Friday, December 17, 2021
VEMBAVAY-03
పాశురం-03
***********
ముత్తన్న వెణ్ నకయ మున్ వము ఎదురెళుందన్
అత్తన్ ఆనందన్ అముదన్ ఎన్ని ఎళ్ళోరి
తిత్తిక్కు పేశువాయ్ వందున్ కడై తిరవాయ్
పత్తుడయీర్ ఈశన్ పళ అడియార్ పాంగుడఈర్
పుత్తడియో పున్మై తీర్థాదు ఆట్కొండార్ పొల్లాదో
ఎత్తోనిన్ అంబుడమై ఎల్లోం అరియోమో
సిత్తం అళగియార్ పాడారో నం శివనే
ఇత్తనియుం వేండుం ఎమక్కేలో రెంబావాయ్.
పత్తుడయీర్ ఈశన్ పోట్రి.
**********************
రెండవ పాశురము మనోవృత్తులను వివరిస్తే ప్రస్తుత పాశురము సత్వగుణ సంశోభితమై ,
సత్వాన్ సంజాయతే జ్ఞానం అన్న భగవద్గీతా వాక్యమునకు ఉదాహరముగా మేల్కొలుపబడు చెలిగా ప్రకాశించుచున్నది.
ఆమె సత్వగుణశోభిత.రజో-తమోగుణములను జయించినది.ఆ విషయమును తిరు మాణిక్యవాచగరు,
ముత్తన్న వెణ్ నకయ అని ఆమెను సంబోధిస్తూ మనకు తెలియచేసారు.
చెలులు వచ్చి ఆమెను,
ముత్తన్న-మంచి ముత్యముల వంటి,
వెణ్-తెల్లనైన,స్వచ్ఛమైన
నకయ-పలువరుస కలదానా
నీవు నిన్న మాతో స్వామియే మన,
అత్తన్-తండ్రి -జగతః పితరో వందేం
మన రక్షకుడు అని,అంతే కాదు,
ఆనందన్-తలపే ఆనందాయకమని,
అంతటితో ఆగక,
అముదన్-అమృతస్వరూపుడు,మనకు జీవనాధారము అంటూ ఎన్నో మాటలు చెప్పావు.
మేము నీ దగ్గరకు రాకముందే నీవే,
మున్ చందు-మేకాంచి,
ఎదిరెళుందు -జాగరూకతతో,ఎటువంటి అజ్ఞానములేక,
మాకు ఎదురుగా వస్తానని చెప్పావు.కాని అవన్నీ మరచిపోయి ఇంకా నిదురించుచున్నావు.
కాని మాకు ఇప్పుడే తెలిసినది నీవన్ని,
అళ్ళూరి-కోతలే యని వాటిలో నిజములేదని అని నిందించారు.అయినా వారి అసహనము ఆగలేదు.
వారు సంభాషణమును కొనసాగిస్తూ,
తిత్తిక్క పేశువాయ్-అన్నీ గొప్పలు చెబుతావు.
నీవి కేవలము మాటలే కాని చేతలలో కానరాదు అని ఆమెను నిందిస్తున్నారు.
సరే ఇప్పుడైన వచ్చి తలుపు గడియ తెరువు అని అడుగుతున్నారు.
ఇక్కద తలుపు/తలుపు గడియ బాహ్యమునకు/ఆంతర్యమునకు మధ్య గడియను బిగిచి ఆమెను/మనలను బయటకు రానీయకుండా ఉన్నది.
మనము ముందు అంతర్ముఖము కావాలంటే బహిర్ముఖమును దాటి రాగలగాలి.అడ్దంకులను తొలగించుకొనగలగాలి.ఆ అడ్డంకులే గడియ.ఆ బహిర్ముఖమే లోపలిగది.
రెండవ పాశురములోని చెలియ మాటకు మాట చెప్పినది.
ప్రస్తుత పాశురములోని చెలి సవినశీలి.కనుక శాంతముగా వారికి తనకు శివభక్తిలో గల వ్యత్యాసమును విన్నవించుకొనినది.
చెలులారా మీరు ,
పాంగు-అడయారు-స్వామి పాదపద్మములను పొందిన పరమ భక్తులు.
పది సోపానములను ఎక్కి పరమేశుని అనుగ్రహమును పొందుచున్నవారు.
కాని నేను,
పుత్తు అడియో-కొత్తగా భక్తిని అలవరచుకొనుచున్నదానను.
తాము ఉధ్ధరింపబడుటయే కాక తోటి వారికి కూడా పరమశ్వరానుగ్రహమును అందించుటకు చేయూత నందించునది కదా.
మీ సాహచర్యముతో నా,
పున్మై-దోషములు
తెర్థాదు-నశించును కదా.
నన్ను మీతో నోమునకు తీసుకువెళ్లమని ప్రార్థిస్తున్నాను.
అట్కొండార్ పొల్లాదో-మీతో పాటుగా నన్ను తీసుకుని వెళ్లండి.
నీవు మాతో వచ్చి ఏమిచేస్తావని అడుగుతారేమో,
ఎల్లోం అరియోమో అందరము కలిసి,
సిత్తం అళగియార్-మనస్పూర్తిగా ,మైమరచి తన్మయత్వముతో,
నం-మనయొక్క
శివనే-పరమేశుని,శుభకరుని
పాడారో-కీర్తిద్దాము.
ఇత్తనియుం-ఇంక ఆలస్యము
వేండుం-వద్దు,
ఇంక జాగుచేయక ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటూ వారితో నొముచేయుటకు ఇంకొక చెలిని మేల్కొలుపుటకు బయలుదేరినది.
ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగర్
పత్తుడయీర్ అని పది శబ్దమును ప్రస్తావించారు.
పడి శబ్దమును పరమాత్మకు అన్వయించుకుంటే ,
మనలో దాగి దశ-ఇంద్రియములను నడిపించుచున్న పరమాత్మ.
భక్తుల పరముగా అన్వయించుకుంటే పది ఇంద్రియముల పరమార్థమును తెలుసుకుని వాటి ద్వారా పరమపదమును పొందువారు.
పరమేశుడు మనకు దశేంద్రియ సంస్కారమును అనుగ్రహించును గాక.
అంబే శివే తిరువడిగళే శరణం.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-12
తనోతు నః శివః శివం-12 ***************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...