'రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా
రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రితా"
సత్యం-శివం-సుందరమయమిన స్థితికిచేరుటకు ద్వారమైన/జ్ఞానప్రదమైన "సర్వజ్ఞా సదనమూన ప్రవేశించుటకు పరమేశ్వరి వాత్సల్యము నన్నొక మెట్టు పైకెక్కించినది.
ప్రాకామ్యసిద్ధిమాత-సర్వవశంకరి ముద్రా మాత నా వెంటనేఉండి నన్ను నడిపిస్తున్నారు.
లోపలివైపునకు విచ్చుకొనియున్న పదితేజోమయ త్రికోణములతో వృత్తాకారముగానున్నది ఆ ఆవరనము,"అంతర్దాశము" అన్న నామము నన్ను మరింత ఆకర్షించినది.దీనినే "సర్వరక్షాకరచక్రమూ అని కూడా పిలుస్తారట.
ఆశ్చర్యము.అచ్చము మా అమ్మలాగానే ఉన్న పదిమంది అమ్మలు పరమవాత్సల్యముతో నన్ను ఏం నాయినా వచ్చావా అంటూ పలుకరిస్తున్నారు.నేను వారి దగ్గరిగా వెళ్లే లోపలనే,
'గర్భము అనగా ఆధారము
సర్వజీవసృష్టికి తల్లిగర్భము ఆధారము
నిగర్భము అనగా నిక్షిప్తపరచబడిన ఆధారము
సకలజ్ఞాన సిద్ధికి ఈ పదితల్లుల అనుగ్రహము ఆధారము"
అని చెబుతున్నారు.బహుశా నన్ను ఉద్ధేశించియేనేమో.
పిల్లలకు ఇష్టమైన పోషకమైన పదార్థములను దాచి తల్లి వారికి ఎలా తగినంత తినిపిస్తుందో,అదేరీతిగా సకలచరాచరములను తమకు ఆధారమైన అమ్మలగన్న అమ్మను చేరుటకు అడ్దంకులను తీసివేశి అర్హతను కలిగించే పరమకరుణాంతరంగలు ఈ పదిమంది అమ్మలు అన్నమాట.కాదు కాదు ఉన్నమాటే.
అమ్మలాగానేఉన్నా ఈపదిమంది అమ్మలను నేను ఎప్పుడు చూడలేదు.వారి మాటలను
అంటే---- ఇప్పటి వరకు నేను మా అమ్మనుకున్న ఆమె గర్భము నాకు ఉపాధిని ఇచ్చినది వాస్తవమే అయినప్పటికిని అది పాంచభౌతికమా?దానికి పదిమంది అమ్మరూపములుగానున్న తేజోశక్తులను(అగ్నిశక్తులను) దర్శించే శక్తిలేదా? మరి నేను ఇప్పుడెలా వీరిని స్పష్టముగాచూడగలుగుతున్నాను?
జవాబు రానే వచ్చింది లోపలినుండి.ఇప్పుడు నేనున్నది అంతర్దశారము.ఇప్పటి వరకు ఉన్నది బహిర్దశారము.అంటే ఐహికములు తొలగి అసలు నేను అర్థమగుచున్నది.కానిపూర్తిగా కాదు.
ఎదురుగా అద్భుత సన్నివేశములు.సంభాషణములు.
ప్రాకామ్యసిద్ధిమాత-సర్వేప్సిత సిద్ధిమాత చేతిలోచేతిని వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు.
నాకనుబొమలమధ్యన కదలికలు ప్రారంభమయినాయి.
ఇప్పుడు నేను,
అంతర్దశారచక్రములో ఒకచిన్నశిశువుని.పదిమంది తల్లులపాలనలోఉన్నాను.అదే ఉపాధి కాని నా మనోవృత్తులు మారిపోయాయి.వారిని చూడగలుగుతున్నాను నాలోని నేనుతో.
1.నాకు చీకటి అంటేభయమనిఒక అమ్మ తాను కాంతిగా మారి నాచేయి పట్తుకుని నడిపిస్తానని అంటున్నది.
2.నాబలము చాలదని మరొక అమ్మ తాని శక్తిగా మారి పుష్టిని ఇస్తానంటున్నది
3.ఇంకొక తల్లితాని వ్యాధివినాశినిని అవుతానంటున్నది.నా అనారోగ్యమును/అజ్ఞానమును అణిచివేస్తానంటున్నది.
4.
నాకు/నాసాధనకు ఎటువంటిలోటు రాకుండాచూసుకుంటానంటున్నది మరొకతల్లి.
5.నా అజ్ఞానమును పోగొడతానంటున్నది మరొక అమ్మ హామీ ఇస్తు.
నేను ఆధారమువుతాను-నేను ఆనందమవుతాను అంటూ పోటీపడుతున్నారు అమ్మలు.
అంతలో మరొక మాతాశక్తి నేను వీనికి సర్వకాల/సర్వావస్థలయందు తోడుగా ఉండి రక్షిస్తాను అంటోంది.సంతోషముతోచిందులు వేస్తున్నానునేను.
ఇంతకీ ఇది వారి సంభాషనములా/లేక నాకు చేసిన ఉపదేశములా.రెందవది అయిఉంటుంది.నాకు బాగా అర్థము కావాలని అలా చేసిఉంటారు.
ఇప్పటి వరకుఈ మాతలు నా శరీర జీర్నశక్తికి సహాయపడు శక్తులనుకున్న నా అవివేకము సిగ్గుతో పారిపోతున్నది.
తత్-త్వం-అసినువ్వు-నేను వేరుగా ఉన్నామూనుకుంటున్న నాకుకనువిప్పుకలిగి అహం బ్రహ్మాస్మి అనుకుంటున్నది.
ఆ భావనాశక్తియే "నేను" అంటే నాలోదాగియున్న సర్వరక్షాస్వరూపమైన నిన్నుగా పరిచయము చేసుకుంటున్నది.ఆ పరిచయ పరిమళమేకదా సర్వజ్ఞత్వముగానిన్ను భావింపచేయునది.
"సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధిక వర్జితా" అని కీర్తిస్తున్న చక్రేశ్వరి త్రిపురమాలిని ఆశీర్వచనముతో,ఈ సాధకుడు మరోమెట్టు ఎక్కి,"సర్వరోగహర చక్ర"ప్రవేశమును చేయుటకు సంసిద్ధుడగుచున్నాడు.
యా దేవిసర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.
వినలేదు.వారిఒడిలో నిద్రపోలేదు.