Monday, December 20, 2021

PASURAMU-05

తిరుచిట్రంబలం-పాశురము-05 **************************** మాలరియ నాం ముగనుం కాణా మాలై ఇనైనాం పోలరివోం ఎన్రుళ్ళ పొక్కంగళే పేశుం పాలూరు తేన్వాయ్ పడిరీ కడై తిరవాయ్ న్యాలామే విణ్ణె పిరవే అరివరియాన్ కోలముం నమ్మై యాట్ కొండరుళి కోడాట్టు శీలముం పాడి శివనే శివనే ఎన్రు ఓలం ఇడినుం ఉడరాయ్ ఉడరాయ్ కాణ్ ఏలా కుళలి పరిశేలో రెంబావాయ్. తమస్వజ్ఞానజం విధ్ధి మోహనం సర్వదేహినాం ********************************** ప్రస్తుత పాశురములో మేల్కొలుపబడుతున్న చెలిని తమోగుణముతో నిడి,మాయచే కప్పబడిన దానిగా , ఏలా కుళలి అని సంబోధిస్తున్నారు. ఆమె, ఏళా-నల్లని తుమ్మెదరెక్కల వంటి,వత్తైన-పుడుగైన, కుళలి-కేశ సంపద కలిగినది. అంటే తమోగుణముచే కప్పివేయబడి,మాయ యను మోహమను సుగంధమనుకుని ఆఘ్రాణించుచున్నది. ఆత్మ స్వరూపమును అర్థముచేసుకొనలేక పోయినని పరమాత్మను దర్శించితి అనుచు ప్రగల్భములు పలుకు అమాయకత్వము కలది. కనుక ఆమె చెలులు ఆమెను , కడై తిరవాయ్ అని చెబుతున్నారు. చెలి ముందు నీవు నీవు నిదురించుచున్న తలుపు గడియను , తిరవాయ్-తెరువ వమ్మా.ఎందుకంతే బంధింపబడియున్న ఆ తలుపు గడియ నిన్ను తమో నిద్రలో బంధించుచున్నది. అదీ పడరీ కడై-, పదరీ-మోసపూరితమైన, కదై-గడియ కనుకనే అది నీచే, అబధ్ధములను చెప్పించుచున్నది.నీచే ఆత్మ వంచనను చేయిస్తున్నది అని అంటున్నారు. ప్రస్తుత పాశురములో నిదురిస్తున్న చెలి వారితో ఇంతకు ముందు (పాలతో తేనెలో ముంచీ) తేనెలొలుక వినిన వెంటనే నిజమని నమ్ము (నిజము కానప్పటికిని) పలుకులను పలికినది. పొక్కంగళే పేశుం-అబధ్ధములను చెప్పినది. అబధ్ధములు ఒకటి కాదు/రెండుకాదు గళ్-ఎన్నో/ఎన్నెన్నో చెప్పినది. అవి ఏమిటంటే, మాలరియా-విష్ణువు, నాన్ ముగన్-చతుర్ముఖుడైన బ్రహ్మ ప్రయత్నించి, ఆది అంతము కనుగొనలేక పోయిన అరుణాచలేశుని,జ్యోతి స్వరూపుని తాను తెలుసుకొనినానని సర్వసాధారణ విషయముగా చెప్పినది. న్యాలమే-భువన భాందములు, విణ్ణే-గగన భాగములన్నియును, పిరవే-మిగిలిన భాగములన్నియును వెతికినను కాణా -కనుగొనలేక పోయినారు ఎవరిని-పరమాత్మను ఎందుకంటే, స్వామి కోలం నమ్మై యాట్- కోలం-స్వరూపము దివ్య సందర్శనమును, ఎవరు ఏ విధముగా భావిస్తారో,ధ్యానిస్తారో వారికి ఆ దివ్యమంగళ సందర్శనమును అనుగ్రహించు ఆదిదేవుని, నీ తమోగుణము చూశానని మాతో చెప్పించుచున్నది.నీ కన్నులే కాదు నీ చెవులు సైతము నీకు సహకరించకున్నవి. కనుకనే దర్శిస్తూ-తన్మయత్వముతో , ఓ శివా,ఓ శివా అని భక్తులు చేస్తున్న సంకీర్తనము పలుదిక్కుల ప్రతిధ్వనిస్తున్నప్పటికిని,మమ్ముల మిగుల పరవశింప చేస్తున్నప్పటికిని, ఓలం ఇడినం-అద్భుత ఘోషణము స్వామిని సేవిస్తున్నప్పటికిని, నీవు, ఉడరాయ్-ఉడరాయ్-కదలవు-మెదలవు కనులు తెరవవు ఓ చెలి ఇప్పుడైనను లేచి, పడరీ కడై తిరవాయ్-నిన్ను ఆవరించియున్న చీకట్లను తరిమివేసి,నిన్ను అజ్ఞానముతో బంధించుచున్న గడియను తీసి,ఆ చీకటి గది నుండి బయటకు వచ్చి,మాతో పాటుగా శివనోమును చేయుటకు కదలవమ్మా,అని ఆమెను తమతో కలుపుకొని,వేరొక చెలిని మేల్కొలుపుటకు అడుగులను కదుపుచున్నారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి-పరబ్రహ్మమును తెలుసుకొని,అనుభవించగలుటయే పరమార్థము. తిరుమాణిక్యవాచగరు ఈ పాశురములోని చెలి ద్వారా ఆత్మశుధ్ధిలోని ఆచారమదియేల,భాండ శుధ్ధిలేని పాకమేల అన్న వేమన సూక్తిని మరొక్కసారి గుర్తు చేస్తూ,పరమాత్మ చేయు పరమాద్భుతములు స్వానుభవములే కాని సంభాషనములు మాత్రము కాదు అని అనిర్వచనీయ అనుభూతి అందించే ఆదిదేవుని అనుగ్రహమును కీర్తిస్తున్నారు. అంబే శివే తిరువడిగలే పోట్రి.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...