములను బట్టి మంత్రస్వరూపములైన ఆయుధములను ప్రయోగించి దుష్ట్వమును దునుమాడుతుంటుంది.

 స్వభావము
 ***********
" కాలరాత్రిః మహారాత్రిః మోహరాత్రిశ్చ దారుణా
   త్వం శ్రీస్త్వం ఇశ్వరీత్వం హ్రీస్త్వం బుధ్ధిః బోధలక్షణాః"

  మహావిద్యా మహామాయా మహామేథా మహాస్మృతిః
  మహామోహాచ భవతీ మహాదేవీ మహాసురీ

   ప్రకృతిస్త్వంచ సర్వస్య  గుణత్రయ విభానినీ."

 ఆశ్వయుజ కృష్ణపక్ష తిథిని ఇష్టపడుతుంది.కాలబంధనములు లేని సర్వజ్ఞ.కాలాతీత-గుణాతీత సర్వశక్తిమంతము.సూక్షముగా సకలజీవుల దేహాలలోను,స్థూలముగా జగద్దేహములోను కుం డలినీశక్తిగా కదలాడుతుంటుంది.ఉత్తర దిక్కును కాళి-తార శక్తుల దిక్కుగా భావిస్తారు.


 కృష్ణ-రక్త వర్ణభేదాలతో కాళికాదేవి రెండు విధములుగా ఉంటుందట.కృష్ణవర్ణ పేరు దక్షిణ అని,రక్తవర్ణ పేరు సుందరి అని బృహన్నీలతంత్రము తెలియచేస్తున్నది.కాళీమాత క్రియాశక్తికి ప్రతీక.తన భక్తులను అనుగ్రహించే ఉదారస్వభావము కలది.దయాంతరంగ.సామర్థ్యముకలది-దాక్షిణ్యము కలది కనుక తల్లి దక్షిణగా కీర్తింపబడుతోంది.


 దేవిభాగవత కథనముప్రకారము తల్లి మథుకైటభ రాక్ష సంహారి అని స్తుతించుచున్నప్పటికిని,జీవులలోని నాది-నా వాళ్ళు అనే మాయయే మథువు.దాని చుట్టు తిరుగు ఆలోచనలే కైటభము అదేనండి తుమ్మెద.భ్రమ చుట్టు తిరిగేది భ్రమరము.నాది అను మాయను తొలగించే పరాత్పరి మహాకాళి.
నివాసము
*****

రక్తము సదా ప్రవహించే అనాహతచక్రము కాళి నివాసము.గుండెలోని నాళాలు తల్లి నాలుకలు.నిత్యము గుండెలో మునిగిరక్తాన్ని పీల్చి-విడుస్తు ,ఊపిరిగా మారుస్తు ఉంటుంది రక్తకాళి.మనలో రక్తప్రసరణ చేయుచున్న క్రియా శక్తి.

దేవాలయములు
**************

ఉజ్జయినిలో,కలకత్తాలో,చంద్రాపూరులో,వరంగల్లులో ఇంకా అనేకానేక పవిత్ర క్షేత్రములలో తల్లి కొలువై,కొలిచినవారికి కొంగుబంగారమవుతోంది.
అంతరార్థము
 *************


 నిశితముగా పరిశీలిస్తే గతి-స్థితి రెండు తల్లి లీలలే.గతి అంటే చలనము,స్థితి అంతే స్థిరముగా మనమూన్వయించుకుంటే జగత్తును నిలిపేదే ప్రళయాంధకారములో సమస్త ఆకారములు సమానముగా మారి,గుప్తస్థితిని (గుర్తించలేని) పొందుటనిష్కల బ్రహ్మమగుట అనివార్యము.ఇంకొక విధముగా అన్వయిస్తే గతి అంటే ఆకర్షణ.స్థితి అంటే సంసారచక్రము.దీనివైపుకు ఆకర్షితులమై సత్యము కనుగొనలేని చీకటిలో గుప్తస్థితిని పొందిన సమయమున తల్లిరెండిటికి తాను బిందువై సమ్న్వయ పరుస్తు,సదా ఆశీర్వదిస్తుంటుంది

  ఫలసిధ్ధి.
 **********
 " ప్రథమ దశమహాశక్తి,శ్రీమాత దక్షిణపార్శ్వ రక్షకురాలు యైన కాళి భక్తులు,

  "శూన్యాగారే శ్మశానేనా ప్రావరే జలమధ్యతః
   వహ్ని మధ్యేచ సంగ్రామే తథా ప్రాణస్య సంశయే" నున్నను తల్లి వారిని వెన్నంటి కాపాడుటయే కాక,  శ్రీ మహాకాళి ఆరాధన సకల వ్యాధులనుండి,బాధల నుండి విముక్తులను చేస్తుంది.దీర్ఘాయువు,శత్రునాశనము,సకలలోక పూజనీయతను అనుగ్రహిస్తుంది.

 " కాలికా తస్య గేహేచ సంస్థా కురుతే సదా."

" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
  తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.

  అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ
  దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.





  " కాళీ కపాలినీ కాంతా కామదా కామసుందరీ
    కాలరాత్రీ కాళికాచ కాలభైరవ పూజితాః"

  యాదేవీ సర్వభూతానాం కాళిరూపేణ  సంస్థితాం,
  నమస్తస్త్యై  నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.



   ( శ్రీకాళిమాత చరణారవిందార్పణమస్తు.)

































PADISAKTULA PARAMAARTHAMU.-KAALI.

 పదిశక్తుల పరమార్థము - కాళి ప్రథమశక్తి.
 ************************
 ప్రియ మిత్రులారా! మీకు తెలియని విశేషములు కావు.కాని నా తపన అమ్మ తత్త్వములోని మీ అందరితో పంచుకోవాలనే .ఈ ప్రక్రియ ప్రణాలికకు తన అమూల్యమైన సమయమును-విజ్ఞానమును అందించిన భక్తునిపై ఆ తల్లి దయ అనవరతము వర్షించనీ.ద్వంద్వమయమైనఈ జగతిలో రాత్రింబవళ్ళు-సుఖదుఃఖములు-జ్ఞాన-అజ్ఞానములు-కలిమి-లేములు-ఉఛ్చ్వాస-నిశ్వాసములు-స్త్ర్ర్పురుషులు ఉన్నట్లే శ్రీవిద్యోపానలో దక్షిణాచార-వామాహారములు ప్రాంతములను బట్టి,పరిసరములను బట్టి పరంపరను బట్టి ద్వివిధములుగా నున్నందున కాళి శక్తిని పూజావిధానమును తాంత్రికముగా అనుకుంటు అనుగ్రహమునకు దూరమవుచున్నాము.

  అర్థనారీశ్వరమైన మహాశక్తి కాళి తన సామర్థ్యముతో సామరస్యము కల్పిస్తూ,లయబధ్ధముగా ఊగిసలాడుస్తూ( కాలస్వరూపముగా)జగతిని ఒక స్థితి నుండి మరొక స్థితికి నడిపిస్తున్న కాళీతత్త్వము ఎంతగొప్పదో మనము అర్థముచేసుకుంటే మాట కరుకు-మనసు చెరుకు అన్నట్ల్కుగా కాళి తత్త్వము లోని సమభావము ( అగ్నితత్త్వముగా అన్ని వస్తువుల యందు సమభావము,కాలాతీత స్వభావము గతము తలచుకోదు-తెలియని భవిష్యత్తు ఆలోచించదు)సృష్టి-స్థితి-లయములకు చలించని స్థితప్రజ్ఞత ,లోభమోహములకు దూరము,అన్నిటికన్న ముఖ్యమైనది పునర్నిర్మాణ క్రియాశీలత మనము పాటిస్తే ద్వంద్వ వైఖరి తొలగి తల్లీ నువ్వే నేనే నీవు అని త్వమేవాహం కామా.అలా మనలను మలచు ఆ మహాకాళి మన అమ్మ కదా!

  మహాకాలి మాత చరణారవిందార్పణమస్తు.

YAA DEVI SARVABHOOTESHU-02

   యాదేవి సర్వ భూతేషు-02
   ********************
  రెండవ దశమహావిద్య-తారాదేవి.

  కాలికాదేవిని ఆదిమతమస్సుగా భావిస్తారని మనము చెప్పుకున్నాము.ఆ తమస్సునుండి తేజోపుంజముగా మేరుశిఖర మధ్యనుండి కాలిక సృష్టించిన జగమును సంస్కరించుటకు తేజోరేఖగా వెలువడిన తల్లి తారాదేవి.తన భక్తుడైన గణపతి ముని ఉమాసహస్ర పద్యములకు తన అంగీకారము-ఆనందమును తల్లి ఆకాశములో మెరుపు రూపముగా తెలియచేసినదని ఆర్యోక్తి.
 " యాదేవి సర్వభూతేషు తేజోరూపేణ సంస్థితా." అమ్మా అనేక నమస్కారములు.

  దేవతలు ధర్మసంస్థాపనకై కాళిమాతను ప్రార్థించగా తన రౌద్రరూపమును కొంతమేరకు తగ్గించుకొని(ఉపసంహరించుకొని) తారాదేవి రంగములోనికి దిగినదని భావిస్తారు.ఉదాహరణకు కత్తిని కత్తెరచేసినది.సంహరణను సవరణ గా మార్చినది. " యాదేవి సర్వభూతేషు సహన రూపేణ సంస్థితా."

  కాళిక పునర్నిర్మించిన విశ్వమునకు తారాదేవి వాక్కును ప్రసాదించి సంస్కరించినది.వాక్కు పరా-పశ్యంతీ-మధ్యమా-వైఖరీ అని నాలుగు విధములుగా వర్గీకరించబడినది.మేఘగర్జన-గాలికి చెట్ల ఆకులు ఊగుతూ చేయు ధ్వనులు-పక్షుల-పశువుల అరుపులు మొదటి మూడు వర్గములకు చెందినవి.గుత్పప్రణవము శబ్దమును చేరి దానిని అర్థవంత పదముగా మార్చుచున్నది.అదియే తారాశక్తి.కాళిమాత అగ్నితత్త్వయై జ్ఞానమును ప్రసాదిస్తుంటే.తారాదేవి చంద్రతత్త్వముతో మనసును సక్రమమైన ఆలోచనలో,మాటలతో సక్రమ మార్గమున నడిపిస్తుంటుంది." యాదేవి సర్వభూతేషు వాగ్రూపేణ సంస్థితా."

  లోకాద్భుతమైనపున అవ్యయకాంతితో తల్లి గౌరిగాను,లోకసృష్టి రచనను చేయుచున్నప్పుడు నీలిరంగుగాను,లోకమాత యైడు చిత్ర వర్ణముగాను దర్శనమిస్తుందట.ధన్యోస్మి మాత.మునిగియున్న పనుల వైఖరిని బట్టి తెలుపు,నీలము,పసుపుఎరుపు ఆకుపచ్చ రంగులు సంకేతాలవుతాయి.

 " యాదేవి సర్వభూతేషు సర్వవర్ణోప సంస్థితా."

 బౌధ్ధవాజ్మయ కథనము ప్రకారము క్షీరసాగర మథన సమయమున ప్రభవిమ్హ్న శివుడు అచేతనుడు కాగా,తారాదేవి శివుని శిశువుని చేసి తనస్తన్యమునిచ్చి విషదోషరహితుని చేసెనట.శివుడు తల్లిని గురువుగా భావిస్తాడని చెబుతారు." యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా."




 

 

  తారాదేవి వాగధిదేవత.తల్లిది సమిష్టి వాక్య స్వరూపము.జ్ఞానుల ఆరాధనలో నున్నప్పుడు తారాదేవి వేదత్రయి.శుక్ల నామ సత్వగుణ భూషిణి.

   యోగులు తల్లిని తమహృదయములోని అవ్యక్త స్వయంసిధ్ధప్రణవముగా గుర్తించి,అంతర్యాగోన్ముఖులై ధ్యానించుచున్నప్పుడు తల్లి నామము నీల.

సామాన్య మానవుని నోట సత్యాసత్య రూపముగా వాకు వెలువడునపుడు ఆమె చిత్ర.

  " యాదేవి సర్వభూతేషు నానా నామేణ సంస్థితా.

 



















 కాళికాదేవి జలమయిన జగతిని పునర్నిర్మిస్తే,ఆమెకు తోడుగా తారాదేవి తాను వంతెనగా మారి ఆ జలప్రవాహమునుండి (సంసారము) శాశ్వతానంద స్థితికి జీవుని చేరుస్తుంది.యాదేవి సర్వభూతేషు తరణరూపేణ సంస్థితా."

  నాభీస్థానమున నివసిస్తూ,జీవుని (శిశువు) బొడ్డుతాటిని సం రక్షిస్తుంటుంది.యాదేవి సర్వరూపేషు రక్షారూపేణ సంస్థితా."

  చైత్ర శుక్లనవమి ప్రీతిపాత్రమైన తారాదేవిని నారాయణుని శ్రీరామావతారముగా భావిస్తారు.అద్భుత రామాయణము ఆ విషయమును మరింత స్పష్టము చేస్తున్నది.మూర్చిల్లిన శ్రీరాముని తారాదేవి రక్షించినదని.
" యాదేవి సర్వభూతేషు రమ్యరూపేణ సంస్థితా."

 నవగ్రహములలో చంద్రునికి అధిదేవతయైన తారాదేవి జీవుల మనో సంకల్పవికల్పములను పరిశీలిస్తు వాటిని సామరస్య మార్గమువైపుకు నడిపిస్తుంటుంది." యాదేవి సర్వభూతేషు జ్యోత్స్నారూపేణ సంస్థితా."

  మూలబిందువు నుండి కాళి వలె ఉత్తర దిసగా వ్యాప్తిచెందు క్రోధరాత్రిగా పిలువబడు తార,అక్ష్యోభ్యుడు అను పేరుగల శివశక్తిని తనలో లీనముచేసుకొని జగద్రక్షణ చేస్తుంది." యాదేవి సర్వభూతేషు ప్రకాశరూపేణ సంస్థితా."

  అమ్మతత్త్వమును అనుభవైవేద్యము చేసే ఆదిశక్తి రూపాలు దశమహావిద్యలు.అయినప్పటికిని వేటికి అవే ప్రత్యేక సామర్థ్యమును కలిగి ఉన్నవి.మన శరీరములోని కన్ను-ముక్కు-నోరు వలె.వాగధిదేవత యైన తారాదేవి వాక్కును పరిచయము చేసినది.శబ్దాధిదేవత కనుక అవ్యక్త ప్రణవమై సబ్డమును అర్థవంతము చేసినది."యా దేవి సర్వభూతేషు శబ్ద రూపర్ణ సంస్థితా."





TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...